శ్రీకాకుళం

హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్ఛాపురం, ఆగస్టు 30: జిల్లాలో సంచలనం సృష్టించిన తల్లి, కుమారుల హత్య కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. పట్టణ ఇన్‌ఛార్జి ఎస్‌ఐ చిన్నంనాయుడు మంగళవారం విలేఖరులకు వివరాలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం పట్టణానికి చెంది బంగారం వ్యాపారి బి.కేశవరావు భార్య వెంకటగోపాలలక్ష్మి, కుమారుడు కిరణ్‌కుమార్ 2008, ఆగస్టు 28వ తేదీన వారి నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో డి.బలరాంరెడ్డి, గోపిలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి ఎస్‌ఐ మురళీకృష్ణ కేసు నమోదు చేయగా, సిఐలు జనార్దన్‌సింగ్, దేవానందసాంతోలు దర్యాప్తు జరిపారు. సోంపేటలో ఆరో అదనపు జిల్లా సెషన్స్ జిల్లా కోర్టులో కేసు విచారణ కొనసాగింది. వాదప్రతివాదాలు అనంతరం జిల్లా అదనపు సెషన్స్ జడ్జి బబిత మంగళవారం తీర్పు వెలువరించారు.
ఇద్దరి హత్య కేసులో 302 సెక్షన్ కింద నిందితులకు జీవితఖైదు, 2000 వేల రూ.లు జరిమానా విధించారు. జరిమానా చెల్లించకుంటే ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. సెక్షన్ 450 కింద 10 ఏళ్ళ జైలు, 2 వేల రూ.లు జరిమానా, సెక్షన్ 370 కింద ఏడు ఏళ్లు జైలు శిక్ష విధించారు. శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరపున పిపిలు జి.పున్నయ్య, వినయ్‌భూషణ్‌లు వాదించారు.