శ్రీకాకుళం

పారిశుద్ధ్యం మెరుగుపరచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 26: పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని ఇవోఆర్డీ నిశ్చల ఆదేశించారు. పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా మండలంలోని పెద్దపాడు, వాకలవలస పంచాయతీ గ్రామాల్లో కాలువల్లో ఉన్న పూడికను తొలగిస్తున్నారు. ఈ పనులను సోమవారం ఈవోఆర్డీ నిశ్చల పెద్దపాడు గ్రామాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎక్కడైతే పూడిక పేరుకుపోయుందో ఆయా వీధులకు ప్రాధాన్యం ఇచ్చి పూడికను తొలగించాలని కోరారు. పూడికను వదిలేయకుండా డంపింగ్‌యార్డుకు తరలించాలని సూచించారు. మంచినీటి కేంద్రాల వద్ద క్లోనిరేషన్ చేయించి బోర్లు పరిసరాల వద్ద బ్లీచింగ్ చల్లించాలని సూచించారు. ప్రస్తుతం వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని అందుకు పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండి మంచినీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. బోర్లు వద్ద బట్టలు ఉతకరాదని సూచించారు. పరిసరాల పరిశుభ్రత పాటించినట్టయితే ప్రతీ ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండేందుకు దోహదపతుందున్నారు. ప్రతీ కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించాలని సూచించారు. మాజీ సర్పంచ్ కలగ శివకుమార్, పంచాయతీ కార్యదర్శి సింహాద్రి, వాకలవలస సర్పంచ్ రామారావు పాల్గొన్నారు.