శ్రీకాకుళం

మరో 48 గంటల్లో పెథాయ్ ముప్పు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 15: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయిగుండం కోస్తా వైపు దూసుకొస్తుంది. ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోన్న దీనికి థాయ్‌లాండ్ ప్రతిపాదించిన 3పెథాయ్2గా నామకరణం చేసారు. ఇది ప్రస్తుతం గంటకు 13 కిలోమీటర్లు వేగంతో కదులుతూ మచిలీపట్నం తీరానికి 900 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయివ్య దిశగా ఇది కదులుతోంది. మరికొన్ని గంటల్లో పెథాయ్ తుపాను తీవ్రత పెరగనున్నది. దీని ప్రభావం గత కొద్ది గంటల నుంచే శ్రీకాకుళం జిల్లాపై పడింది. శనివారం నుంచే బలమైన ఈదురు గాలులు ప్రారంభం అయ్యాయి. ఆదివారం నుంచి గంటకు 80 నుంచి 100 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక దీనిపై జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ధాన్యం కల్లాల్లో నిల్వలు ఉంచకుండా చూడాలని ఆదేశించారు. రైతుల కల్లాలకు చేరిన ధాన్యాన్ని కొనుగోలుపై కూడా కలెక్టర్ సూచనలు చేసారు. జిల్లా యంత్రాంగం సర్వసన్నద్దంగా ఉందని కలెక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి వివరించారు. జిల్లాలో తుపాను ముందస్తు సన్నద్ధంపై కలెక్టర్ ఆర్టీజీఎస్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితి ఎదుర్కొవడానికైనా సిద్ధంగా ఉండాలని తన యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాల్‌సెంటర్ 1100 నుంచి తుపాను జాగ్రత్తల సందేశాలు జారీ చేయాలని, ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజలకు నిరంతరం హెచ్చరికలు పంపాలని కలెక్టర్ ధనంజయరెడ్డి దిశానిర్దేశం చేసారు. తుపాను సంబంధిత విభాగాల అధికారులు ఆర్టీజీఎస్‌లో ఉంటూ పర్యవేక్షించాలని స్పష్టమైన సహాయక చర్యలు ఎప్పటికప్పుడు అగ్నిమాపకశాఖ, రెవెన్యూ, పోలీసుశాఖలతోపాటు మండల తహశీల్థార్లు అంతా వారివారి ప్రాంతాల్లో ఉండాలంటూ కలెక్టర్ టెలికాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు. ఉష్టోగ్రత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ బలమైన గాలులతో ఎముకులను సైతం చలిపులి కొరికేలా వాతావరణం మారింది. మరో 48 గంటల్లో కాకినాడ - విశాఖ సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. తుపాను నేపథ్యంలో వాతావరణశాఖ అధికారులు కోస్తాంధ్ర జిల్లాలతోపాటుగా ఒడిషా రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేసారు. దీంతో ఒడిషా సరిహద్దులో గల ఉద్దానానికి మళ్ళీ తుపాను హెచ్చరికలు జిల్లా యంత్రాంగం చేసింది. తిత్లీ తుపాను బాధితులు ఇంకా ఆ బాధలు, వెతలు, అందని సహాయం కోసం ఎదురుచూస్తుంటే - ఇంతలో పెథాయ్ తుపాను మరోసారి ఉద్దానం ప్రాంతాన్ని అతలాకుతలం చేసే అవకాశాలు లేకపోలేదంటూ వాతావరణశాఖ అధికారులు శనివారం హెచ్చరికలు జారీ చేసారు.
ఇదిలా ఉండగా, 196 కి.మీ. తీరం కలిగిన జిల్లాలో 104 మత్స్యకార గ్రామాలు పెథాయ్ హెచ్చరికలతో హాడలిపోతున్నాయి. తిత్లీ తుపాను వంటి విపత్తు సంభవిస్తుందన్న భయం వారిని కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ఇప్పుడిప్పుడే వాతావరణం అనుకూలించి వేట గిట్టుబాటు అయ్యే పరిస్థితుల్లో తుపాను హెచ్చరికలు, చేపల వేటపై నిషేధాజ్ఞలు గంగపుత్రులను కలవరానికి గురిచేస్తున్నాయి. భారీ గాలులు వీయడంతో సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ఏ క్షణమైనా సముద్రం ముందుకు వచ్చే ప్రమాదం ఉందని మత్స్యకారులు తీరంలో గల తెప్పలు, వలలు వంటి సంపదను సురక్షత ప్రాంతాలకు తరలించి భద్రపరుచుకుంటున్నారు. వేట లేకపోవడం వల్ల తీరం అంతా నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. గంగపుత్రులు ఉపాధిలేమితో ఇళ్ళకే పరిమితం అయ్యారు. తుపాను ఎక్కడ తీరం దాటుతోందో అన్న ఉత్కంఠ మత్స్యకార గ్రామాల్లో మరింత భయాన్ని రేపుతుంది.

