శ్రీకాకుళం

గిరిజనాభివృద్ధిని అడ్డుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, ఫిబ్రవరి 21: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రొజెక్ట్ అధికారిగా ఎల్.శివశంకర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత గిరిజనాభివృద్ధి రాష్ట్ర స్థాయిలోప్రథమ స్థానాన్ని చేరుకుందని, ఈ పరిస్థితుల్లో కొంతమంది గిరిజనులే దుష్టశక్తులుగా మారి శివశంకర్‌పై ఆరోపణ చేస్తూ గిరిజనాభివృద్ధిని అడ్డుకోవడం సమంజసం కాదని స్థానిక గిరిజన సంఘ నాయకులు చౌదరి లక్ష్మీనారాయణ, దండాసి, రామారావుతదితరులు విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలో గురువారం వీరు విలేఖరులతో మాట్లాడుతూ ఈవోగి శివశంకర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత శతశాతం గిరిజన గ్రామాలకు పక్క రహదారి సౌకర్యం కల్పించిన విషయాన్ని గమనించాలన్నారు. విద్య, వైద్య, తాగునీటి సౌకర్యం గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ప్రాజెక్ట్ అధికారి శివశంకర్ నిరంతరం కృషి చేస్తున్నారని వీరు వివరించారు. నిస్వార్థంగా పనిచేస్తున్న ఒక అధికారికి మనస్థాపం కల్గించే విధంగా గిరిజనులు ప్రవర్తించడం శోచనీయమన్నారు. జిల్లా గిరిజనులందరూ పీవో శివశంకర్ వెంట ఉన్నామని వీరు స్పష్టం చేశారు. కొంతమంది స్వార్ధపూరిత నాయకులు చేసిన అనుచిత ప్రవర్తనకు మనస్థాపం చెందకుండా గిరిజనులును అభివృద్ధి బాటలో నడిపించాలని పీవో శివశంకర్‌కు వీరు విజ్ఞప్తి చేశారు.

జనం కోసం పోరాడేదే జనసేన
పొందూరు, ఫిబ్రవరి 21: సామాజిక న్యాయం కోసం ప్రజల పక్షాన నిలిచి పోరాటమే జనసేన లక్ష్యమని జిల్లా పార్లమెంటరీ జనసేన పార్టీ వైస్ చైర్మన్ పేడాడ రామ్మోహనరావు అన్నారు. మండలం కేశవదాసుపురం గ్రామంలో గురువారం పార్టీ పతాక ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడారు. న్యాయమైన సమస్యల సాధనకు పోరాట మార్గం ద్వారే న్యాయం జరుగుతుందన్నారు. అధినేత పేదల పక్షాన నిలిచి పనిచేయాలన్న ఆదేశం తూచా పాటించాలని పార్టీ శ్రేణులకు కోరారు. పార్టీ ఎన్నికల గుర్తు గాజుగ్లాస్‌ను ప్రజల మద్య ప్రచారం చేయాలన్నారు. రాష్ట్రంలో సుస్థిర పాలన జనసేన పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కొంచాడ చిన్నమనాయుడు, జామాన అప్పలనాయుడు, హరీష్, ప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యం
పొందూరు, ఫిబ్రవరి 21: జాతీయ స్థాయిలో బీజేపీ విజయం సాధిస్తే అన్ని రాష్ట్రాల అభివృద్ధికి మోదీతోనే సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారు జయప్రతాప్‌కుమార్ అన్నారు. స్థానిక మండల బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ మండలాధ్యక్షులు గురుగుబిల్లి తేజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో మాట్లాడుతూ జాతి మెచ్చుకొనే అభివృద్ధి బీజేపీకే సాధ్యమన్నారు. రైతులకు రూ.6వేల ఆర్థిక సహాయం,కార్మికులకు రూ.3వేల పెన్షన్ సౌకర్యం, ఎస్సీ, ఎస్టీల హక్కులకు భంగం వాటిల్లేలా సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే ఆర్డినెన్స్ ద్వారా వారి హక్కులను కాపాడారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధిని చూసి బీజేపీని గెలిపిస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలే బీజేపీ గెలుపుకు సోపానాలు అని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మార్చి 1న విశాఖ రైల్వేగ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభకు ప్రతీ ఒక్కరు కదిలిరావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నేత బలివాడ సత్యన్నారాయణ, వాండ్రంగి శ్రీనివాసపట్నాయిక్, కిల్లి శ్రీరామ్మూర్తి, మొకర రాజారావు, పసుపురెడ్లనాగేశ్వరరావుతదితరులు పాల్గొన్నారు.

