శ్రీకాకుళం

సోలార్‌తో విద్యుత్ ఆదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 22: సోలార్ వాడకం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయొచ్చని నెడ్‌క్యాప్ జనరల్ మేనేజర్ ఎం.వి.కె.రాజు తెలిపారు. గురువారం ఈ మేరకు స్థానిక ఎపి ఇపిడిసిఎల్ సూపరింటెండెంట్ ఇంజనీరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో సోలార్ వ్యవసాయ పంపుసెట్ల వాడకం బాగానే ఉన్నప్పటికీ, గృహావసరాలకు సోలార్ వాడకం ఉత్తరాంధ్రలోనే జిల్లా వెనుకబడి ఉందన్నారు. సోలార్ నెట్ మీటరు సిస్టమ్‌లో భాగంగా గృహావసరాలకు వినియోగించే సోలార్ పరికరాలపై సబ్సిడీ ఉందన్నారు. అయితే, ఒక కిలోవాట్‌కు తక్కువ కాకుండా ఒక మెగావాట్ వరకు మాత్రమే సోలార్ వాడకంనకు వీలుంటుందని చెప్పారు. ఒక్కో కిలోవాట్‌కు సరిపడా పరికరాలపై కేంద్ర ప్రభుత్వం 30 శాతం, రాష్ట్రప్రభుత్వం 20 శాతం రాయితీ భరిస్తోందన్నారు. అవసరమైతే మిగిలిన సొమ్మును సైతం బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. ఇందులో సోలార్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారని, దీంతో ఆ విద్యుత్ డిసి నుంచి ఎసిగా మారుపోతుందన్నారు. దీనికి బై డైరెక్షనల్ మీటర్లు అమర్చుతామని, దీంతో సోలార్ ద్వారా వినియోగించే విద్యుత్‌పోను మిగిలిన విద్యుత్ యూనిట్లకు మాత్రమే చార్జి వసూలు చేయనున్నట్టు తెలిపారు. సోలార్ పరికరాలకు 20 ఏళ్ళ వారంటీ ఉంటుందన్నారు. ఒకవేళ సోలార్ విద్యుత్ ఆదా అయితే ఆ విద్యుత్‌కు శాఖాద్వారా యూనిట్‌కు 5.30 రూ.లు చెల్లిస్తారన్నారు. అలాగే గృహావసరాలకు కాకుండా సొసైటీ రిజిస్ట్రేషన్ ఉన్న సంస్థలకు కేంద్ర ప్రభుత్వం 30 శాతం రాయితీ మాత్రమే ఉంటుందన్నారు. వాణిజ్య అవసరాలకు వినియోగించే వారికి ఎటువంటి రాయితీ ఉండదన్నారు. అన్ని నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుంటే 20 రోజుల్లో సోలార్ విద్యుత్ అమర్చుతామని తెలిపారు. సమావేశంలో ఇపిడిసిఎల్ ఎస్‌ఈ డి.సత్యన్నారాయణ, నెడ్‌క్యాప్ సిబ్బంది జి.శంకరరావు, ఆర్.జయవాణి తదితరులు పాల్గొన్నారు.