వెటర్నరీ డిప్లమో కాలేజ్ ఏర్పాటుకు ప్రతిపాదన
* విప్ రవికుమార్
ఆమదాలవలస, డిసెంబర్ 15: నియోజకవర్గంలో పశుసంపదను అభివృద్ధి చేసేందుకు గాను ఆమదాలవలసలోవెటర్నరీ డిప్లమో కాలేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. శనివారం స్థానిక రైల్వే గేట్ వద్ద మున్సిపల్ ఉన్నతపాఠశాల ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తున్నారని, ఈ పాఠశాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందులో భాగంగానే తిమ్మాపురం, జగ్గుశాస్త్రులపేట, పార్వతీశం పేట గ్రామాల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రాథమిక ఉన్నత పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాని ఆయన అన్నారు. మున్సిపాల్టీ పరిథిలో రేషన్ డిపోల సంఖ్య అదనంగా పెంచుతున్నామని, 230 తాగునీటి కుళాయిలకు గాను తాను 3,500 కుళాయిలను మంజూరు చేశానని తెలిపారు. పాఠశాలలో విద్య అందరికి ఉచితంగా అందాలన్న ఉద్దేశ్యంతో ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నభోజనం, టై, బెల్ట్ వంటివి ప్రభుత్వం సరఫరా చేస్తుందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అవసరాలను కాపాడలవలసిన బాధ్యత పాలకులుదేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తమ్మినేని గీత, దేశం నాయకులు విద్యాసాగర్, బోర గోవింద్, ఐ ఆర్ ఎస్ ప్రసాద్, ఎం ఈవో శేఖర్, హెచ్ ఎం రమణమ్మ, వార్డు కౌన్సిలర్ చిన్ని, రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సీతంపేటలో స్వచ్ఛ సంక్రాంతి
జి.సిగడాం, డిసెంబర్ 15: రాష్ట్ర ప్రభుత్వం రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలను చెత్తరహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు గాను సీతంపేట గ్రామంలో స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం మండలం సీతంపేట గ్రామంలో పేరుకుపోయిన చెత్తకుప్పలను తొలగించారు. ఈ సందర్భంగా ఈవోపి ఆర్‌డి కె.క్రిష్ణారావు మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారని, ఈ చెత్తనుండి సేంద్రీయ ఎరువులు తయారవుతాయని, ఈ ఎరువులు వ్యవసాయానికి రైతులు రసాయనిక ఎరువులు మాని సేంద్రీయ ఎరువులు ఉపయోగించుకొని అధిక పంటలు పండించుకోవచ్చని ఆయన అన్నారు. ఎంపీడీవో బి.హెచ్ శంకరరావు మాట్లాడుతూ హిందువుల పండుగ సంక్రాంతికి సుదూర ప్రాంతాలనుండి వారి వారి గ్రామాలకు వచ్చిన బంధువులు, గ్రామస్థులు స్వచ్ఛ గ్రామాన్ని చూసి అబ్బురపర్చే విధంగా గ్రామాన్ని తయారుచేసుకోవాలన్నారు. గ్రామం బాగుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఇందు కోసం ప్రజలు సహకరించాలన్నారు. అనంతరం మండల పరిథిలో గల గ్రామకార్యదర్శులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సంక్రాంతిని కార్యదర్శులకు వివరించారు. ఈ కార్యక్రమం ఈనెల 22 వరకు ప్రతీ గ్రామపంచాయతీల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యదర్శులు ఆయా గ్రామాల్లో స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బి. ఆర్‌పి ఎమ్.శ్రీదేవి, కార్యదర్శి ఎస్.గణేష్, ఐ.మోహన్, ఎస్.అనూరాధ, బి.సుందరమ్మతో పాటు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై పి ఏసి ఎస్ సమ్మెబాట
