శ్రీకాకుళం

ఎ.సి.ఎ చేతిలోకి జిల్లా క్రికెట్ సంఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలగ, ఆగస్టు 18: కొద్ది నెలల నుంచి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోర్టు కేసు వలన స్థంబించిన కార్యక్రమాలు మరలా యథావిధిగా నిర్వహించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆదేశాల మేరకు జిల్లాకు విచ్చేసినట్లు నార్త్‌జోన్ కార్యదర్శి జి.వి.సన్యాసరాజు అన్నారు. స్థానిక క్రికెట్ అసోసియేషన్ కార్యాలయం దగ్గర గురువారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేశామంటూ తమ పేరు మీదనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వాటిని అప్పగించాలంటూ కోర్టుకెక్కిన నాటి సభ్యులకు అనుకూలంగా తీర్పు రావడంతో క్రికెట్ కార్యక్రమాలు నిలిపివేసి సంఘాన్ని అప్పజెప్పాలంటూ తీర్పు ఇవ్వడం వంటి గందరగోళ పరిస్థితిలో జిల్లా క్రికెట్ పూర్తిగా అడుగంటి పోయాయన్నారు. అందుకే జిల్లా క్రికెట్ సంఘాన్ని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ చేతిలోకి తీసుకుని క్రికెట్‌ను బలోపేతం చేసేందుకు జిల్లాకు విచ్చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో శ్రీకాకుళంతోపాటు తూర్పుగోదావరి జిల్లాలో పోటీలు నిర్వహించడానికి సరిపడా సదుపాయాలు లేవని, సరైన టర్ఫ్ వికెట్ కూడా లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచి ఎ సి ఎలో పనిచేస్తున్న కోచ్‌లు, ఇతరులు అంతా తమ పరిధిలోకి వస్తారని, వారి జీతాలు తమ వద్ద నుంచి వెళతాయన్నారు. జిల్లాలో క్రికెట్ మైదానానికి సరిపడా నీరు లేదని, సరైన మైదానం లేకపోవడం విచారకరమన్నారు. ప్రస్తుతం అండర్-14 ఎంపికలు, టాలెంట్ సెర్చ్ ఎంపికలను సీనియర్ శిక్షకులను రప్పించి నిర్వహిస్తామన్నారు. ఇక్కడి సీనియర్ క్రీడాకారులందరూ కలిసి జిల్లా క్రికెట్‌ను అభివృద్ధి చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో శిక్షకులు కె.సుదర్శన్, వరహాలు, సెలక్టర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
* క్రికెట్‌ను బతికించండంటూ
కార్యదర్శిని కోరిన క్రీడాకారులు
జిల్లాలో క్రికెట్ క్రీడను బతికించి న్యాయం చేయాలంటూ నార్త్‌జోన్ కార్యదర్శి సన్యాసరాజును క్రికెట్ క్రీడాకారులు, వారి తండ్రులు వచ్చి ఆయన వద్ద వేడుకున్నారు. సుమారు ఏడాది నుంచి క్రికెట్ పూర్తిగా స్తంబించిందని, ఇప్పటికైనా పూర్తిస్థాయిలో దృష్టిసారించకపోతే పిల్లలను క్రికెట్ నుంచి తప్పిస్తామని వేడుకున్నారు.