శ్రీకాకుళం

మోదీదే తిరుగులేని విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం (రూరల్) జనవరి 16: ఐదేళ్లలో సాధించిన ప్రగతి ఎజెండాగా నరేంద్రమోదీ మళ్లీ తిరుగులేని విజయాన్ని సాధిస్తారని పంచాయతీ రాజ్ సెల్ కన్వీనర్ రొక్కం సూర్యప్రకాశరావు పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో ఈనెల 11,12తేదీల్లో జరిగిన జాతీయ కౌన్సిల్ సమావేశాలు అనంతరం జిల్లాకు వచ్చిన రొక్కం దేశం నలుమూలల నుంచి 15వేలమందికి పైగా పార్టీ సీనియర్‌లు, మేథోమథనం చేసి వ్యవసాయం, జాతీయ భద్రత, సామాజిక న్యాయం, ఆర్థిక బలోపేతం, దౌత్య రంగాలపై లోతైన చర్చలు జరిగాయన్నారు. ప్రక్షాళన చేసేటప్పుడు ఘర్షన తప్పనిసరని, అలాంటివే సిబి ఐ, ఆర్‌బి ఐ మొదలైన విషయాల్లో వస్తున్నాయన్నారు. త్వరలోనే అవన్నీ సమసిపోయి అద్భుత ప్రగతివైపు భారత్ అడుగువేస్తుందన్నారు. 60 ఏళ్లలో లేని అభివృద్ధిని కేవలం ఐదేళ్లలో చేసి చూపించిన ఘనత బీజేపీదే అన్నారు. కాశ్మీర్, అస్సాం, రామమందిరం లాంటి సమస్యలు త్వరలోనే పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. సిబి ఐ డైరెక్టర్‌ను తొలగించాకే ఆగస్టామి సెల్‌ను భారత్‌కు తీసుకురావడం గమనించాలన్నారు. ఈ బిసి బిల్లులాంటి మరిన్ని సిక్సర్లు రానున్నాయన్నారు. భారత్ సాధించిన విజయాలను చూసి ప్రపంచదేశాలు ఆశ్చర్యపోవడమే కాకుండా మోదీ హెచ్చరికతో అరబ్‌దేశాలు దిగివచ్చి పెట్రోల్ రేటును తగ్గించాయన్నారు. అమెరికా,పాకిస్తాన్‌కు ఆర్థిక సమాచారం నిలిపివేసిందని, యు ఏ నుంచి అగస్టా నిందితులు మిసైన్‌లను సౌదీ నుంచి ఖలిస్తాన్ తీవ్రవాది భూపేంద్రసింగ్‌ను, క్రికెట్ బుకీ సంజయ్‌చావ్లా వంటి వారిని భారత్‌కు తీసుకువచ్చే జైళ్లులో పెట్టించడం గమనించాలన్నారు. బొంబాయి పేలుళ్లు నిందితులు డేవిడ్ హెడ్లీ, దావూద్ ఇభ్రహీంలను కూడా మోదీ ఇండియాకు తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు, లాభం, భూమి అనే అంశాల ప్రాతిపదికన విశేష ప్రతిభ చూపిన దేశాధినేత మోదీకి తొలి ఫిలిప్ కొట్లర్ అనే ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం భారతీయులందరికి గర్వకారణంగా ఉందన్నారు.

వైభవంగా ఉజ్జిడమ్మ యాత్ర
సారవకోట, జనవరి 16: కొలువైయున్న ఉజ్జిడమ్మ మహాకాళి ఆలయ 18వ యాత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. స్థానికులే కాకుండా జిల్లా నలుమూల నుంచి ఈ యాత్రోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా అరటి గెలలు కట్టేందుకు ఆలయ ప్రాంగణంలో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామాలకు వచ్చిన వారు, ఆడపిల్లలు ఉజ్జిడమ్మను దర్శించుకొని మొక్కును తీర్చుకున్నారు. సాయంత్రం జరిగిన యాత్రోత్సవాలకు ఆబాలగోపాలం తరలివెళ్లడం కన్పించింది. వార్షికోత్సవాలు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేశారు.

ఆలోచింప జేసిన బొమ్మల కొలువు
సారవకోట, జనవరి 16: కనుమ పండుగ సందర్భంగా మండలంలోని జేబిటి పాఠశాల విద్యార్థులు బుధవారం నిర్వహించిన బొమ్మల కొలువు పలువురును ఆకట్టుకొని ఆలోచింప జేసింది. ఇండ్ల వద్ద పిల్లలు పూర్వకాలంలో ఆడుకునే చెక్కతో తయారు చేసిన బొమ్మలను విద్యార్థులు సేకరించి బొమ్మల కొలువులో అమర్చారు. అదేవిధంగా ఆధునిక ప్రపంచంలో తయారుచేసుకున్న బొమ్మలను కూడా ఈ ప్రదర్శనలో ప్రదర్శించారు. పూర్వపు చెక్కబొమ్మల నగిషి వాటి కదలికల పట్ల పలువురు ఆకర్షితులయ్యారు. పాఠశాల అధిపతి మోహనగాంధి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణమూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బొమ్మల కొలువును తిలకించడానికి గ్రామస్థులు తరలి రావడం విశేషం.

నేడు శ్రీరామపాద యాత్రకు సన్నాహాలు
నరసన్నపేట, జనవరి 16: మండల కేంద్రం నుండి సుమారు 2కిలోమీటర్ల దూరంలో ఉన్న హలా ఈశ్వరుని యాత్రకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయని కమిటీ నిర్వాహకులు ఎస్.లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రతీ ఏడాది ముక్కనుమ రోజున జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా హాలాల దర్శనం ప్రత్యేకంగా ఉంటుందని తెలిపారు. ఈ యాత్రకు వారం రోజుల ముందుగా టెక్కలిపాడు, కంబకాయ గ్రామాల్లో ఇంటి ఇలువేల్పుగా స్వామివారిని పూజించి బాణాలు, తప్పిడిగుళ్లతో హలాలను తీసుకొని కరజాం గ్రామం వద్ద ఎండల మల్లేశ్వరస్వామి ఆలయం దర్శించి ఈ స్వామివారి ఆలయానికి చేరుకుంటారని, వీరిని దర్శించేందుకు గాను వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకోవడం జరుగుతుందని వివరించారు. ప్రతీ ఏడాది ముక్కనుమ రోజున ఈ యాత్రను నిర్వహించామని ఆయన స్పష్టం చేశారు.