శ్రీకాకుళం

‘బెట్టింగ్’ నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 14: నగరంలో వివిధ రకాలైన బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠా ప్రధాన సూత్రధారులను టూటౌన్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. గురువారం నగరంలోని కోటివీధిలో నారాయణశెట్టి వెంకట కిరణ్ ఉరఫ్ కిరణ్, నారాయణశెట్టి రవికాంత్ ఉరఫ్ రవి అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడిచేసి వారిని పట్టుకోవడమే కాకుండా వారితో పాటు 1,88,000 రూపాయల నగదు, సెల్‌ఫోన్లు, టాబ్, తొమ్మిది తులాల బంగారం, ఒక కారు, మూడు మోటారు సైకిళ్లుతో పాటు ఇదివరకు వారు బెట్టింగ్‌లో సంపాదించిన కోణార్క్ షాపు, దీపామహల్ వెనుకనున్న స్థలం, సానావీధిలో ఓ ప్లాట్, శ్రీప్రియ హోటల్ స్థలం, ఇలా సుమారు 30,24,38,000 రూపాయల విలువ చేసే స్థిరాస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు స్థానిక టూటౌన్ పోలీసు స్టేషన్ వద్ద డిఎస్పీ భార్గవరావు నాయుడు తెలిపిన వివరాల మేరకు కిరణ్ నగరంలోనే కాకుండా రాష్ట్రం, దేశం, ఇతర దేశాలను సైతం చుట్టివచ్చి బెట్టింగ్‌ల్లో పాల్గొంటున్నాడని, వీరి భారిన పడి చాలామంది యువత తమ స్థిర చరాస్తులు పోగొట్టుకున్నారని తెలిపారు. గతంలో వీరి బెట్టింగ్‌పై అందిన సమాచారం మేరకు ఏడుగురిని అరెస్టు చేసి కోర్టుకు తరలించామని, అయితే వీరి ప్రధాన సూత్రధారులైన కిరణ్, రవిలు తప్పించుకు తిరుగుతుండగా విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం వారిని పట్టుకున్నట్లు చెప్పారు. జిల్లాలో ఎటువంటి అసాంఘిక చర్యలక పాల్పడిన ఊరుకునేది లేదని, ఇటువంటి వారి బారిన పడి తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని ఆయన ప్రజలకు సూచించారు. నిందితులను పట్టుకునే వారిలో టూటౌన్ సిఐ దాడిమోహనరావు, కానిస్టేబుళ్లు బి.రమేష్‌బాబు, ఎల్.జగన్మోహనరావు, కె.మహందాత, కె.రామకృష్ణ, వై.ప్రదీప్, కె.మహేష్, టి.శ్యామ్ సిబ్బంది ఉన్నారు.