శ్రీకాకుళం

పరారీలో నిందితుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఆగస్టు 30: నగరంలో సంచలనం సృష్టించిన వ్యాపారి హత్యకేసులో నిందితుడు పరారీలో ఉన్నాడు. సోమవారం అర్ధరాత్రి ఇక్కడి పాత బస్టాండ్ దరి నూతన్ స్వీటు షాపు యజమాని గుడ్ల వెంకటరమణను ఓ వ్యక్తి కత్తితో పొడిచి పరారైన విషయం తెలిసిందే. చికిత్స కోసం వెంకటరమణను రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమద్యలో మృతిచెందగా, పోలీసులు దీనిని చాలెంజ్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో ఎన్నడూ లేనిది ఓ వ్యాపారి హత్య అదీ వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిసరాల్లో సంభవించడంతో వ్యాపార వర్గాల్లో ఆందోళన రేకిత్తించింది. వ్యాపార వర్గాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఈ విధంగా భయాందోళనకు గురిచేస్తే, తాము వ్యాపారాలు చేయలేమని వారు మంగళవారం షాపులు బంద్‌చేసి నిరసనలు తెలిపారు. కాగా జిల్లా ఎస్పీగా జె.బ్రహ్మారెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించిన నాటినుండి జిల్లాలోని రౌడీషీటర్లపై కనె్నర్ర చేస్తూ, ఎప్పటికప్పుడు వారికి కౌన్సిలింగ్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం ఆయన నగరంలోని రౌడీషీటర్లను టూ టౌన్ పోలీసు స్టేషన్‌కు పిలిపించి వారికి వార్నింగ్ ఇవ్వగా సోమవారం ఈ హత్య జరగడం నగరంలో పెద్ద సంచలనమైంది. అయితే, ఈ హత్యకు దారితీసిన పరిస్థితులను గమనిస్తే మాటపట్టింపుతో వ్యాపారిని హత్య చేయడం ఆందోళన కలిగిస్తున్న విషయం. కాగా నిందితుడు లెప్రసీకాలనీ గొల్లవీధికి చెందిన గణపతిగా తెలుస్తోంది. ఈయన తన భార్యతో గొడవపడి వాంబే కాలనీలో నివాసం ఉంటున్నాడు.
అయితే పోలీసులు నిందితుని పట్టుకోవడానికి గాలింపు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో నిందితునికి సహకరించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుంటే అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తున్న విషయాన్ని బయటకు పొక్కకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ ఈ కేసును సీరియస్‌గా పరిగణించి దర్యాప్తు బాధ్యతలను డిఎస్పీ కె.్భర్గవరావునాయుడు, సిఐ ఆర్.అప్పలనాయుడులకు అప్పగించారు. అతి త్వరలోనే నిందితుని పట్టుకుని తీరతామని, ఎట్టి పరిస్థితుల్లోను రౌడీయిజాన్ని క్షమించేది లేదని పోలీసులు తెలిపారు.