పొందూరు, డిసెంబర్ 15: రాష్ట్రంలో రైతులకు అండగా రుణసౌకర్యం అందిస్తున్న 2,050 ప్రాథమిక సహకార సంఘాలు మరోమారు ఈ నెల 17వ తేదీనుండి సమ్మెబాట పట్టనుంది. రైతాంగానికి పక్షాన నిలబడేది సహకార సంఘాలే. అటువంటి సంఘాలు రాష్ట్రంలో ఉన్న పిఏసిఎస్‌లోశాఖల్లో 8వేల మంది ఉద్యోగులు విధులు బహిష్కరించి సమస్యలు సాధనకు పోరుబాట పడుతున్నారు. అనేక సంవత్సరాలుగా పి ఏసి ఎస్ కార్మికుల సమస్యకోసం పోరాటం చేయడమే తప్ప సర్కార్ నుండి ఫలితం లేదంటూ కార్మికులు మొరపెడుతున్నారు. ఛలో విజయవాడలో ఉద్యోగులు గళమెత్తి పోరాడితే గౌరవమంత్రివర్యులు ఆదినారాయణ, ఏపీసీవో చైర్మన్ చిన్నమనేని వెంకటేశ్వర్లు నెలరోజుల్లో జీవో విడుదల చేస్తామని హామీ ఇచ్చారే తప్ప నేటికి పట్టించుకునే దాఖలాలు లేకపోవడంతో పి ఏసి ఎస్ ఉద్యోగులు సమ్మెబాటతో సహకార సంఘాలు మూతపడుతున్నాయి. పండగ రోజుల్లో పబ్బం ఎలా గడపాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు నిలిచిపోతున్నాయి. ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న రైతు రుణ మాఫీ అందని పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు రబీ రుణాలు అందవల్సిన క్రాప్‌లోన్ రెన్యువల్ జరగగా రైతులకు ఇబ్బందులు తప్పవంటూ కరువుఘోష పెడుతున్నారు. సర్కార్ మొండి వైఖరికి వేలాది రైతులు పండగంటిపూట పస్తులు తప్పవంటున్నారు. మరోవైపు సర్కార్ ఇచ్చిన మాటా నిలుపుకోలేనందున ఇక రాజీ లేని పోరుకు సిద్ధమవుతున్నారు. పిఏసిఎస్ న్యాయమైన సమ్మెబాటకు ప్రజాసంఘాలు మద్దతు పల్కి రాజీలేని పోరే ధ్యేయంగా నిలుస్తామని కార్మిక సంఘాలు కదం తొక్కడానికి సిద్ధమవుతున్నాయి. 2014 నుండి పి ఆర్‌సి ఇవ్వాలని, ఉద్యోగులకు పదవీవిరమణ 60 ఏళ్లుకు చేయాలని, గ్రాడ్యుటీ రూ. 5లక్షలు ఇవ్వాలని, డిసిసిబీలో ఖాళీగా ఉన్న 50 శాతం సిబ్బందిని భర్తీ చేయాలని డిమాండ్‌తో ఉద్యోగులు సమ్మెబాట, రైతులుకు పస్తులు మూట తప్పవంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.

సర్కార్ పథకాలు సక్రమంగా వినియోగించుకొండి
* విప్ కూన రవికుమార్
పొందూరు, డిసెంబర్ 15: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన నిలిచి అందించే పథకాలు సక్రమంగా వినియోగించుకోవాలని ఆమదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూనరవికుమార్ అన్నారు. స్థానిక ఏ ఎంసీ కార్యాలయంలో జరిగే సమావేశంలో మాట్లాడుతూ పై విధంగా పేర్కొన్నారు. శ్రమజీవులు ఆశించిన ఆశయం నెరవేర్చడమే సర్కార్ ధ్యేయంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. కార్యకర్తలు రథసారథులుగా నిలబడి ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలందించే ప్రభుత్వం తమదే అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సక్రమంగా నెరవేర్చి ప్రతీ పల్లెలో అద్భుతమైన అభివృద్ధిని చూపించామన్నారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు పింఛన్ పథకాలు సక్రమంగా అందించిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కిందన్నారు. గ్రామాల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్ల సౌకర్యం కల్పించే ఘనత తమ సర్కార్‌కే దక్కిందన్నారు. ఈ సందర్భంగా వృద్ధాప్య పింఛనులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చిగిలిపల్లి రామ్మోహనరావు, వండాన సత్యం, ఏ ఎంసీ చైర్మన్ రాము, మండల దేశం పార్టీ నేతలు అనకాపల్లి అక్కలనాయుడు, ఎంపీటీసీలు అనకాపల్లి అనూష, శ్రీనివాసరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు మద్దెల శ్రీనివాసరావు, రవి తదితరులు పాల్గొన్నారు.