శ్రీకాకుళం

విద్యార్థులు ప్రజాజీవితాన్ని అధ్యయనం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, జూన్ 9: విద్యార్థులు కళాశాలలు, తమ స్వగ్రామాలకే పరిమితం కాకుండా వివిధ ప్రాంతాలల్లోని ప్రజాజీవితాన్ని కూడా చదవాలని తద్వారా ఆయా ప్రాంతాలలో ఉన్న యువతకు స్ఫూర్తినివ్వాలని శ్రీకాకుళం ఎం.పి కింజరాపు రామ్మోహన్‌నాయుడు హితవుపలికారు. మండలంలోని గొర్రెబంద పంచాయతీ బురుజువాడ గ్రామంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తన పరిధిలో బురుజువాడ గ్రామాన్ని దత్తత తీసుకొని ఆకర్షణీయ గ్రామంగా అభివృద్ధి చేయడానికి నిర్ణయించినట్టు ప్రకటించారు. ఇందుకోసం ఐతెమ్ కళాశాలతోపాటు కాకినాడ, పర్లాకిమిడి, శ్రీకాకుళం డిగ్రీ కళాశాల విద్యార్థులను వేసవిలో ఈగ్రామానికి పంపించి సమగ్ర సర్వే నిర్వహించినట్టు తెలిపారు. లీడర్ షిప్ ఫౌండేషన్ సొసైటీ నాయకత్వంలో విద్యార్థులు ఈ గ్రామంలో సర్వే నిర్వహించడంతోపాటు సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టి ఆదర్శవంతంగా నిలిచారని అభినందించారు. విద్యార్థులు సేకరించిన సర్వే వివరాల మేరకు గ్రామాల ప్రజలతో కమిటీలను ఏర్పాటు చేశామని ఈ కమిటీలు సక్రమంగా పనిచేస్తే సమస్యలను పరిష్కరించుకొని సమగ్రాభివృద్ధి సాధించుకోగలమని స్పష్టంచేశారు. ప్రభుత్వం నిర్థేశించిన లక్ష్యాలను శతశాతం పూర్తిచేసి ప్రోత్సాహక నిధులను పొందాలని సూచించారు. గ్రామాభివృద్ధికి తనవంతుగా రూ.5లక్షలను ఎంపి నిధుల నుండి విడుదల చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యే రమణమూర్తి మాట్లాడుతూ ప్రజలలో పరివర్థన కలగడం అవసరమన్నారు. రాజకీయ కక్షలే గ్రామాలను నాశనం చేస్తున్నాయని ఆవేదనవ్యక్తం చేశారు.
ఎంపిడివో లవరాజు, పోలాకి మండల తహశీల్దార్ జెన్ని రామారావు, లీడర్‌షిప్ ఫౌండేషన్‌అధ్యక్షుడు విజయసాయి, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, గ్రామస్థులు అధికంగా పాల్గొన్నారు. అంతకుముందు బురుజువాడ గ్రామానికి వచ్చిన ఎంపి, ఎమ్మెల్యేలను స్థానికులు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు.