శ్రీకాకుళం

కార్మికులకు నష్టం కలిగించే జీవోలను రద్దుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), జూలై 4: జిల్లాలో పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు నష్టం కలిగించే రీతిలో ఉన్న జీవోలను తక్షణమే రద్దుచేయాలని ఎఐటియుసి నాయకుడు చిక్కాల గోవిందరావు కోరారు. సోమవారం జిల్లా ఫిర్యాదుల విభాగంలో జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. మున్సిపల్ కార్మికులకు నష్టం కలిగించే 279 జీవో రద్దుతో పాటు సివిల్ సఫ్లై కార్మికులకు పరిపాలన ఆమోదం తెలిపిన జీవో ప్రకారం బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సోంపేట గొల్లవీధిలో సీరియల్ నెం.131లో రైతుల ఆధీనంలో ఇసుకదిబ్బలు ఉన్నాయని, అవి అటవీ భూములకు ఆనుకుని ఉన్నందున, అటవీ అధికారులు ఆక్రమించుకుంటున్నారని కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని రైతులు కేశవరావు, లోకనాథం, ప్రమీలావతి తదితరులు వినతిపత్రం అందజేశారు. కంచిలి మండలం బలియపుట్టుగ సర్వే నెం.299/5, 301/12లో భూమి కోర్టుతగాదాలో ఉండగా, అవతలి వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని తహశీల్దారు, ఆర్‌డివోలకు చెప్పినా పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలని కె.సాయికుమార్ తెలిపారు. ఆమదాలవలసలో చిరువ్యాపారులను పైడి శ్రీను అనే వ్యక్తి బెదిరించి, తప్పడు ఫిర్యాదులతో పోలీసుదాడులు చేయిస్తున్నారని రక్షణ కల్పించాలని ఎస్.వి.మల్లికార్జునరావు కోరారు. ఆమదాలవలస మున్సిపాలిటీ నాలుగో వార్డుపరిధిలోని కశింవలస చెరువు ఆక్రమణకు గురవుతుందని, ఊర్లోని వ్యర్థాలను కూడా ఆ చెరువులోకి విడిచిపెట్టడంతో పరిసర వాసులు రోగాల పాలవుతున్నారని గుజ్జాల రామారావు, జోగి అప్పలరాజు తదితరులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2 పి.రజనీకాంతారావు, డిఆర్వో కృష్ణకుమారి, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.