శ్రీకాకుళం

సిక్కోల్‌వాసిని రక్షించండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 28: టెక్కలి మండలంలో నివాసం ఉంటున్న టి.గోపికృష్ణ అనే ప్రొఫెసర్‌ను లిబియా ఉగ్రవాదులు బందీగా ఉంచారని, వారి నుంచి విమూక్తి కల్పించమంటూ శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్‌నాయుడు కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ను కలిసి కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి గోపీకృష్ణ కుటుంబ సభ్యులు పడుతున్న వేదన వివరించారు. దీంతో కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ స్పందిస్తూ లిబియాలో భారత పౌరుల విడుదల కోసం ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ప్రతినిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ప్రభుత్వం తరుఫున ప్రొఫెసర్ గోపికృష్ణ విడుదలకు పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందించి వారి కుటుంబాన్ని ఆదుకుంటామని ఆమె హామి ఇచ్చినట్టు ఎం.పి. రామ్మోహన్‌నాయుడు ఢిల్లీ నుంచి ‘ఆంధ్రభూమి’తో మట్లాడుతూ చెప్పారు. అలాగే, కేంద్ర స్కిల్‌డెవలప్‌మెంటు మంత్రి రాజీవ్‌ప్రతాప్‌రూడ్‌ని గురువారం కలిసినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో స్కిల్‌డెవలప్‌మెంటు సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరినట్టు చెప్పారు. జిల్లాలో వనరులు అందుబాటులో ఉండే రంగాలపై సర్వే జరిపించి, ఆ రంగాల్లో శిక్షణ ఇవ్వాలని కోరినట్లు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. తద్వారా నిరుద్యోగ యువతకు కేంద్ర సహాయంతో ఉద్యోగఅవకాశాలు కల్పించేందుకు వీలువుంటుందన్న ఆశాభావాన్ని కేంద్ర మంత్రి ముందు వెల్లడించారు. స్కిల్‌డెవలప్‌మెంటు సెంటర్ ఏర్పాటు చేయాలంటూ ఎం.పి. కోరారు.