శ్రీకాకుళం

జన్మభూమి కమిటీల జగడం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాల్సిన తెలుగుదేశం ప్రభుత్వం వీటి పెత్తనాన్ని జన్మభూమి కమిటీలకు అప్పగించి రాజ్యాంగేతర శక్తులను ప్రోత్సహిస్తుందన్న అపవాదు లేకపోలేదు. రెండేళ్లుగా జన్మభూమి కమిటీ సభ్యులు కనుసన్నలల్లో రేషనకార్డులు, పింఛన్లు, నీరు-చెట్టు పనులు చంద్రన్నబాట వంటి కార్యక్రమాలు వడ్డన సాగిస్తున్న విషయం తెలిసిందే. చైతన్యంలో ముందు వరుసలో ఉన్న శ్రీకాకుళం తమ్ముళ్లు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ఆత్మాభిమానం దెబ్బతింటే అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేయడం పరిపాటిగా మారింది. నిన్నటివరకు పాలకొండ నియోజకవర్గంలో జన్మభూమి కమిటీలు వివాదం ఇంకా సద్దుమణగకుండానే రేగిడి ఆమదాలవలస మండలంలోని ఇదే రీతిలో తలెత్తిన జగడం జిల్లా నాయకత్వాన్ని ఓ కుదుపుకుదిపేస్తోంది. ఎప్పటినుంచో ఉప్పూ-నిప్పులు ఉన్నా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు, ఎమ్మెల్సీ కావలి ప్రతిభాభారతీలు ఒక్కసారి మైత్రీబంధం సాగించడంతో అక్కడ జన్మభూమి కమిటీ సభ్యులు ఖంగుతినాల్సి వచ్చింది. కళావెంకటరావు సోదరుడు, వైస్ ఎంపిపి మండలంలోని మొత్తం 68మంది జన్మభూమి కమిటీ సభ్యులను మార్చేసి తమకు అనుకూలమైన వారికిపనులు ఇప్పించుకునేలా రంగం సిద్ధం చేయడంతో ఈ జగడం ఆరంభమైంది. ఆదినుండి తెలుగుదేశంపార్టీని నమ్ముకుని ఉన్నమండల పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న వెంకటవేణుగోపాలనాయుడు(అంబకండి), ప్రధాన కార్యదర్శి పాలవలస రామన్నాయుడు(పెద్దసిర్లాం), ఉపాధ్యక్షుడు కెంబూరి వెంకటేశ్వరరావు, కెంబూరి గోపాలనాయుడు(సంకిళి పిఎసిఎస్) అధ్యక్షుడు, జిల్లా తెలుగురైతు అధ్యక్షులు జగ్గునాయుడులు ఎమ్మెల్సీ ప్రతిభాభారతీకి ప్రధాన అనుచరులుగా వ్యవహరించేవారు. అయితే, ఈ గ్రామాల్లో కూడా జన్మభూమి కమిటీలు పేర్లు తారుమారు చేసి కిమిడి కుటుంబ అనూయలకు పనులు అప్పగించి రూ.3కోట్లు ఏడు పంచాయతీల్లో నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైస్ ఎంపిపి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వీరంతా జిల్లా మంత్రి అచ్చెన్నాయుడుకు ఫిర్యాదు చేయగా క్యాడర్‌కు అండగా నిలవాలన్న సంకల్పంతో ఈ ఘటనపై విచారణ సాగించాలని కలెక్టర్ లక్ష్మీనృసింహం, జెడ్పి సీఈవోను మంత్రి ఆదేశించారు. జన్మభూమి కమిటీ నిబంధనల ప్రకారం జీవో ఎంఎస్ నెం.135,22 ప్రకారం జిల్లా మంత్రికే పూర్తి అధికారాలు ఉన్నాయి. అయితే, ఇందుకు భిన్నంగా కమిటీ సభ్యులను మార్చి పార్టీ శ్రేణులను అగౌరవపరిచేలా అక్కడి నేతలు వ్యవహరించడంపై దిద్దుబాటు చర్యలకు మంత్రి రంగంలోనికి దిగాల్సి వచ్చింది. ఓ వైపు పార్టీప్రతిష్ఠ దిగజారేలా