శ్రీకాకుళం

శ్రామిక మహిళా ఉద్యోగ భద్రతకు నడుం బిగిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ (టౌన్), డిసెంబర్ 15: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామిక మహిళల ఉద్యోగ భద్రతపై నిర్లక్ష్యం వహిస్తున్నాయని, పోరాటాల కోసం నడుం బిగించాలని శ్రామిక మహిళల సంఘం నాయకులు ఎన్.హిమప్రభ, ఎ.పద్మావతి తదితరులు పిలుపునిచ్చారు. జనవరి 8,9 తేదీల్లో నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలన్నారు. ఐక్య ఉద్యమాలు ద్వారా ప్రభుత్వం నుంచి హక్కులు సాధించుకొనే ఆవశ్యకత ఉందన్నారు. ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాధించుకున్న చట్టాలను సైతం సవరించి తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని చెప్పారు. సీ ఐటీయూ నాయకులు రమణారావు మాట్లాడుతూ ఉద్యమాలు ద్వారా ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి.అమరవేణి, భవానీ, లక్ష్మీ, కె.గౌరీశ్వరి, ఆర్.్భగ్యలక్ష్మీ, టి.జయమ్మ, సరోజని, ఎ.్భస్కరరావు, ఎ.లక్ష్మణరావు, ఎం.అప్పలస్వామి, తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 23 నుంచి అగ్రిగోల్డ్ బాధితుల దీక్షలు
పాలకొండ (టౌన్), డిసెంబర్ 15: రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో రిలే నిరాహారదీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం గౌరవాధ్యక్షులు బుడితి అప్పలనాయుడు అన్నారు. శనివారం పట్టణంలోని వీధుల్లో బాధితులతో కలిసి జరిగిన అన్యాయంపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం బాధితులకు అందించేందుకు రూ.4 వేలు కోట్లు సహాయం ఇస్తుందని గతంలో చెప్పినప్పటికీ నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు హామీ నిలబెట్టుకోలేదన్నారు. మండలంలోని తంపటాపల్లి, చింతాడ గ్రామాల్లో అగ్రిగోల్డ్ దళ యాత్ర కార్యక్రమన్ని చేపట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఈ దీక్షలకు ప్రజలంతా మద్దతు ఇచ్చి బాధితుల పక్షాన నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎం.శ్రీనివాసులు, బంగారు దుర్గారావు, రమేష్ తదితరులున్నారు.
ఉచిత విద్యుత్‌పై అవగాహన
పాలకొండ (టౌన్), డిసెంబర్ 15: ప్రభుత్వం గిరిజన, దళితులకు అందిస్తున్న వంద యూనిట్లు ఉచిత విద్యుత్‌పై శనివారం అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. 19వ వార్డు కస్పావీధిలో ఆ శాఖ అధికారులు ప్రజలకు వినియోగంపై ప్రభుత్వ విధానాలను వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఈ కార్యక్రమం చేపట్టారని కౌన్సిలర్ ఎన్ని ప్రసాద్ చెప్పారు.

రహదారిపై మరమ్మతులు వేగవంతం చేయండి
పాలకొండ (టౌన్), డిసెంబర్ 15: నగర పంచాయతీలోని ప్రధాన రహదారి మరమ్మతులు వేగవంతం చేయాలని కౌన్సిలర్ గుమ్మిడి సింహాద్రి కోరారు. శనివారం ఆర్‌అండ్‌బీ జే ఈ రాజును కలిసి సమస్యను వివరించారు. రహదారిపై దుమ్ము రేగడంతో ప్రజలు, రహదారికి ఇరువైపులా ఉన్న వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దీనిపై జే ఈ స్పందిస్తూ ఇటీవల రహదారిని మరమ్మతులు చేసినప్పటికీ నిలవడం లేదని, దీంతో పూర్తిస్థాయి నిర్మాణానికి చర్యలు తీసుకున్నామన్నారు. బీటీ ప్లాంట్ సమస్య కారణంగా కొద్దిరోజులు ఆలస్యం జరిగిందన్నారు. ప్రజలు సహకరించాలని, వీలైనంత తొందరలో పూర్తిస్థాయిలో రహదారి పనులు నిర్వహిస్తామని చెప్పారు.

పాలిటెక్నిక్ విద్యతో ఉజ్వల భవిత
సరుబుజ్జిలి, డిసెంబర్ 15: పాటిటెక్నిక్ విద్య అభ్యసించడం ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆమదాలవలస ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ కె.నారాయణరావు అన్నారు. రొట్టవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పదో తరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక విద్యలో నైపుణ్య సాధిస్తే చక్కటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి హెచ్ ఎం టి.్ధనలక్ష్మీ, కళాశాల అధ్యాపకులు పి.శ్రీనివాసరావు, అనె్నపు గోపి, జి.వి.రమేష్, జి.తేజేశ్వరరావు, మందపల్లి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
మావోల ప్రభావం లేదని మరిచిపోతే ప్రమాదమే
అనునిత్య అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో మూడు పోలీస్‌స్టేషన్లకు కొత్త భవనాలు మంజూరు
*ఎస్పీ త్రివిక్రమవర్మ
కొత్తూరు, డిసెంబర్ 15: శ్రీకాకుళం జిల్లా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు జిల్లా కావడంతో ఏవోబీలో మావోల ప్రభావం లేదని, ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోతే ప్రమాదం పొంచి ఉండవచ్చునని జిల్లా ఎస్పీ డాక్టర్ సి. ఎం.త్రివిక్రమవర్మ స్పష్టం చేశారు. మావోల ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉన్నామన్నారు. జిల్లాలో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన మందస, బత్తిలి, కొత్తూరులో పోలీస్‌స్టేషన్ల నూతన భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్టు వివరించారు. శనివారం కొత్తూరు పోలీస్‌స్టేషన్ ఆవరణలో పారాపురం గ్రామానికి చెందిన యందవ నరేంద్ర అనే పెయింటింగ్ ఆర్టిస్ట్ ఖర్చులతో ఏర్పాటు చేసిన ఏపీజే అబ్దుల్ కలామ్ విగ్రహాన్ని ఎస్పీ ఆవిష్కరించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ ఇటీవల అరకు ఎమ్మెల్యేను మావోయిస్టులు హతమార్చిన నేపధ్యంలో జిల్లాలోని ఎమ్మెల్యే, ఎంపీ వంటి ప్రజాప్రతినిధులకు భద్రతను కల్పించినట్టు ఆయన తెలిపారు. ఈ నేపధ్యంలోనే బత్తిలి, సీతంపేట, మందస, కొత్తూరు తదితర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు భద్రతను పెంచినట్టు పేర్కొన్నారు. పాత కేసుల్లో నిందితులైన వారిపై కూడా నిఘా ఉంచినట్టు వెల్లడించారు. జిల్లాలో మావోయిస్టుల సానుభూతిపరులపై కూడా నిఘా ఉంచామన్నారు. కొత్తూరు జంక్షన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాలను ఆయన ప్రారంభించారు. ఆయన వెంట పాలకొండ డీ ఎస్పీ స్వరూప, స్థానిక సీ ఐ శ్రీనివాసరావు, ఎస్ ఐ రవికుమార్, ఇతర సిబ్బంది ఉన్నారు.