శ్రీకాకుళం

తిరోగమన దిశలో ‘చెత్త నుండి సంపద’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, జూన్ 10: పారిశుద్ధ్యం కార్యక్రమాలల్లో భాగంగా ఏర్పాటు చేసిన చెత్తనుంచి సంపద ఉత్పత్తి కార్యక్రమం జిల్లాలో తిరోగమన దిశలో ఉంది. సోలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ డివిజనల్ కన్వీనర్ పి.సత్యనారాయణ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం విలేఖర్లతో మాట్లాడారు. 15 మండలాలల్లో ఈ ప్రాజెక్టు పరిమాణానికి స్థలం లభించలేదని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో పాతపట్నం, సోంపేట, మెళియాపుట్టి, కవిటి, భామిని మండలాల్లో మాత్రమే స్థలం లభ్యం కాగా ప్రాజెక్టు నిర్మాణం వివిధ దశలలో ఉన్నట్టు ఆయన తెలిపారు. అదే విధంగా సారవకోట, పొందూరు, కంచిలి, సంతకవిటి, హిరమండలం సరుబుజ్జిలి, ఎల్‌ఎన్ పేట, రణస్థలం, పలాస, నందిగాం, లావేరు, ఎచ్చెర్ల, మందస, వజ్రపుకొత్తూరు, ఇచ్ఛాపురం(రూరల్) మండలాలల్లో ఈ ప్రాజెక్టుల నిర్మాణాలకు స్థలం లభించలేదని ఆయన వివరించారు. కేవలం 30 సెంట్ల నుంచి ఎకరా వరకు మాత్రమే ఈ నిర్మాణానికి అవసరమని స్పష్టంచేశారు. రాళ్ల గుట్టలు, గోతులతో ఉన్న భూమి కాకుండా చదునుగా మైదానంలా ఉన్న స్థలాన్ని ఎంపిక చేయాలని ఆయన సూచించారు. ప్రజల వద్ద నుంచి సేకరించిన తడి చెత్త ద్వారా వర్మీ కంపోస్టులు, పొడి చెత్తనుంచి కాగితం, ప్లాస్టిక్ వస్తువులు వంటివి తయారు చేసే అవకాశం ఉందని తెలిపారు. అదే విధంగా పాడైపోయిన ప్లాస్టిక్ వస్తువులు, గాజు తదితర వస్తువులను ఈ ప్రాజెక్టులో పిండిగా మార్చి తారును తయారు చేయడానికి వినియోగిస్తారని ఆయన స్పష్టంచేశారు. గ్రామాలల్లో చెత్తపేరుకుపోకుండా ఉండేందుకు, చెత్తనుండి సంపదను కూడా ఉత్పత్తి చేయవచ్చునన్న ఆశాభావంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం నిర్వహించడానికి జిల్లాలో దాదాపు సగం మండలాలల్లో ప్రభుత్వ స్థలం లభించకపోవడం దురదృష్టం.