శ్రీకాకుళం

సామాజిక పరివర్తనకు కృషి అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 10: సామాజిక పరివర్తన తీసుకురావడానికి సాంఘిక సంక్షేమ శాఖ కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం కోరారు. జిల్లా విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మాణాలను ఆమోదించింది. ఆమదాలవలస మండలం తొగరాం, పొందూరు మండలం రాకాక గ్రామాల్లో ఎస్సీ కులాల వారికి కేటాయించిన భూముల పరిస్థితులను నియోజకవర్గం అసైన్‌మెంట్ రివ్యూ కమిటీ పరిశీలించాలని కమిటీ తీర్మానించింది. లక్ష్మీపేటలో ఏర్పాటు చేసిన కోర్టు, కేసుల విచారణ, సిబ్బంది, వౌలిక సదుపాయాల పరిస్థితిని సమీక్షించాలని జిల్లా జడ్జిని కోరుతూ ఓ తీర్మానం చేసింది. శ్రీకాకుళం నగరపాలక సంస్థ మేయర్ పదవిని ఎస్సీ కులానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతూ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రతీ నెల 30లేదా 31న సివిల్ రైట్స్‌డే సందర్భంగా మండలాధికారుల బృందం గ్రామాల్లో పర్యటించి అవగాహన సదస్సులు కల్పించాలని కమిటీ సూచించారు. జిల్లాలో బేడ బుడగ జంగాలకు కుల ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం జారీ చేయుటకు గల అవకాశాలను ఆర్డీవోలు పరిశీలించి నివేదికలు సమర్పించాలని కమిటీప్రతినిధులు తీర్మానించారు. పివో ఏ చట్టంలో కొన్ని పదాలను తొలగిస్తూ జస్టిస్ పున్నయ్య కమిషన్ సూచన మేరకు సవరణ చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాలని కమిటీ ప్రతినిధులు కోరారు. పొందూరు మండలం ధర్మపురం గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సామాజిక కార్యకర్త బొడ్డేపల్లి నర్శింహులను కలెక్టర్ కోరారు. నిర్వాసిత కుటుంబాల యువతకు ఉపాధి కల్పనాకోర్సుల్లో శిక్షణ, ప్లేస్‌మెంట్ కల్పిస్తామని వంశధార, కొవ్వాడ భావనపాడు తదితర ప్రాజెక్టుల నిర్వాసితుల కుటుంబాల యువతకు శిక్షణ కల్పించనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ కులరహిత సమాజాని కోసం ప్రయత్నించాలన్నారు. వంశధార ఓపెన్ హెడ్ చానల్ పనుల్లో చెట్లు కోల్పోయినవారికి ఆదుకోవాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రాజాం, పాలకొండ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, కళావతిలు మాట్లాడుతూ తప్పుడు కులధ్రువీకరణ పత్రాలు కలిగిన వారికి దీర్ఘకాలంగా చర్యలు ఉండటం లేదని విచారణ వ్యక్తంచేశారు.
కమిటీ సభ్యులు బొడ్డేపల్లి నర్శింహులు మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ధనుంజయరావు, ఆర్డీవో బలివాడ దయానిధి, డుమా పిడి ఆర్.కూర్మనాథ్, డిఎస్పీలు కె.్భర్గవరావునాయుడు, మోహనరావు, వివేక్‌నంద, దేవీప్రసాద్, కమిటీ సభ్యులు కృష్ణారావు, రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు.