శ్రీకాకుళం

భానుడు భగభగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఏప్రిల్ 15: హిందువులకు అత్యంత ఇష్టదైవం శ్రీరాముడుకాగా శ్రీరాముడు పుట్టిన తిధి నవమి సందర్భంగాశ్రీరాముడి జన్మోత్సవాలు జిల్లా అంతటా అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడందరామస్వామి ఆలయం, వాడవాడలా రామాలయాలు, రామమందిరాల్లోనూ, విష్ణు ఆలయాల్లోనూ శ్రీరామనవవి, సీతారామ కల్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే పెద్దఎత్తున భక్తులు రామాలయానికి వెళ్ళి శ్రీరాముని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అయితే పది గంటలు దాటేసరికి భానుడు భగభగ మండిపోయి క్యూలైన్లలో భక్తులపై ప్రభావం చూపించాడు. దీంతో నిర్వాహకులు గ్లాసులతో పానకం అందజేయడంతో భక్తులు వడదెబ్బ నుంచి తప్పించుకోగలిగారు. ఔషధగుణాలు కలిగిన పానకాన్ని బెల్లం, జీలకర్ర ప్రధానంగా వినియోగించి తయారుచేస్తారు. శ్రీరామనవమి చైత్రమాసంలో రావడం, ఆ సమయానికి ఎండలు తీవ్రంగా ఉండడంతో ఉష్ణతాపాన్ని తగ్గించేందుకు పానకం పంపిణీ అనాదిగా వస్తున్న సాంప్రదాయం. రామరసంతోపాటు, వడపప్పు ప్రసాదాన్ని భక్తులకు ఇవ్వడంతో సొమ్మసిల్లిపోయే గుణాన్ని నివారించేలా నవమి రామచంద్రమూర్తి రక్షించినట్టు అయ్యింది. అప్పటికీ ఇక్కడ పాలకొండ రోడ్డులో కోదండరామస్వామి ఆలయానికి వచ్చిన భక్తుల్లో ఎనిమిది మందికి వడదెబ్బ తగిలి ఆసుపత్రిలో చేరారు. టెక్కలి, రాజాం, ఆమదాలవలస, గార, శ్రీకాకుళం రూరల్ ప్రాంతాల్లో మొత్తం 24 మంది భక్తులు వడదెబ్బతో ఆసుపత్రుల పాలయ్యారు. ఆలయాల కమిటీ నిర్వాహకులు, దేవాదాయశాఖ అధికారులు సకాలంలో స్పందించకపోయుంటే మరింతమంది వడగాల్పులకు దెబ్బతినేపరిస్థితి ఏర్పడేది. క్యూలైన్లు కొన్ని ఆలయాల్లో సూర్యప్రతాపం లేకుండా ఏర్పాటు చేస్తే, మరికొన్ని ఆలయాల్లో ఆ సౌకర్యాలకు కొంత ఇబ్బంది కలగడంతో అక్కడక్కడ వడదెబ్బకు భక్తులు గురికావల్సివచ్చింది. శ్రీకాకుళంలో వడగాల్పుల ప్రభావం ఇంకా ఎక్కువైంది. ఉష్టోగ్రతలు పెరిగిపోతున్నాయి. సాధారణ ఉష్టోగ్రతలు కంటే 5 డిగ్రీలు పెరిగినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో అత్యధికంగా సిక్కోల్‌లో 41 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైనట్లు వాతావారణశాఖ తెలిపింది. వాస్తవానికి ఈ సంవత్సరం గతంతో పోలిస్తే వేసవి తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ, ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ తక్కువగా ఉష్టోగ్రత నమోదవుతోంది. జిల్లాలో కొద్ది రోజులుగా ఉదయం వేళలోను, సాయంత్రం వేళలోను ఆకాశం నిర్మలంగా ఉన్నప్పటికీ, వడదెబ్బకు పది మంది మృత్యువాత పడ్డారు. మరో రెండురోజుల్లో ఉష్టోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణశాఖ నిపుణులు హెచ్చరించడంతో కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం యంత్రాంగాన్ని ప్రత్యేక బృందాలుగా మండలాలవారీగా ఏర్పాటు చేసి చర్యలు తీసుకునేలా రెవెన్యూ సిబ్బంది పరుగులు తీస్తున్నారు. జిల్లాలో శుక్రవారం 41 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ వేడిమి తీవ్రంగా ఉంటోంది. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత రోడ్లపై నడిచేందుకు ప్రజలు భయపడుతున్నారు. కానీ, శుక్రవారం శ్రీరామనవమి మహోత్సవాలు సందర్భంగా జనాలు రోడ్లపైకి రావడంతో వడదెబ్బకు 24 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరారు. ఇంకా కారైలు ప్రారంభం కాకముందే పరిస్థితి ఇలా ఉంటే కార్తెలు ప్రారంభమైన తర్వాత, ముఖ్యంగా రోహిణి కారై సమయంలో ఎండలు ఏ విధంగా ఉంటాయో తలచుకుంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రానున్న మే నెలలో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయనిఅంచనా వేస్తున్నారు. గత సంవత్సరం జిల్లాలో 43 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. తాగునీటి వనరులైన దులు, కాలువలు, చెరువులు వంటి వెండిపోయే స్థితికి చేరుకున్నాయి. మంచినీటి బోర్లు నీరు ఇవ్వలేకపోతున్నాయి. భూగర్భజలాలు అడుక్కి వెళ్ళిపోతున్నాయి. మిగిలిన ఈ వేసవిలో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని ఇటు ప్రజలు, అటు అధికారులు కూడా కలవరపడుతున్నారు. శ్రీకాకుళంలో గరిష్ట ఉష్టోగ్రత 41 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్టోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌గా ఉండి భానుడు భగభగ మండిపోతున్నాడు. రాజాంలో గరిష్ట ఉష్టోగ్రత 39 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్టోగ్రత 27 డిగ్రీలగా నమోదైంది. టెక్కలిలో గరిష్ట ఉష్టోగ్రత 37 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్టోగ్రత 25 డిగ్రీలుగా ఉండి ఆకాశం నిర్మలంగా ఉంది. ఆమదాలవలసలో గరిష్ట ఉష్టోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్టోగ్రత 26 డిగ్రీలగా నమోదైంది. పాలకొండలో గరిష్ట ఉష్టోగ్రత 38 డిగ్రీలు, కనిష్ట ఉష్టోగ్రత 26 డిగ్రీలుగా ఉండి ఆకాశం నిర్మలంగా ఉంది.