శ్రీకాకుళం

వణకిస్తున్న అతిసార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్ ఎన్‌పేట, జూలై 17: మండలంలోని ఎల్ ఎన్‌పేట గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దకోట గ్రామంలో అతిసార వ్యాధితో తల్లీకూతురు మృతిచెందారు. శనివారం రాత్రి జన లక్ష్మి (55), మృతి చెందగా ఆమె కుమార్తె డి.రమణమ్మ (35) ఆదివారం మృతి చెందింది. ఆగ్రామానికి చెందిన పది మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో గ్రామంలో ఆందోళనలు నెలకొన్నాయి. ఆదివారం పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ గ్రామాన్ని సందర్శించారు. వైద్య సిబ్బంది పనితీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో కొన్ని రోజులుగా అతిసార వ్యాధి కనిపిస్తోంది. మంచం పట్టిన రోగులు ప్రైవేటు వైద్యుల వద్ద చికిత్స పొందుతుండగా, మరికొంతమంది శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వ్యాధిబారిన పడిన ఒకే కుటుంబానికి చెందిన భార్య, కూతురు మృతి చెందగా భర్త జన గురువులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్‌కు తరలించారు. బంగారు లక్ష్మణరావు, గుజ్జల గౌరీశంకర్, డి.దుర్గ, చింతాడ అప్పలస్వామి, దండుపాటి రాజేశ్వరమ్మ తదితరులు ఇంటివద్దనే చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ వైద్యం కోసం నానా అవస్థలకు గురికావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
వైద్య సిబ్బంది తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం
కొన్ని రోజులుగా వ్యాధి విజృంభించినా నివారణా చర్యలు చేపట్టకపోవడంపై పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాన్ని సందర్శించిన సమయంలో రోగులకు వైద్య సేవలు అందని విషయం గుర్తించి డిఎంహెచ్ ఒతో ఫోన్‌లో మాట్లాడారు. రోగులు మృత్యువాత పడుతున్నప్పటికీ వైద్య సిబ్బంది కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయకపోవడంపై ఫిర్యాదు చేశారు. దీంతో హుటాహుటిన డి ఎం అండ్‌హెచ్ ఒ మెండ ప్రవీణ్ గ్రామానికి చేరుకున్నారు. వ్యాధిగ్రస్తులకు అందుతున్న వైద్యంపై వివరాలు సేకరించారు. గ్రామంలోని పాఠశాల ఆవరణలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎల్ ఎన్‌పేట పిహెచ్‌సి వైద్యాధికారి భార్గవప్రసాద్ రోగులకు పరీక్షలు చేసి మందులు అందించారు. వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఎన్‌ఎంపై చర్యలు తీసుకోనున్నట్టు డిఎ హెచ్‌ఓ ప్రవీణ్ తెలిపారు. డిపిఓ కోటేశ్వరరావు గ్రామాన్ని సందర్శించి పారిశుద్ధ్య మెరుగు చర్యలు చేపట్టారు. కలుషిత నీరు వల్ల రోగాల బారిన పడినట్టు గుర్తించి పైపులైన్ మరమ్మతులపై సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.