శ్రీకాకుళం

నేటి నుండి మీ సేవా కేంద్రాల నిరవధిక సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం (టౌన్), జనవరి 16: మీ సేవ కేంద్రాలలో సేవలందిస్తున్న వారికి సరైన రాయితీలు కల్పించకపోవడం పట్ల జిల్లాలోని 700కు పైగా ఉన్న మీసేవా కేంద్రాలు గురువారం నుండి నిరవధిక సమ్మె చేయనున్నట్లు మీసేవా కేంద్రాల జిల్లా శాఖ అధ్యక్షులు అధికారి రవికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. గురువారం విడుదల చేసిన ఆ ప్రకటనలో తమ సమస్యల గురించి ఈనెల 3వ తేదీన ప్రభుత్వానికి తెలియజేసి సమ్మె నోటీస్‌ను రాష్ట్ర మీసేవ అసోసియేషన్ అందజేసినప్పటికి ప్రభుత్వం నేటి వరకు స్పందించకపోవడంతో సమ్మె అనివార్యమైందని ఆయన వెల్లడించారు. జిల్లాలో 700 మంది ఆపరేటర్లతో పాటు 2000 మంది సహాయ సిబ్బంది మీసేవలపై ఆధారపడి బతుకుతున్నారన్నారు. భారీగా పెరిగిన షాప్ అద్దెలు, చాలీచాలని కమీషన్లు అధిక పని ఒత్తిడి కారణంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వీరితో పాటు ఇటీవల కాలంలో స్టూడెంట్స్ స్కాలర్‌షిప్ బయోమెట్రిక్, యువనేస్తం బయోమెట్రిక్ అథంటికేషన్, డప్పు, చర్మకారుల పింఛన్ అప్లికేషన్‌ను ఉచితంగా నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, అంతేకాకుండా ఇన్‌కమ్, రెసిడెన్స్ సర్ట్ఫికెట్లను మీసేవా కేంద్రాల నుంచి తొలగించారన్నారు. అంతేకాకుండా పరిమితికి మించి మీసేవా కేంద్రాలను ఏర్పాటుచేయడం వలన ఈ కేంద్రాలు కొనసాగింపు ఆర్థిక భారంగా మారాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మీసేవా కేంద్రాలకు ఇంటర్‌నెట్, షాప్ కరెంట్ ఛార్జీలు రాయితీగా ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఆపరేటర్లకు ఆరోగ్య భద్రతా కార్డులు, చనిపోతే రూ.10లక్షలు కుటుంబానికి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వానికి, ప్రజలకు మద్య వారధిగా పనిచేస్తున్న మీసేవా కేంద్రాల న్యాయమైన కోర్కెలు తీర్చేవరకు రాష్ట్రంలో ఉన్న అందరు ఆపరేటర్లతో పాటు శ్రీకాకుళం జిల్లా మీసేవా ఆపరేటర్లుకూడా నిరవదిక బంద్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఒడిశాలో సిక్కోలు నృత్య ప్రతిభ
* కలహండి ఉత్సవంలో శ్రీకాంత్ బృందానికి పురస్కారం
శ్రీకాకుళం (టౌన్), జనవరి 16: ఓడిస్సా రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కలహండి జిల్లాలో నిర్వహించిన కలహండి నృత్యోత్సవ్ -2019లో నగరానికి చెందిన ప్రముఖ నృత్యదర్శకులు డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్య బృందం కూచిపూడి సాంప్రదాయంలో ప్రదర్శించిన నృత్యాలు ఆహుతులను మంత్ర ముగ్ధులను చేశాయి. ఈ నృత్య బృందం విఘ్నేశ్వర స్తుతి, శివ స్తుతి, నరసింహా కీర్తనలను ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు. ఇందులో పాల్గొన్న కళాకారులు సౌందర్య, వౌనిక, ప్రశాంతి, లక్ష్మి, లహరి, నేహ, హర్షిత, ప్రవళిక, హిమబిందు, గాయత్రి వర్షిత, బాలచందర్, కౌండిల్యలను ఒడిస్సా యంత్రాంగం కలహండి-2019 పురష్కారంతో శ్రీకాంత్ బృందనికి ఘనంగా సత్కరించారు.

అప్పన్న దర్శనానికి బారులు తీరిన భక్తులు
శ్రీకాకుళం (రూరల్), జనవరి 16: మండలంలోని జాతీయ రహదారికి ఆనుకొని పెద్దపాడు సమీపంలో ఉన్న అప్పన్నమ్మ తల్లిని దర్శించుకునేందుకు బుధవారం భక్తులు బారులు తీరారు. ప్రతీ ఏడాది కనుమ రోజున ఇక్కడ జాతరమాదిరిగా ఉంటుంది. జిల్లా నలుమూల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తమ మొక్కులను చెల్లించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది కనుమ పండుగ బుధవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు హాజరై తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న అప్పన్నమ్మ తల్లి మొక్కులను తీర్చుకునేందుకు వేలాది మందిగా భక్తులు తరలివచ్చారు. కొంతమంది భక్తులు బాజా భజంత్రీలతో, మంగళ వాయిధ్యాలతో ఊరేగింపుగా వచ్చి తమ మొక్కులను చెల్లించుకున్నారు. మరికొంతమంది కోయిడాన్స్‌లు, తప్పిడిగుళ్లుతో ఊరేగింపుగా వచ్చి మొక్కులు చెల్లించారు. జాతీయ రహదారికి ఆనుకొని ఈ గుడి ఉండడంతో భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూరల్ పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటుచేశారు. ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కల్గకుండా క్రమబద్దీకరించారు. ప్రతీ ఏట కొంతమంది భక్తులు క్రమం తప్పకుండా తరలి వచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటారు.