శ్రీకాకుళం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జూలై 17: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక పథకాలు ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఆదివారం మండలంలోని ఒప్పంగి పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీకూర్మం మెయిన్ ఛానల్‌పై ఆరు లక్షల నిధులతో నిర్మించిన కల్వర్టును, వరదబట్టి ఛానల్‌పై నిర్మించిన కల్వర్టును ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ శివారు భూములకు కూడా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నీరు, చెట్టు పథకం కింద చెరువు పనులు చేపట్టి ఆయుకట్టు పరిధిలోని భూములకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బాసటగా నిలివాలన్నారు. ఈ ఏడాది రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన విత్తనాలను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గొండు జగన్నాధరావు, వైస్ ఎంపిపి గుండ అసిరప్పడు, గ్రామ సర్పంచ్ యాగాటి శాంతకుమారి, గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.