శ్రీకాకుళం

‘స్మార్ట్’ కథ కంచికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: శివారు పల్లెలకు వైఫే, రోడ్లు, మంచినీరు, పాలవిద్యుత్ కాంతులు, ప్రతీ ఇంటికీ ఇంటర్నెట్ ఇలా.. మొత్తంగా స్మార్ట్ విలేజ్. ఇదే రెండేళ్ళ కిందట ముఖ్యమంత్రి మదిలో కదలాడే కథ. ఇంతలో స్మార్ట్ విలేజ్.. నినాదం హుదూద్ తుపాను బలపరిచింది. తుపాను దెబ్బకు అతలాకుతలమైన పల్లెసీమలను ‘స్మార్ట్ విలేజ్‌లు’గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో చేపట్టిన పర్యటనల్లో భరోసా ఇచ్చారు. ప్రతి సమావేశం, సభల్లో గ్రామాలను దత్తత తీసుకుని స్మార్ట్ విలేజ్‌లుగా మార్చేయాలంటూ ఇచ్చిన అద్భుతమైన ప్రసంగాలకు.. రెండేళ్ళు నిండిపోయాయి! దీపావళి పండుగ రోజున శ్రీకాకుళం అసెంబ్లీ సిగ్మెంట్‌లో కుందువానిపేట గ్రామం సముద్రతీరంలో ఒక స్మార్ట్‌విలేజ్‌గా మర్చేస్తామంటూ హామీ ఇచ్చి తిరిగి ఆ పనులపై నేటికీ సమీక్షగాని, పురోగతిగాని చేపట్టలేదు. ఆ గ్రామాన్ని సర్కార్ దత్తత తీసుకుని స్మార్ట్ విలేజ్‌గా మార్చేస్తుందని, నవ్యాంధ్రప్రదేశ్‌కు మోడల్‌గా చూపిస్తామన్న ప్రజాప్రతినిధులు, అధికారుల కథలన్నీ కలలుగా మిగిలిపోతున్నాయి. సిక్కోల్ ప్రజల్లో నిస్సాయం-నిరీక్షణ మిగిల్చిన హుదూద్ పుణ్యమా అంటూ శ్రీకాకుళం రూరల్‌మండలంలో కుందువానిపేట స్మార్ట్‌విలేజ్‌గా మారిపోతుందని, నవ్యాంధ్రప్రదేశ్‌కే మోడల్‌గా నిలుస్తుందంటూ జిల్లా యంత్రాంగం నుంచి ఎమ్మెల్యే, మంత్రి, ఎంపి, చివరికి సిఎం అంతా చెప్పిన కథలన్నీ నీటిమీద రాతలయ్యాయని జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు. ‘స్మార్ట్’ పనులు పడకేసి ఏడాది గడిచిపోయింది. హుదూద్... ఈ పేరు వింటే చాలు శ్రీకాకుళం జిల్లా వాసులకు గుండెల్లోరైల్లు పరుగెడుతాయి! రెండేళ్ళు కిందట హుదూద్ రూపంలో ప్రకృతి కరాళానృత్యంతో బీభత్సం నేటికీ సిక్కోల్ కళ్ళల్లో కదలాడుతోంది. భారీ వర్షాలు, ఈదురుగాలులతో కకావికలం చేసిన చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ మరువలేకపోతున్నారు. ప్రకృతి చేసిన గాయం నుంచి కోలుకోలేక కొంతమంది ప్రభుత్వం సహాయం అందక మరి కొంతమంది ఇంకా హుదూద్ బాధితులుగానే మిగిలిపోయారు. అక్టోబర్ 12, 2014 శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసింది తుపాను. యుద్ధప్రాతిపదికపై ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం హూదూద్ మిగిల్చిన నష్టాన్ని పూరించేందుకు పనులు ప్రారంభించి రెండేళ్ళు గడిచిపోయింది. ఇంకా ఆ పనులు, అప్పటి బాధిత కుటుంబాలకు సాయం అందనివారు సర్కార్ ఆదుకోదా అంటూ నిరీక్షిస్తున్నారు. 