శ్రీకాకుళం

12న పాఠశాలల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), జూలై 10: రాష్టవ్య్రాప్తంగా ఈనెల 12న ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల బంద్ పాటిస్తున్నట్లు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జిల్లా కన్వీనర్ వారణాశి సాయిసంతోష్ తెలిపారు. ఆదివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదలచేస్తూ అన్ని పాఠశాలల్లో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో వౌళిక వసతుల కల్పించడంతో పాటు మద్యాహ్న భోజన పథకాన్ని పటిష్టపరచి, నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని డిమాండ్ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ డిఈవో, మండల విద్యాశాఖాధికారి పోస్టులను భర్తీచేయాలని కోరారు. తమ డిమాండ్ల సాధనకై 12న చేపట్టబోయే పాఠశాలల బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.