కాళింగ కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తా
పలాస, ఫిబ్రవరి 21: కాళింగ కుల కార్పొరేషన్‌ల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కాళింగ కార్పొరేషన్ చైర్మన్ దువ్వాడ కృష్ణమూర్తినాయుడు అన్నారు. అమరావతిలో కాళింగ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి పలాసకు మొదటిగా విచ్చేసిన చైర్మన్ కృష్ణమూర్తినాయుడును గురువారం పలాస ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కాళింగులను గుర్తించింది సీ ఎం చంద్రబాబునాయుడు అని, మొట్టమొదటిసారిగా కాళింగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తనను చైర్మన్‌గా నియమించినందుకు గాను సీ ఎం చంద్రబాబునాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిమిడి కళావెంకటరావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేషు, జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందరశివాజీ, జిల్లా పార్టీ అధ్యక్షురాలు శిరీషాకు రుణపడి ఉంటానన్నారు. తనపై ఉంచిన ఈ గురుతర బాధ్యతను చిత్తశుద్దితో నిర్వర్తించి కాళింగ కుల సామాజిక వర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లి టీడీపీ విజయానికి తోడ్పాడతానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పీరుకట్ల విఠల్, వంక నాగేశ్వరరావు, డల్లి నర్శింగరావు, తమ్మినేని గంగారాం, పెంట ఉదయశంకర్, కాళింగ కులపెద్దలు పాల్గొన్నారు.

400 మీటర్లు ట్రాక్‌ను త్వరగా పూర్తి చేయాలి
పలాస, ఫిబ్రవరి 21: పలాసలో డాక్టర్ కణితి విశ్వనాధం వితరణగా ఇచ్చిన స్థలంలో 400 మీటర్లు పరుగుపందెం ట్రాక్‌ను త్వరగా పూర్తి చేయాలని వ్యాయామోపాధ్యాయులు కోరారు. గురువారం ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ ఆథారిటీ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టు గాంధీవను రాష్ట్ర యువజన శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రసాదరావు, ముఖ్య శిక్షకులు బి.శ్రీనివాస్‌కుమార్, అథ్లెటిక్స్ కోచ్ శ్రీ్ధర్‌లు పరిశీలించారు. కాశీబుగ్గ ఉన్నత పాఠశాలలో ప్రాజెక్టు నిర్వహణ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. టెన్నికాయిట్ కోచ్ రామారావు కొన్ని సూచనలు చేసారు. శాప్ దత్తత పాఠశాల కాశీబుగ్గ ఉన్నత పాఠశాలకు తగు రీతిలో క్రీడాపరికరాలను అందివ్వాలని పిడి కె.హరిబాబు కోరారు. అనంతరం పలాస క్రీడామైదానంలో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆర్. అనంతరావు, బి.రామారావు, స్థానిక వ్యాయామోపాధ్యాయులు దీనబందు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

రాష్టస్థ్రాయిలో సత్తా చాటిన కాశీబుగ్గ విద్యార్థి
పలాస, ఫిబ్రవరి 21: నేషనల్ లెవల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ పరీక్షల్లో కాశీబుగ్గ శ్రీచైతన్య పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి దుంపల చిన్న రాష్టస్థ్రాయిలో 5వ ర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపాల్ జివి ఎన్ మూర్తి అన్నారు. గురువారం పాఠశాల ఆవరణలో సత్తా చాటిన విద్యార్థిని ఉపాధ్యాయుల బృందం అభినందించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ లెవల్ టాలెంట్ టెస్టు ఎగ్జామ్‌లో ఈ ప్రాంతానికి చెందిన మొట్టమొదటగా విజయం సాధించిన విద్యార్థి చిన్ని అని అన్నారు. విద్యార్థులంతా చిన్నిని ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థి విజయం సాధించాలన్నారు. విద్యార్థుల్లో తపన, పట్టుదల, నిరంతరం సాధన ఉంటే ఇలాంటి విజయాలు సాధ్యమన్నారు. విద్యార్థి చిన్నిని విశాఖ జోనల్ ఎజి ఎం సురేషు, డీన్ రామశర్మ, శ్రీనివాసరావులు అభినందించారు.