శ్రీకాకుళం

వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల/ఆమదాలవలస/జలుమూరు, జూన్ 3: రోహిణి కార్తెలు కారణంగా భానుడు భగభగలాడటంతో సిక్కోలు వాసులు నిన్నటివరకు విలవిలలాడిపోయారు. అయితే, శుక్రవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం జిల్లా అంతటా కురిసింది. లావేరు మండలంలో 68.2 మి.మీ ల వర్షం కురిసి అత్యధికంగా నమోదైంది. అలాగే ఇచ్ఛాపురంలో 66.8, అమదాలవలసలో 57.0, శ్రీకాకుళం 56.4, సరుబుజ్జిలి 53.8, కవిటి 50.4, మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం 7గంటల నుంచి 10గంటల వరకు ఎడతెరిపిలేని వర్షంకురవడంతో జిల్లాలో 1093.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.
నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి రెండు మూడురోజుల్లో వస్తాయని వాతావరణ శాఖ నిపుణులు సూచనలు తారుమారయ్యేలా కుండపోత వర్షం కురిసింది. నిత్యం తీవ్ర ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడుకావడంతో ఉక్కిరిబిక్కిరి అయిన జనానికి జిల్లా అంతటా కురిసిన వర్షం ఎంతో ఊరటనిచ్చింది. ఓ వైపు ఖరీఫ్ పనులు ప్రారంభించేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్న అన్నదాత కుటుంబాలు ముందే నైరుతు రుతుపవనాలు పలకరించడంతో తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నారు మడులు సిద్ధం చేసుకొని విత్తనాలు కొనుగోలుకు ఎదురుచూస్తున్న రైతులల్లో ఈ వర్షం మరింత ఉత్సాహాన్ని నింపింది. కార్తెల్లో నారుమడులు సిద్ధంచేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునన్న విశ్వాసంతో ఉన్న రైతులు ఈ వర్షాలకారణంగా వ్యవసాయ పనులు మరింత వేగవంతంగా పూర్తిచేయవచ్చునని ఆసక్తి కనబరుస్తున్నారు. మెట్ట ప్రాంత రైతులు సాగుచేస్తున్న నీలగిరి, సరుగుడు, జీడి మామిడి, కొబ్బరి వంటి తోటలకు ఈవర్షాలు ఎంతో ఉపకరిస్తాయని ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
కూరగాయలు సాగు చేసే రైతులు కూడా అధిక దిగుబడులుసాధించేందుకు నూతుల్లో భూగర్భజలాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లెలా కురిసిన వర్షం చెరువుల్లో వచ్చిచేరడంతో జలకళ వచ్చినట్టయ్యింది. ఇంకుడు గుంతలు, పంట సంజీవినిల పనులు పూర్తికావడంతో భూగర్భజలాలు పరిరక్షణ లక్ష్యం నెరవేరినట్లయ్యింది. ఇలా కురిసిన వర్షం ఇటు మంచినీటి సమస్య నుంచి అటు సాగునీటి సమస్యల వరకు పరిష్కరించేలా కురవడంతో వరుణదేవుడు కరుణ చూపాడని జనమంతా ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
ఆమదాలవలసలో...
ఆమదాలవలస పట్టణం, పలు పరిసర గ్రామాల్లో శుక్రవారం ఉదయం సంభవించిన ఈదురుగాలులతో ప్రజలు భీతిల్లిపోయారు. కొన్ని చోట్ల చెట్లు విరిగి నేల పడగా మరికొన్ని చోట్ల విద్యుత్ వైర్లు తెగిపోవడంతో రోజంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అనేక గ్రామాలు చీకటిలో ఉన్నాయి. పట్టణంలోగల బొడ్డేపల్లిపేట, కొత్తవానిపేట పలు ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద పిడుగుల పడటంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిందని అధికారులు తెలిపారు.
జలుమూరు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం తెల్లవారునుంచి కొద్ది గంటల కాలం భారీగా ఈదురుగాలులు.. వర్షాలు కురిశాయి. భారీగా వర్షాలు పడుతాయని ఆశించిన రైతులకు ఉరుములు, గర్జనలు మిగిలాయి. ఈదురుగాలులు వలన ఉన్న మామిడి కాయలు రాలిపోవడంతో దానినే నమ్ముకున్న వారు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.