శ్రీకాకుళం

మరుగుదొడ్లు లేని గ్రామాలను గుర్తించండి: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఆగస్టు 30: జిల్లాలో అక్టోబర్ 2 నాటికి ఎంపిక చేసిన 178 గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా స్వచ్ఛ్భారత్ మిషన్ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. 38 మండలాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో మరుగుదొడ్లు లేని కుటుంబాలను గుర్తించి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి ఇవ్వాలని ఎండివోలను ఆదేశించారు. అదే విధంగా అక్టోబర్ 2 నాటికి గతంలో ఎంపిక చేసిన 178 గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తయారు చేయాలని ఆదేశించారు. మిగిలిన గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాల్లో సమస్యలను పరిష్కరించి మార్చి 2017 నాటికి ఓడిఎఫ్ గ్రామాలుగా మార్పు తీసుకురావాలన్నారు. గతంలో ఎస్‌బిఎం స్కీమ్ ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్లు అనుమతి పొంది ఇంతవరకు వర్క్ ఆర్డర్ పొందని వాటిని వెంటనే రద్దుపరిచి ఎన్‌ఆర్‌ఈజిఎస్ స్కీమ్ ద్వారా అనుమతులు పొంది పనులు ప్రారంభించాలని ఎంపిడివోలను ఆదేశించారు. అదే విధంగా గ్రామాల్లో మురుగునీరు, వ్యర్థాలను బయటకు తరలించేందుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. మందస, బారువ, గార, ఇచ్ఛాపురం, భామిని, సీతంపేట మండలాల్లో వ్యక్తిగత మరుగదొడ్ల నిర్మాణాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. 178 గ్రామాల వివరాలను జిల్లాలోగల ఎమ్మెల్యేలందరికీ వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న వివరాలను అందజేయాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాజాం నియోజకవర్గంలో సుమారు 75 గ్రామాలకు మంచినీటి సౌకర్యంలేదని ఎమ్మెల్యే జోగులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగ వెంటనే అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరాకు సంబంధించి చర్యలు చేపట్టాల్సిందిగా గ్రామీణ నీటి సరఫరా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ కూన రవికుమార్, జెడ్పి చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, ఎమ్మెల్యేలు లక్ష్మీదేవి, గౌతు శ్యాంసుందరశివాజీ, బగ్గురమణమూర్తి, వై.కళావతి, కలమట వెంకటరమణమూర్తి, డుమా పీడి కూర్మనాథ్, జెడ్పి సీ ఇవో నగేష్, జిల్లా పంచాయతీ అధికారి కోటేశ్వరరావు, ఆర్ డబ్ల్యూ ఎస్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎన్ వి రమణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.