శ్రీకాకుళం

పర్యావరణానికి నానో టెక్నాలజీ దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, ఆక్టోబర్ 7: పర్యావరణానికి నానో టెక్నాలజీ ఎంతో దోహదపడుతుందని, శక్తి ఆరోగ్యం వంటి అంశాల్లో బాసటగా నిలుస్తుందని ఎఆర్‌సిఐ(హైదరాబాద్) అసోసియేట్ డైరెక్టర్ తాతా నర్సింగరావు, శాస్తవ్రేత్త డాక్టర్ బివి.శారదలు స్పష్టం చేశారు.
చిలకపాలేం కూడలిలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో మెకానికల్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో మూడు రోజుల నుంచి నానో టెక్నాలజీ తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యక్రమాలపై జాతీయస్థాయి వర్క్‌షాపు గురువారంతో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో నర్సింగరావు, శారదలు మాట్లాడుతూ నానో మెటీరియల్స్‌ను విద్యుత్ ఉత్పాదన కొరకు బ్యాటరీలో నిల్వ చేయడానికి, విద్యుత్ వాహనాల్లో వినియోగానికి పలు విధాలుగా వినియోగిస్తారన్నారు.
ఆహారం, వైద్య పరికరాలు, రసాయనిక ద్రవాలు, పరిశుద్ధి చేసే పరికరాలు, కంప్యూటర్ ఆటలు, స్థిరమైన సినిమా స్క్రీన్‌లు తయారిలో నానో టెక్నాలజీ ఇదివరకే బలమైన ముద్రవేసిందని తెలిపారు. నానో కార్బన్, డైమండ్ పొరల అనువర్తనాలు వైద్య రంగంలో వ్యాధులను గుర్తించే జీవ సంవేదకంలు తయారీకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో వ్యర్థ ఉష్ణాన్ని తొలగించేందుకు ఎలా సహకరిస్తుందో వివరించారు. అనంతరం విద్యార్థులకు, అధ్యాపకులకు ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యవక్తలను ప్రిన్సిపాల్ బి.మురళీకృష్ణ, కన్వీనర్ ప్రేమ్‌కుమార్, మేనేజ్‌మెంట్ సభ్యుడు దుర్గాప్రసాద్ రాజు, డి.వెంకటరావులు సత్కరించారు.