శ్రీకాకుళం

వనరుల సద్వినియోగంతోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, జూన్ 3: జిల్లాలోగల వనరులను రాబోయే మూడేళ్లలో పూర్తిగా సద్వినియోగం చేసి అభివృద్ధి పథంలో జిల్లాను నడిపిస్తామని రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నవ నిర్మాణ దీక్ష రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా స్థానిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏక పక్షంగా, అశాస్ర్తియంగా విభజన జరిగిన చర్చా కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ జిల్లా వెనుకబడి ఉందన్నారు. ఎల్‌ఎన్ పేట మండలం చివరిస్థానంగా ఉండన్నారు. గతంలో జిల్లా అభివృద్ధిపై దృష్టిసారించకపోవడమే ఈ పరిస్థితి ఉందన్నారు. కొవ్వాడ, భావనపాడు ప్రాజెక్టులు వస్తున్నాయని, జూన్ 2017 నాటికి వంశధార రెండో దశ పనులు పూర్తిఅవుతాయన్నారు. గతంలో వంశధార, నాగావళి జలాలు సద్వినియోగం చేయలేదన్నారు. ప్రస్తుతం సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించిందన్నారు. ప్రతి గ్రామంలో సిమెంటు రహదారులు, ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి తారురోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించందన్నారు. దేశంలో అగ్రగామి రాష్ట్రంగా చేసేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు కృషిచేస్తున్నారన్నారు. ఇబ్బందులను అవకాశంగా తీసుకుని మనస్తత్వంతో మొక్క వోని ధైర్యంతో పనిచేస్తున్న వ్యక్తి అన్నారు. రాష్ట్రాన్ని కక్షతో విభజించిన వారు అసూయపదే విధంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారని చెప్పారు. ఒక విధానం, పద్ధతి లేకుండా రాష్ట్రాన్ని విభజించి సమస్యల వలయంగా నెట్టారన్నారు. రాజకీయ స్వార్థంతో రాష్ట్రాన్ని విభజించారన్నారు. రూ.16,500 కోట్ల లోటు బడ్జెటు ఉన్నప్పటికీ రైతులకు 24 వేల కోట్ల రూపాయలను రుణమాఫీచేశారన్నారు. చంద్రన్న బీమా పేరుతో ఉపయోగపడే విధంగా బీమా కల్పిస్తున్నట్టు చెప్పారు. ఎం.పి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ సమైక్యాంద్రలో ఉద్యోగులు ప్రశంసాపూర్వక పాత్ర పోషించారన్నారు. ఈ సందర్భంగా మహా సంకల్పం పోస్టర్‌ను మంత్రి అచ్చెన్నాయుడు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, సర్పంచ్ గొద్దు చిట్టిబాబు, ప్రత్యేకాధికారి ఎస్.తనూజారాణి, ఎం.పిడివోలు, తహశీల్దార్లు, ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు తదితరులు ఉన్నారు.