శ్రీకాకుళం

ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షిస్తేనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొందూరు, సెప్టెంబర్ 11: ప్రతీ ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించి వాటిని పరిరక్షిస్తే భవిష్యత్‌లో ఉపాధ్యాయ వృద్ధికి మనుగడ ఉంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆదివారం ఇక్కడ సీతారామ కళ్యాణ మండపం వద్ద నిర్వహించిన ఉపాధ్యాయులు బొడ్డేపల్లి జనార్థనరావు పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తిలో నైపుణ్యం పెంచి విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఆయన సూచించారు. పెరుగుతున్న పని ఒత్తిడిలు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్‌మెంట్ వరకు సర్వీస్ చేయడం ఎంతో అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగికి రిటైర్‌మెంట్‌తోపాటు షష్ఠిపూర్తి ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం 60 ఏళ్లకు పదవీ విరమణ కార్యక్రమం ఏర్పాటు చేసిందని రవి అన్నారు. కొన్ని సమస్యలు చర్చలతో తప్ప ఉద్యమాలతో పరిష్కారం కావని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర మాజీ మంత్రి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఎంతో గౌరవం ఉందని ఆతని పనితీరే మరింత స్థాయికి తీసుకువస్తాయని అన్నారు. ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు గొంటి గిరిధర్, ఎస్ టి యు ప్రభాకర్, బొడ్డేపల్లి మోహనరావు, వి.్భస్కరరావు, బలివాడ మల్లేశ్వరరావు, జెడ్పిటీసీ బొడ్డేపల్లి సరోజనమ్మ, రిటైర్డ్ డీ ఎస్పీ భాస్కరరావు, బిజేపి నాయకుడు పాతిన గడ్డెయ్య తదితరులు పాల్గొన్నారు.