శ్రీకాకుళం
స్నేహితుడు మాట్లాడలేదని విద్యార్థిని ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
టెక్కలి, ఆగస్టు 2: మూడేళ్ళ నుంచి పరిచయం ఉన్న స్నేహితుడు ఫోన్లో మాట్లాడలేదని ఆత్మహత్యకు పాల్పడింది ఓ విద్యార్థిని. స్థానిక ఎన్టిఆర్ నగర్‌కు చెందిన జి.దేవిశ్రీ(19) మంగళవారం తల్లిదండ్రులు లేని సమయంలో ఫ్యాన్‌హుక్‌కు చీరతో ఉరివేసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడింది. దేవిశ్రీ స్థానిక డిగ్రీకాలేజిలో రెండో ఏడాది చదువుతోంది. అదే గ్రామంలోని కండ్రవీధికి చెందిన డ్రైవర్‌గా పనిచేస్తున్న మురళీతో కొన్ని కారణాలు వల్ల ఫోన్లో మాట్లాడలేదనే ఆవేశంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులు గ్రామంలోని ఓ శుభకార్యానికి వెళ్లి ఇంటికి వచ్చేసరికి కొనఊపిరితో ఉన్న కుమార్తెను చూసి హుటాహుటిన 108లో స్థానిక ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమాధ్యంలో దేవిశ్రీ మృతి చెందింది. టెక్కలి ఎస్ఐ రాజేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.