శ్రీకాకుళం

స్వచ్ఛ్భారత్‌ను విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), ఆగస్టు 30: స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని అంబేద్కర్ వర్శిటీ ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ సంజీవయ్య పిలుపునిచ్చారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ 1,2 యూనిట్లు మంగళవారం కళాశాలలో సెమినార్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సంజీవయ్య మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్-ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల పాత్రఅనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మనస్సులు స్వచ్ఛంగా ఉండాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించుకోవచ్చునన్నారు. ఇందుకు ప్రతీ ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీరు సామాజిక స్పృహతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కళాశాల ప్రిన్సిపల్ ఎంఆర్ జ్యోతీఫెడరిక్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన యువత ఆరోగ్య వంతమైన దేశాన్ని నిర్మిస్తుందన్నారు. విద్యతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు 1,2 ప్రోగ్రామ్ ఆఫీసర్లు మొదలవలస ఇందువదన, జ్యోతి, ఏ.మీరాభాయ్, శంకరనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.