శ్రీకాకుళం

పరశురాంపేట కూడలిలో వ్యక్తి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాం, ఆగస్టు 30: మండలంలోని గురవాం గ్రామ సమీపం, పరశురాంపేట కూడలిలో రేగిడి మండలం బూరాడకు చెందిన గులివిందల సత్యం(47) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని మంగళవారం ఉదయం స్థానికులు కనుగొని పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మృతుడు రేగిడి మండలం బూరాడకు చెందినవాడిగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే బూరాడ గ్రామానికి చెందిన సత్యం మద్యానికి బానిసై ప్రతిరోజూ మద్యం కోసం బెల్ట్ షాపులను ఆశ్రయించేవాడని, అదే క్రమంలో పరశురాంపేట కూడలిలో ఉన్న బెల్ట్‌షాపులో సోమవారం సాయంత్రం మద్యం సేవించేందుకు వెళ్లి తిరిగి రాలేదు. ఎప్పుడూ ఇదే విధంగా జరగడంతో కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. మంగళవారం తీవ్ర గాయాలతో ఉన్నట్టు తెలియడంతో తండ్రి పెదసీతయ్య, మృతుని భార్య బుల్లెమ్మ సంఘటనా స్థలానికి చేరుకొని తమ భర్తను హత్య చేసి పడివేశారని తీవ్రంగా రోదిస్తూ ఆరోపించారు. సత్యంకు భార్య బుల్లెమ్మతో పాటు పిల్లలు నాగమణి, జానకీరాములు ఉన్నారు. హత్య జరిగిన సంఘటనను పాలకొండ డిఎస్‌పి సి.హెచ్. ఆదినారాయణ, క్లూస్‌టీమ్ సభ్యులు పరిశీలించి హత్యగా నిర్ధారించారు. అయితే, మద్యం షాపు వద్ద ఘర్షణ జరిగిందా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ మేరకు రాజాం సిఐ సాకేటి శంకరరావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ కరణం హరిబాబు శవపరీక్ష నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. ఇదిలావుండగా సంఘటన జరిగిన ప్రాంతం రేగిడి మండల పరిధిలోనిది అని తెలిసి రేగిడి పోలీసులు ముందుగా రంగప్రవేశం చేశారు. అయితే ఈ ప్రాంతం రాజాం పరిధిలోనిది అని సందేహం రావడంతో స్థానిక రెవెన్యూ అధికారులు వచ్చి పరిశీలన చేశారు. సంఘటన జరిగిన ప్రాంతం రాజాం పరిధిలోనిది అని తేల్చడంతో చివరకు రాజాం పోలీసులు కేసు నమోదు చేశారు.