శ్రీకాకుళం

ఎన్నికల వాయిదా పాపం మీది కాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 12: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మంత్రిగా కీలక స్థానంలో ఉన్న నేటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అనుచిత నిర్ణయాల కారణంగానే 2010 నుంచి పట్టణానికి ఎన్నికలు లేకుండా పోయాయని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నాడు మున్సిపాలిటీ పరిధిని పెంచడానికి ధర్మాన పరిసర గ్రామ పంచాయతీల నేతలతో చర్చించకుండా విలీన ప్రక్రియను తీసుకురాగా, ఆయా సర్పంచ్‌లు వ్యతిరేకించి కోర్టును ఆశ్రయించడం కారణంగానే నేటి వరకు పట్టణంలో ఎన్నికలు లేకుండా పోయాయని విమర్శించారు. వీటన్నింటినీ విస్మరించి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు కాగా ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతోందని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. త్వరలోనే ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ స్థాయి నుండి నగర స్థాయికి చేరుకున్న పట్టణ ఎన్నికలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్న విషయాన్ని గుర్తుచేసారు. 2014 ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుపొందిన స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పనితీరుపై విమర్శించే స్థాయి ధర్మానకు లేదని, రాష్ట్రంలో నెం.1 ఎమ్మెల్యేగా గుర్తింపును పొందిన లక్ష్మీదేవిపై విమర్శలను ప్రజలెవరూ పట్టించుకోరన్న విషయాన్ని గ్రహించాలన్నారు.
సమావేశంలో భాస్కరరావు, బస్వా రాజేష్‌రెడ్డి, ఐ.తిరుమలరావు, గొర్లె కృష్ణారావు, సిరిపురపు భాస్కరరావు, కరగాన రాము, ఎస్.వెంకటరావు పాల్గొన్నారు.