స్థానిక నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిఘటిస్తూ సీనియర్లంతా అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లేలా పావులు కదుపుతున్నట్టు సమాచారం. జన్మభూమి కమిటీ సభ్యుల తారుమారులో ప్రధాన భూమికి పోషించిన ఎంపిడివోపై విచారణకు కూడా జెడ్పి సీఇవో ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు కళా సోదరుడు ఎమ్మెల్సీ ప్రతిభాభారతితో రాయభారం నెరిపి కమిటీల్లో పేర్లు తారుమారు చేసిన వ్యక్తులే అసలుసిసలైన జన్మభూమి కమిటీ సభ్యులని ఓ ధ్రువీకరణ కూడా ఇప్పించుకోవడంలో సఫలీకృతులయ్యారని చెప్పకతప్పదు. ప్రతిభాభారతి తీసుకున్న ఈ నిర్ణయాన్ని అక్కడ పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జీవో ప్రాప్తికి జన్మభూమి కమిటీలను రద్దుచేసే అధికారాలు జిల్లా మంత్రికే తప్ప మరేవరికీ లేవంటూ రేగిడి దేశం దళం అధికారుల వద్ద వాగ్వివాదానికి దిగుతున్నారు.
మారిన సమీకరణాలు
జిల్లా పార్టీలో ఎప్పుడూ గ్రూపుల గోల కొనసాగుతూ ఉంది. దివంగత కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు ప్రధాన అనూయరాలుగా ఎమ్మెల్సీ కావలి ప్రతిభాభారతి ఉంటూ వచ్చేవారు. ఇదే కారణం చేత గడిచిన ఎన్నికల్లో రాజాం నియోజకవర్గంలో కిమిడి కళావెంకటరావు తన వర్గం వారితో ప్రతిభను ఓడించారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. అప్పటినుంచి కళా-ప్రతిభల మధ్య మరింత దూరం పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే మంత్రి అచ్చెన్నాయుడు వర్గంలో ప్రతిభ కీలకపాత్ర పోషిస్తూ రాజకీయాలు నెరుపుతున్నారు. ఒక్కసారి ప్రతిభ యూ టర్న్ తీసుకొని జన్మభూమి కమిటీల విషయంలో అనూయలను కూడా పక్కనపెట్టి కళాతో సరికొత్త మైత్రీ బంధాన్ని నెరపడాన్ని సామాన్యకార్యకర్తల సైతం తప్పుపడుతున్నారు. అక్కడ క్యాడర్‌ను కాపాడుకునే పనిలో మంత్రి పావులు కదపడం అధికారులు మరింత ఇరకాటంలో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లా పార్టీలో హాట్ టాపిక్‌గామారిన జన్మభూమి కమిటీల పేర్లు మార్పు మున్ముందు ముఖ్యమంత్రి పంచాయితీకి చేరే పరిస్థితులు కూడా లేకపోలేదు. అవినీతిరహిత పాలన అందిస్తామని ముఖ్యమంత్రి పదేపదిసార్లు చెబుతున్నా పార్టీ క్యాడర్ మాత్రం కమిటీలను మార్చేసి ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారని రేగిన రేగిడి ఘటనపై అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో అన్న చర్చ కూడా నేతల్లో సాగుతోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా ఇలాకాలో ఈ ఘటన టీ కప్పులో తుపానుగా మారుతుందా... క్యాడర్‌లో ఉత్తేజాన్ని నింపేందుకు అధిష్ఠానం సంచలనాత్మక నిర్ణయం తీసుకొనే క్రమంలో సునామీ సృష్టిస్తుందో వేచి చూడాలి మరి.