శ్రీకాకుళం

పోలీస్ సేవల్లో స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస, జూలై 24: సమాజానికి పోలీసులు అందిస్తున్న సేవల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న స్వచ్ఛంద సం స్థలు భాగస్వామ్యం కావాలని శ్రీకాకు ళం డిఎస్పీ భార్గవరావునాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడి ఎస్‌ఎస్ ఎన్ కళ్యాణ మండపం వద్ద నిర్వహించిన రోటరీక్లబ్ సమావేశానికి ముఖ్యఅతిధిగా విచ్చేసి మాట్లాడారు. అంతర్జాతీస్థాయిలో గుర్తింపు పొందిన రోటరీ క్లబ్‌లో సభ్యులుగా సేవలందించడం ఎంతో అదృష్టమని ఆయన పేర్కొన్నా రు. రోటరీ సేవల వలన ప్రపంచ వ్యాప్తంగా పోలియో నిర్మూలన శతశాతం జరిగిందన్నారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణతో పోలీసులతో రోటరీ కమిటీ సభ్యులు సమన్వయం కావాలని ఆయన సూచించారు. స్మశాన వాటికలు, తాగునీరు, పేదలను ఆదుకోవడం, మురికివాడలకు వౌళిక వసతులు కల్పించడం వంటి సేవల్లో రోటరీ క్లబ్ అగ్రగామిగా నిలిచిందన్నారు. ముందుగా నిర్వహించిన రోటరీ ఎన్నికల్లో అధ్యక్షులు పివి ప్రతాప్‌కుమార్, కార్యదర్శిగా మహేష్; ఉపాధ్యక్షులుగా బొడ్డేపల్లి మాదురి, జాయింట్ సెక్రటరిగా కె.వరదరాజు, కోశాధికారిగా జనార్థనరాజును రోటరీ క్లబ్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈకార్యక్రమానికి రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్ వి ఎస్ రాజు, ప్రతినిధులు అప్పలనాయుడు, వెంకబాబు, కె.హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.