శ్రీకాకుళం

కన్నతల్లి కన్నీటి నిరీక్షణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 31: కన్నతల్లి కన్నీటి నీరక్షణకు ఏడాది నిండింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లిబియా కిడ్నాప్ మిస్టరీని చేధించలేకపోయింది. కనిపించని కొడుకు కోసం.. ఏడాదిగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు.. భార్యబిడ్డలు. సరిగ్గా ఏడాది కిందట ఐసిస్ ముష్కరుల చెరలో చిక్కిన తమ కొడుకు ప్రొఫిసర్ గోపీకృష్ణను విడిపించాలని..కనిపించిన ప్రతీ రాజకీయనాయుకుడిని కాళ్లావేళ్ళా పడి వేడుకుంటున్నారు తల్లిదండ్రులు వల్లభనారాయణ, సరస్వతమ్మలు. అదిగో మాట్లాడుతున్నాం.. ఇదిగో విడిపిస్తున్నాం.. అంటున్నారే తప్ప ఏడాది గడిచిపోయినా కొడుకు బందీగానే ఉండిపోయాడని ఆ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పరాయిదేశంలో కనబడకుండాపోయిన కొడుకు కోసం.. ఎదురుచూసిన ఈ తల్లిదండ్రుల గుండెలు బండబారిపోయాయి. ఇదిగో వస్తాడు.. అదిగో వస్తాడని నాయకులు ధైర్యవచనాలు చెబుతున్నప్పటికీ ముష్కరుల చెరలో చిక్కిన కొడుకు ఏమయ్యాడోననే ఆందోళన ఈ మాతృమూర్తి గుండెల్లో మంటలు రేపుతోంది.
లిబియాలో ఐసిస్ చెరలో చిక్కిన గోపీకృష్ణ
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన గోపీకృష్ణ లిబియా దేశంలో ప్రొఫిసర్‌గా పనిచేస్తు ఉగ్రవాదుల చెరలో చిక్కాడు. 2015, జూలై 29న గోపీకృష్ణతోపాటు మరో ముగ్గురిని కూడా ఐసిస్ ముష్కరులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హడావుడి చేశాయి. లిబియాలోని భారత విదేశాంగ కార్యాలయంతో నిరంతర సంప్రదింపులు జరిపి ఇద్దరిని విడిపించగలిగారు. కాని - గోపికృష్ణతోపాటు మరోకరిని ఇంకా తమ వద్దనే బందీలుగా ఐసిస్ ముష్కరులు ఉంచుకున్నారు. కన్నకొడుకును కన్నులారా చూడాలని తల్లిదండ్రులు, భార్యబిడ్డలు పరితపిస్తున్నా.. నాయకుల మాటలు నీటిమీదరాతలుగానే మిగిలిపోయాయి. తమ కొడుకును విడిపించాలని కన్నీరుపెట్టుకున్నా ఏడాది గడిచినా ఇంకా ఫలితం దక్కలేదు. భారత విదేశాంగశాఖతో పాటు రాష్ట్ర నాయకులు చేసిన హడావిడితో తమ కుమారుడు తొందరలోనే తిరిగోస్తాడని గోపీకృష్ణ కుటుంబీకులు ఆశపడ్డారు. కానీ - ఏడాది గడచినా తిరిగిరాని కొడుకుకోసం ఈ తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
గోపీకృష్ణ విడుదల విషయంపై ఏడాదికాలంగా కేంద్రప్రభుత్వం నుంచి ఒకే మాట వస్తోంది. లిబియా ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నామని, గోపీకృష్ణను త్వరలోనే విడిపిస్తామంటున్నారు. గోపీకృష్ణను రక్షించడంపై అటు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ నిరంతరం విజ్ఞప్తి చేస్తునే ఉన్నామని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు చెబుతున్నారు. ఇటీవలే మరోసారి విదేశాంగమంత్రిని కలిసి గోపీకృష్ణను ముష్కరల చెర నుంచి విడుదల చేయించమంటూ వినతిపత్రాన్ని ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేసారు. అయితే, భారత విదేశాంగశాఖ చెబుతున్నట్టు ఉగ్రవాదుల చెరలో ఉన్న గోపీకృష్ణ నిజంగా బతికే వుంటే..కనీసం ఫోన్‌లో అయినా మాట్లాడించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.