2013లో జిల్లాను ఫైలిన్ తుపాను నుంచి తేరుకోకముందే హుదూద్ రూపంలో జిల్లాకు మరో దెబ్బతగిలింది. దీనివల్ల జిల్లాలో 11 తీరప్రాంత మండలాలతోపాటు మైదాన, మన్యం ప్రాంతాలు కూడా ఛిన్నాభిన్నమయ్యాయి. నాసా హెచ్చరికలతో ముందు జాగ్రత్తలు చేపట్టిన ముఖ్యమంత్రి ప్రాణనష్టం జరగకుండా చూశారు. కానీ, ఆస్తినష్టం నివారించలేకపోయారు. గంటకు 240 కిలోమీటర్లు పైచిలుకవేగంతో వీచిన ఈదురుగాలులకు దశాబ్దాల కాలం నాటి మహావృక్షాలు సైతం కూకటివేళ్ళుతో నేలకొరిగాయి. గాలులతోపాటు 24 గంటలు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలు లక్షలాది హెక్టార్ల పంటపొలాలను నీటముంచేసింది. రవాణా, సమాచార, విద్యుత్ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. భారీ నష్టం కలిగింది. ప్రకృతి కనె్నర్ర చేస్తే మానవపరిస్థితి ఇదే అన్నట్టు నాటి హదూద్ జ్ఞాపకాలు మదిలో నిలిచిపోయాయి. రెండేళ్ళు గడిచిపోయినా అప్పటి చేదు జ్ఞాపకాలు ఇంకా కొన్ని కుటుంబాలను వీధినపడేసేవుంచాయి. ఆర్థిక, సామాజిక ధైర్యం ఇవ్వని సమాజం, సర్కార్‌తో అనునిత్యం ఆ కుటుంబాలు పోట్లాడుతునే వున్నాయి. లక్షలాది కుటుంబాలు చతికిలపడి ఇంకా తేరుకోలేదు. ప్రభుత్వ సాయం కూడా ఇప్పటికీ అందని అర్హులు ఉన్నారు.
నాగావళి, వంశధార నదులకి వరద పొటేత్తడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తుపాను తీవ్రతకు ఆస్తులతో పాటు వరి, చెరకు, అరటి తదితర అన్ని రకాల సాధారణ, వాణిజ్య పంటలు కూడా తుడిచిపెట్టుకుపోవడంతో రైతాంగం వెన్నువిరిగింది. వీరిలో కొంతమందికే సర్కార్ సాయం అందగా, మిగిలిన వారంతా ఇంకా నిరీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ తుపాను తర్వాత రెండుసార్లు ప్రత్యేకంగా హుదూద్ తుపాను బాధితులకు భరోసా కల్పించి, ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తాత్కలికంగా వరద సాయం అందించి, పంట నష్టాలను అంచనా వేసి పరిహారం చెల్లిస్తామన్నారు. అదే సమయంలో మత్స్యకార గ్రామాల్లో పర్యటించిన బాబు మరో అడుగు ముందుకేసి తీరప్రాంతాల్లో నిరాశయిలైన వారికి కుందువానిపేటలో పక్కా గృహాలు నిర్మాస్తామని హామీ ఇచ్చారు. సరిగ్గా ఏడాది కాలంలో తుపాన్లు అసూయపడేలా మత్స్యకారులకి రక్షణ కల్పించే గృహాలను నిర్మించి అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, పూర్తి స్థాయిలో గ్రామాల్లో రోడ్డులు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామని, తుపాను నుంచి రక్షణ కల్పించేలా భూగర్భ విద్యుత్ లైన్లు సౌకర్యం కల్పిస్తామని, ఒక్కమాటలో చెప్పాలంటే ఆ మత్స్యకార గ్రామాన్ని ఎవ్వరూ పోల్చుకోని విధంగా స్మార్ట్ విలేజ్‌గా మార్చేస్తానంటూ ఏడాదిలోగా తానే వచ్చి ప్రారంభిస్తానంటూ బహిరంగ సభల్లో చెప్పారు. అయితే, సి.ఎం. హామీలకు రెండేళ్ళు పూరైంది. హుదూద్ ఇళ్ళ నిర్మాణం ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. పంటనష్టాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందంటూ అప్పటిలో సిఎం చేసిన వాగ్దానంలో కాకిలెక్కలతో జిల్లా యంత్రాంగం కాలంగర్భంలో హుదూద్ పరిహారం మూటలను కలిపేసిందంటూ రైతాంగం ఇప్పటికీ ఆరోపిస్తునేవుంది.
