శ్రీకాకుళం

చెప్పులు విసరమనడం జగన్‌కు కొత్తేమీ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), జూన్ 3: అభివృద్ధి కారకులపై చెప్పులు విసరమనడం జగన్మోహనరెడ్డికి కొత్తేమీ కాదని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఈ మేరకు ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.
గతంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు నడిచేపుడు అప్పటి ప్రధాని దివంగత పి.వి.నరసింహారావు, దివంగత కోట్ల విజయభాస్కరరెడ్డిలపై కడపలో నిర్వహించిన సభల్లో చెప్పులు విసరడం తెలిసిందే అన్నారు. అలాగే రాయలసీమలో దివంగత నేత ఎన్.టి.రామారావు పర్యటించిన సందర్భంలో కూడా రాళ్లు, చెప్పులు విసిరారని, ఇదే చరిత్రను పునరావృతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడపై చెప్పులు విసరండి అంటూ జగన్మోహనరెడ్డి పిలుపునివ్వడం ఆశ్చర్యం కలిగించకపోయినా, కడప రాజకీయాలు పునరావృతమైతే మాత్రం 2019 నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కాకతప్పదని హెచ్చరించారు. పరిస్థితులు నాగరిక ప్రపంచంలో అడుగిడుతున్న సందర్భంలో జగన్మోహనరెడ్డి సిబిఐ నిందితునిగా ఉండటం వలనే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలైనారన్న సత్యాన్ని గ్రహించాలని హితవుపలికారు.
సమావేశంలో టిడిపి నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, గంగు నాగేశ్వరరావు, మూకల్ల శ్రీనివాసరావు, సింతు సుధాకర్, ఎస్.వి.రమణ మాదిగ, గొర్లె కృష్ణారావు, కె.జగదీష్ పాల్గొన్నారు.