శ్రీకాకుళం

ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు నిధులను వినియోగించుకొండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలాకి, జనవరి 19: మండలంలోగల స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంపిపి తమ్మినేని లక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి మాట్లాడుతూ నియోజకవర్గం పరిథిలో ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు అందించడం జరిగిందని ఆయన అన్నారు. ప్రతీ పథకం కూడా పార్టీలకతీతంగా అందిచండం జరిగిందని ఆయన అన్నారు. నేను ఎలక్షన్‌లకు ముందే పార్టీ మనిషినని, గెలిచిన తర్వాత అందరికి ఎమ్మెల్యేనని అన్నారు. పార్టీలను దృష్టిలో పెట్టుకొని మీ అవసరాలకు దూరం కావద్దని ప్రజా ప్రతినిధులతో అంటూ మీ గ్రామంలో ప్రజల అవసరాలు గుర్తించి నాకు తెలియజేయాలని ఆయన అన్నారు. గ్రామాలను బాగు చేసేందుకు నిధులున్నాయని, వాటిని ఎలక్షన్‌కోడ్ ముందే సద్వినియోగం చేసుకోవాలని వారితో అన్నారు. అలాగే వనిత మండలంలో ఉన్న సురక్షిత మండలం పూర్తిస్థాయిలో గ్రామాలకు తాగునీటిని అందించలేకపోయిందని, గతంలో నిర్మాణాల లోపాల వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. వీటికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుతో వివరించగా కొత్తగా నిర్మాణం పనులు చేసేందుకు మండలానికి రూ.15కోట్లు మంజూరు అయ్యాయని వాటితో పనులు ప్రారంభించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో శాఖల వారీగా గడిచిన నాలుగన్నర సంవత్సరాలలో ఆయా శాఖల ద్వారా ప్రజలకందించిన సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంకా ఏమి చేయాలో అని అడిగి తెలుసుకున్నారు. వచ్చినటువంటి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో మండల తహశీల్దార్ మురళీకృష్ణ, డిప్యూటీ తహశీల్దార్ అప్పారావు, జెడ్పీటీసీ గొండు రామన్న, మండల ప్రత్యేక సలహాదారు తమ్మినేని భూషణరావు, ఏ ఎంసి చైర్మన్ బైరి భాస్కరరావు, ఎంపిడివో భాస్కరరావు, ఈవో పి ఆర్డి రవికుమార్, ఏవో వెంకటరావుతో పాటు అన్ని శాఖల అధికారులు, ఎంపీటిసి సభ్యులు అప్పారావు, మజ్జి రమణమ్మ తదితర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులను తప్పుదోవ పట్టిస్తే క్షమించేది లేదు
* పట్టణ దేశం అధ్యక్షుడు బోర గోవిందరావు
ఆమదాలవలస, జనవరి 19: రాష్టవ్య్రాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టినప్పటికి కొందరు వైసీపీ నాయకులు వారిని తప్పుదోవ పట్టించేందుకు ప్రకటనలు చేస్తే క్షమించేంది లేదని పట్టణ టీడీపి అధ్యక్షుడు బోరగోవిందరావు తెలిపారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులున్నట్లు గుర్తించిందని, వీరి పూర్తి వివరాలను పోలీస్‌ల ద్వారా నమోదుచేయించి హైకోర్ట్‌కు అందజేయడం జరిగిందని, వీరిని తప్పుదోవ పట్టించేందుకు స్థానిక వైసీపి నాయకుడు జెకె వెంకుబాబు, మరో ఇద్దరు అగ్రిగోల్డ్ బాధితుల వివరాలను సేకరించడం హాస్యాస్పదంగా ఉందని వీరు పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నుకోబడిందని, అగ్రిగోల్డ్ ఆస్థులను హైకోర్ట్ నిబంధనల మేరకు ప్రభుత్వం బాధితులకు డిపాజిట్లను చెల్లించేందుకే ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక చేపట్టిందని బోర గోవిందరావు అన్నారు. ఆయా సంస్థల ఆస్థులను కోర్ట్ ద్వారా వేలం వెయ్యడం జరుగుతుందని, వీటిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వమే వీటిని కొనుగోలు చేసి బాధితులకు చెల్లింపులు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వపాలనలో అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నాయకుల మాయమాటలను ఎవరూ నమ్మవద్దని గోవిందరావు సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు తమ్మినేని విద్యాసాగర్, మొదలవలస రమేష్, కొండబాబు, ఐఆర్‌ఎస్‌ప్రసాద్, తంగి గురయ్య తదితరులు పాల్గొన్నారు.