శ్రీకాకుళం

ప్రజాసమస్యలు పరిష్కారానికి గ్రామదర్శిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వజ్రపుకొత్తూరు, డిసెంబర్ 13: ప్రజాసమస్యలను త్వరితగతిన పరిష్కారించాలనే లక్ష్యంతో గ్రామదర్శిని కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తహసీల్థార్ ఎస్.రమణయ్య, ఎంపీడీవో తిరుమలరావులు అన్నారు. గురువారం యు ఆర్‌కెపురం, నువ్వలరేవుల్లో గ్రామదర్శిని గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు పరిష్కారానికి నోచుకోని సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలన్నారు. ఇటీవల తిత్లీ తుపాన్‌లో కొబ్బరికి బదులు జీడి విస్తీర్ణం జాబితాల్లో నమోదైందని, దీనిపై కార్యాలయాలకు పలుమార్లు దరఖాస్తులు చేసుకున్న పరిష్కారం జరగలేదని రైతులు అధికారులను ప్రశ్నించారు. ఇప్పటి వరకు రెండవ విడత నష్టపరిహారం బ్యాంకులకు జమ కాలేదని, ఎప్పుడు జమ అవుతాయో తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇవోపి ఆర్‌డి భానుమూర్తి, ఏవో ధనుంజయ, పశువైద్యాధికారి ఎం.పాపారావు, హౌసింగ్ ఎ ఇ రామ్మోహన్, ఎం ఇవో వరహాలశెట్టి తదితరులు పాల్గొన్నారు.
భూ వివాదంపై డీఆర్‌ఓ విచారణ
ఇచ్ఛాపురం, డిసెంబర్ 13 : మున్సిపాలిటీ పరిధి అమిన్‌సాహెబ్ పేట భూ వివాదంపై జిల్లా రెవెన్యూ అధికారి నరేంద్ర ప్రసాద్ గురువారం విచారణ జరిపారు. రికార్డులను పరిశీలించిన తర్వాత ఆర్డీఓ వెంకటేశ్వరరావు, తహశీల్దార్ ఎం.సురేష్‌తో కలిసి భూములను పరిశీలించారు. సమగ్ర సర్వే జరిపి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఒడిశాకు చెందిన వ్యక్తి తప్పుడు పత్రాలు సృష్టించి తమ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని బాధిత రైతులు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్‌ఓ విచారణ చేపట్టారు. ఇరువర్గాల వారితో మాట్లాడారు. డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని సూచించారు. 3వ వార్డు కౌన్సిలర్ సాలిన ఢిల్లీ, కాంగ్రెస్ నేత సాలిన మామయ్య, ఆర్‌ఐ కె.పి.రౌలో, వీఆర్‌ఓ సీతారామయ్య పాల్గొన్నారు.

బీజేపీతోనే సుస్థిరపాలన
మందస, డిసెంబర్ 13: భారతీయజనతా పార్టీ, ప్రధాని నరేంద్రమోడీ పాలనలో అన్ని రాష్ట్రాల్లో సుస్థిరపాలన సాధ్యమైందని బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కణితి విశ్వనాధం అన్నారు. గురువారం మండలంలోని నారాయణపురం, కేశుపురం గ్రామాల్లో తిత్లీ బాధితులకు దుస్తులు, నిత్యావసర సరుకులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బడుగు,బలహీనవర్గాల పేదలు కోసం 126 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, పేదలను ఆదుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్‌కు తిత్లీ తుపాన్ ప్రభావంతో 539 కోట్ల రూపాయలు సహాయం అందించారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా బాబు కాదనుకొని ప్రత్యేక ప్యాకేజీకి అమ్ముడుపోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర పథకాలను రాష్ట్రంలో తమ పథకాలుగా టీడీపీ ప్రచారం చేసుకోవడం విచారకరమన్నారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీ సభ్యులు అనర్హులకు పథకాలు మంజూరుచేయించి పథకాలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. మోడీ తన పరిపాలనతో పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. రానున్న ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పార్టీకి అత్యధిక స్థానాలు గెలిపించాలని కోరారు. బీజేపీ నాయకులు కొంచాడ సురేషు, మజ్జి పున్నయ్య, మధుబాబు, హరిశంకర్, రౌతు చిరంజీవులు, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

వాటర్‌షెడ్ పనుల్లో బయటపడ్డ అక్రమాలు
మందస, డిసెంబర్ 13: మందస మండలంలోని తాళ్లగురంటి వాటర్‌షెడ్ పరిధిలో ఎన్‌జీవో ఆధ్వర్యంలో 2014-18 సంవత్సరాల్లో చేపట్టిన పనుల్లో కొన్ని పారదర్శకతతో, కొన్ని అక్రమాలతో పనులు జరిగాయని సామాజిక ప్రజావేదికలో పీవో ఎల్.శివశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రాజెక్టు పరిధిలో 4 పంచాయతీల్లో 44 గ్రామాల్లో 148 పనులకు 1.5 లక్షల రూపాయలు వ్యయం చేయగా, ఎన్ ఆర్ ఎం ఇపి ఎ ఐసిబి విభాగాల్లో పనులను గత నాలుగు రోజుల్లో ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో నిర్వహించి, సామూహిక తనిఖీలను నిర్వహించారు. ప్రాజెక్టు వ్యయం 7.19 ప్రాతిపదనలు చేయగా, 81.5 వేలు వినియోగించారు. ప్రజాసామాజిక తనిఖీల్లో హోన్నాళి, బుడార్శింగి, చీపి, తాళ్లగురంటి పనుల్లో అక్రమాలకు రికవరీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పనుల్లో చనిపోయినవారు పేర్లు నమోదు చేసి అధిక నిధులు డ్రా చేసారు. ఎలక్ట్రికల్ కాటాలు, షామియాల పంపిణీలో లోపాలు బయటపడ్డాయి. రాజకీయనాయకుల ఒత్తిడితో కొన్ని గ్రామాల్లో టెంట్లు పంపిణీ చేయకపోవడం పట్ల ఐటీడీ ఎ పివో ఆగ్రహాం వ్యక్తం చేసారు. గిరిజన గ్రామాల ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకునే చర్యలు చేపడతామన్నారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములు ఇచ్చి ఎన్‌టి ఆర్ గృహాలను మంజూరు చేస్తామని, రక్షిత మంచినీటి పథకం ద్వారా గిరిజన గ్రామాలకు తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. పలు గిరిజన గ్రామాలు నుంచి ప్రజలు సమస్యలను పివోకు ఏకరువు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపిడి లక్ష్మి, పి.జగన్నాథం, తిరుపతిరావు, ఐటీడీ ఎ ఎ ఇ తవిటినాయుడు, సామాజిక తనిఖీ బృందం లక్ష్మణరావు, లక్ష్మి, గోపినాధ్ తదితరులు పాల్గొన్నారు.
రేషన్‌డీలర్లు సమ్మె నోటీసు
సోంపేట, డిసెంబర్ 13: రేషన్‌డీలర్లు రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఈ నెల 16వ తేది నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు సోంపేట మండల రేషన్‌డీలర్లు స్థానిక తహసీల్థార్ గోపాలరత్నంకు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. గురువారం డీలర్లు సంఘం అధ్యక్షుడు ఢిల్లీరావు ఆధ్వర్యంలో తహసీల్థార్‌ను కలిసి నోటీసు ఇచ్చిన వారు మాట్లాడుతూ డీలర్లు సమస్యల పరిష్కారం కోరుతూ వందలసార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డీలర్లుకు గౌరవవేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డీలర్లు, దుదిష్టి, సానా షణ్ముఖరావు, బైరిలతోపాటు పలువురు పాల్గొన్నారు.
శివ్వాంలో పూరిళ్లు దగ్దం
వంగర, డిసెంబర్ 13: శివ్వాం గ్రామంలో గురువాం 11 గంటల ప్రాంతంలో రజక కులానికి చెందిన శివ్వాపు చల్లమ్మ పూరిళ్లు అగ్నికి ఆహుతైంది. ఇంటిలో సామాగ్రీ, ధాన్యం, నగదు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మంటలను అదుపు చేసినా కొంత వరకు ఆస్తి నష్టం తప్పలదే. సమాచారం తెలుసుకున్న ఆర్ ఐ వెంకటగిరి నష్టాన్ని అంచనా వేశారు.
మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రి కావాలి
హిరమండలం, డిసెంబర్ 13:మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలనిమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. గురువారం మండలంలోని కల్లట గ్రామ సమీపంలో ప్రైవేటు కళ్యాణ మండపంలో కార్యకర్తలు, సేవా మిత్రల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భావితరాల అభివృద్ధితో పాటు రాష్ట్రం ఆర్థికంగా బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో మారినప్పటికీ తనతో వచ్చిన వైకాపా నాయకులు, కార్యకర్తలతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేయడంలో ఎటువంటి లోపాలు లేవన్నారు. విభేదాలు వీడి ఐకమత్యంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వెంకటరావు, మండల ప్రత్యేక ఆహ్వానితులు గవర చిట్టిబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు గేదెల జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సుబ్రహ్మణ్యస్వామి షష్టి మహోత్సవం
ఎల్ ఎన్‌పేట, డిసెంబర్ 13: మండలంలోని లక్ష్మీనర్సుపేట గ్రామంలో అమృతలింగేశ్వరాలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో షష్టి మహోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. వల్లి దేవసేన సమీప సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు నాగవరపు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు నిర్వహించారు. లక్ష్మీనర్సుపేట, మిరియాపల్లి, బసవరాజుపేట, ఎల్ ఎన్‌పేట తదితర గ్రామాల నుంచి భక్తులు పూజలు నిర్వహించారు.