శ్రీకాకుళం

పలాస నుండి అమరావతికి డబుల్ డెక్కర్ రైలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస, జూన్ 30: రాష్ట్ర రాజధాని పాలనా విభాగాన్ని గుంటూరు జిల్లా అమరావతికి మార్పు చేయడంతో ఉత్తరాంధ్ర ప్రజలు నేరుగా రాజధానికి చేరుకునేందుకు పలాస నుండి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మీదుగా డబుల్ డెక్కర్(రెండస్తుల) రైలును ఈస్ట్‌కోస్ట్ రైల్వేశాఖ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇక్కడి రైల్వే అధికారులు తెలిపారు. సింగపూర్ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా ఏర్పడుతున్న నూతన రాజధానికి డబుల్ డెక్కర్ రైలు అతివేగంతో కనీసం ఐదు గంటల వ్యవధిలో రాజధానికి చేరుకునే విధంగా ఏర్పాట్లు సాగిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఈస్ట్‌కోస్ట్ రైల్వే జిఎం కేంద్ర రైల్వే శాఖనుండి కొన్ని అమతులు వచ్చాయని రైల్వే అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయవాడ మధ్య ఉన్న ప్రతీ రోజు సాగుతున్న రైల్వే రద్దీని తగ్గించేందుకే ఈ రెండస్తుల రైలు ఎంతో ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు ఆశిస్తున్నారు. దీంతోపాటు పలాస నుండి విజయవాడకు ఈ జిల్లాకు మరో పాసింజర్ రైలును ఏర్పాటు చేసేందుకు ఈస్ట్‌కోస్ట్ రైల్వే చర్యలు చేపట్టిందని అధికారులు తెలిపారు. మరికొద్ది రోజుల్లో రానున్న కృష్ణానది పుష్కరాలకు ఈ రైలు సిద్ధమయ్యే అవకాశం ఉందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్‌లో భువనేశ్వర్ నుండి అమరావతికి వెళ్లేందుకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసేందుకు పాలకులు ప్రతిపాదనలు చేశారని రైల్వే అధికారులు తెలిపారు.

ఆటోబోల్తా ఇద్దరికి గాయాలు
నరసన్నపేట, జూన్ 30: మండల కేంద్రంలోని జమ్ముకూడలి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఆటోబోల్తా పడిన ప్రమాదంలో ఇరువురికి గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనలో టెక్కలి నుండి నరసన్నపేట వైపు వస్తున్న ఆటో అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోటబొమ్మాళి మండలం శ్రీపురం గ్రామానికి చెందిన బాడాన లక్ష్మి, పోలాకి మండలం తిరువాడ గ్రామానికి చెందిన ఇప్పిలి గోవిందరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే శ్రీకాకుళం రిమ్స్‌కు వైద్య సహాయం కోసం పంపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని ఎస్‌ఐ ఎన్.లక్ష్మణ తెలిపారు.

స్వయం కృషితో ముందుకు వెళదాం
* ఐటిడిఎ పివో వెంకటరావు
పాతపట్నం, జూన్ 30: స్వయం కృషితో ముందుకు వెళదామని ఐటిడిఏ పివో జె.వెంకటరావు అన్నారు. ఆయన పాతపట్నం మండలం కోదూరు గ్రామం వద్ద వెలుగు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పుట్టుగొడుగుల కేంద్రాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ పుట్టగొడుగులు, బొప్పాయిసాగు, బంతిసాగు వంటి వాణిజ్య పంటలపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం రైతుకు ఒక బొప్పాయి మొక్క రూ.10, బంతి మొక్క రూ.3లకు అందజేస్తుందని వీటిద్వారా తక్కువ ఖర్చుతో అధిక లాభాలను పొందవచ్చునన్నారు. అనంతరం ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహిస్తున్న ఉద్యానవన పంటలు, పంటసంజీవిని కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపిడి సావిత్రి, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ఏ పివో తెంబూరు రవి, వెలుగు ఏపిఎం రవిరాజుతోపాటు రైతులు తదితరులు పాల్గొన్నారు.

కళ్ళ పట్ల శ్రద్ధ అవసరం
నరసన్నపేట, జూన్ 30: సమాజంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎక్కువగా నేత్ర వ్యాధులు వస్తున్నాయని, వీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యుడు భాస్కరరావు అన్నారు. గురువారం స్థానిక ఆసుపత్రి నుండి 21మంది నేత్ర రోగులకు శస్త్ర చికిత్స చేసేందుకు సోంపేట ఆరోగ్యవరం ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా ప్రతీనెలాఖరున శస్తచ్రికిత్సకు సంబంధించిన రోగులను గుర్తిస్తామని, ఇప్పటివరకు సుమారు 2వేల మందికి శస్త్ర చికిత్సలు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు లింగరాజు స్వామి, దాలిశెట్టి తదితరులు పాల్గొన్నారు.

రైలు ఢీ కొని 45 మేకలు మృతి
మందస, జూన్ 30: మందస రైల్వేస్టేషన్ పరిధిలోని బిన్నలమదనాపురం గ్రామ సమీపాన గురువారం సాయంత్రం పలాస వైపు నుంచి బరంపురానికి వెళ్తున్న సూపర్‌ఫాస్ట్ రైలు 45 మేకలను ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. లోహరిబంద గ్రామానికి చెందిన ఎ.రామారావు, జగ్గారావు, రామయ్య, సోమయ్యలకు చెందిన ఈ మేకలు విలువ సుమారు 2 లక్షల 50 వేల రూపాయలు ఉంటుందన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.