ఆధార్, రేషన్ కార్డు అంటూ ఇచ్చిన నష్టపరిహారాన్ని కూడా ఇవ్వకుండా బ్యాంకులచుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారుల నష్టపరిహారం విషయంలో కూడా ప్రభుత్వం మోసం చేసిందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను సమయంలో నష్టపోయిన ఇంటికి పదివేల రూ.లు చొప్పున్న పరిహారం ఇస్తామని చెప్పి లెక్కలు తీసుకున్న అధికారులు ఇప్పటికీ పరిహారం తీసుకుని రాలేదని విమర్శిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ హుదూద్ తుపాను జయించామంటూ ప్రతీ సభ, సమావేశాల్లో చెప్పేంతగా సిక్కోల్ ప్రజలకు సర్కార్ సాయం అందలేదన్న చేదునిజం రెండేళ్ళు నిండిన హుదూద్ జ్ఞాపకాల్లో గుర్తుకొస్తున్నాయ్! అంటూ రైతాంగం, మత్స్యకారులు, అన్నీ వర్గాల ప్రజలు పేర్కొంటున్నారు.

దీపావళి ధమాకా!

శ్రీకాకుళం, అక్టోబర్ 13: మహిళా సంఘాల కల ఫలించింది. ఎన్నో నెలలుగా నిరీక్షిస్తున్న డ్వాక్రా సంఘాల మహిళలకు బాబుసర్కార్ దీపావళి కానుక అందించేలా ఆర్థిక చేకూర్పు నిధులు విడుదల చేసేందుకు ఉత్తుర్వులు జారీ చేసింది. ఎన్నికల వేల నాటి ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డ్వాక్రా సంఘాలు తీసుకున్న బ్యాంకు రుణాలు రద్దుచేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికలోటు వంటి కారణాల రీత్యా ప్రతీ డ్వాక్రా సంఘ సభ్యురాలికి రూ.10వేల మొత్తాన్ని సంబంధిత బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని సిఎం అనేక సందర్భాల్లో స్పష్టంచేశారు. ఈ మాటకి కట్టుబడి చంద్రబాబు మొదటి విడత రూ.3వేల వంతున ఆర్థిక చేకూర్పు పథకంలో భాగంగా ఆయా ఖాతాలకు జమచేశారు. రెండో విడత రూ.3వేల మొత్తాన్ని జమ చేసేందుకు కొంత జాప్యం జరగడంతో మహిళా సంఘాలు ఒకింత ఆందోళనకు గురయ్యాయి. బ్యాంకుల వద్ద పరపతి కోల్పోతే వడ్డీ లేని రుణాలు అందిపుచ్చుకోలేమన్న భయం వారిని కంటిమీద కునుకులేకుండా చేసింది. సుమారు 13 నెలలుగా ఈ పరిస్థితి నెలకొంది. అనేక వేదికల్లో డ్వాక్రా సంఘాల ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద నిధులు విడుదల విషయమై ఏకరువు పెట్టుకున్నప్పటికీ రాష్ట్ర ఖజానా అనుకూలించని కారణంగా ప్రభుత్వం వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఎట్టకేలకు గురువారం ముఖ్యమంత్రి రాష్ట్రంలోని 821,91,147 సంఘాలకు ఆర్థిక చేకూర్పు పథకంలో రూ.2,700 కోట్లను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తుర్వులు కూడా విడుదల చేసి నవంబర్ 1నుండి సంబంధిత ఖాతాల్లో ఈ మొత్తం జమఅయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న మహిళాసంఘాలు హర్షాతిరేఖాలు వ్యక్తం చేశాయి. ఆర్థిక చేకూర్పు జిల్లాలోని 43,470 సంఘాలకు రూ.147కోట్లు రెండో విడతగా జమ కావాల్సి ఉంది. మొదటి విడత 2015 జూన్‌లో రూ.3వేల వంతున ప్రభుత్వం జమచేసిన విషయాన్ని సంఘ సభ్యులు గుర్తు చేస్తున్నారు. ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా మహిళా సంఘాలు సానుభూతి పొందేందుకు ఈ నిధులు విడుదల ఎంతో ఊతంగా నిలుస్తోందని చెబుతున్నారు. నిన్నటి వరకు మహిళా సంఘాలపై వడ్డీ భారాలను బాబు సర్కార్ రుద్దిందంటూ విపక్షాలు విమర్శలు సాగించడం, పచ్చచొక్కాలు దీనికి స్పష్టమైన సమాధానం చెప్పలేక దిక్కులు చూడాల్సి వచ్చింది. నేడు ఆర్థిక చేకూర్పు పథకం కింద నిధులు విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి విపక్షాల నోటికి తాళాలు వేసేలా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఇటు పార్టీ శ్రేణులు, అటు మహిళా సంఘాలు స్వాగతిస్తున్నాయి. ఇదిలా ఉండగా బ్యాంకుల నుంచి రుణాలు పొందిన 44327 సంఘాలకు వడ్డీ రూపేన జమ చేయాల్సిన రూ.29.65కోట్లు మొత్తం కూడా సత్వరంగా విడుదల చేయాలని డ్వాక్రా సంఘాల సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సిక్కోల్‌లో 81 శాతం సర్వే

శ్రీకాకుళం, అక్టోబర్ 13: ప్రజాసాధికార సర్వే వేగవంతంగా పూర్తి చేయాలని సిసిఎల్‌ఎ అనిల్‌చంద్ర పునేఠా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహంను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ ప్రజాసాధికార సర్వే వివరాలు మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో హౌస్‌హోల్డు సర్వే 90 శాతం జరిగిందని, పట్టణ ప్రాంతంలో 75 శాతం జరిగిందని తెలిపారు. మొత్తంగా 81 శాతం సగటున సర్వే పూర్తి చేసినట్టు వివరించారు. ఈ మేరకు పునేఠా మాట్లాడుతూ ఇంకా వేగవంతం చేసి పూర్తిచేయాలని డిసిసి సమావేశాల్లో కౌలు రైతులకు రుణాలు మంజూరు విషయం వ్యవసాయాధికారులకు తగు ఆదేశాలను జారీ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సిసిఎల్‌ఎ పునేఠా మాట్లాడుతూ రెవెన్యూ వసూళ్ళు, ప్రజాసాధికార సర్వే, ఫైల్స్ డిస్ఫోజల్, వెబ్‌లాండ్, ప్రభుత్వ భూములు ఆక్రమణలు, క్రమబద్ధీకరణ, తదితర అంశాలపై జిల్లాలు వారీగా సమీక్షించారు. జనాభా ప్రాతిపదికన చూస్తే జిల్లాలు ప్రజాసాధికార సర్వేలో వెనుకబడి ఉన్నాయన్నారు. తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే నిర్వహించి సర్కార్ భూములను వెబ్‌లాండ్‌లో ఆఫ్‌లోడు చేయాలని చెప్పారు. రైతులందరికీ ఇ-పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని ఈ కార్యక్రమం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్లు ప్రకారం రెవెన్యూ రికార్డులు అప్‌డేషన్ చేయాలని సూచించారు. జి.వో.నెం.118 ప్రకారం ప్రభుత్వ భూములు ఆక్రమణలను క్రమబద్ధం చేయాలని ఆదేశించారు. హైకోర్టు ఉత్తర్వులు అనుసరించి ప్రభుత్వ భూములకు సంబంధించిన కేసులు పరిష్కరించాలని చెప్పారు. సర్వేను నిర్వహించి గ్రామాలు వారీగా డిజిటల్ సైన్ చేయాలన్నారు. ముందుగా జాయింట్ కలెక్టర్లు, సర్వే లాండ్ అండ్ రికార్డ్సు అసిస్టెంట్ డైరెక్టర్లు, సంబంధిత తహశీల్దార్లతో కలిసి రేండమ్‌గా చెక్‌చేయాలని చెప్పారు. దేవాదాయశాఖ కమిషనర్ మాట్లాడుతూ కొన్ని జిల్లాల్లో దేవాదాయశాఖ భూములకు తహశీల్దార్లు పట్టాలు ఇచ్చారని తెలిపారు. రెవెన్యూ రికార్డులు, దేవాదాయశాఖ రికార్డులను పరిశీలిస్తే రాష్ట్రంలో లక్ష ఎకరాలు వరకూ తేడా ఉందని చెప్పారు. దీనిని వంటనే పరిష్కరించి రికార్డులు సరిచేసుకోవల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర సర్వే అండ్ లాండ్ రికార్డ్సు స్పెషల్ కమిషనర్, దేవాదాయశాఖ కమిషనర్, జాయింట్ కలెక్టర్-2 రజనీకాంతారావు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

భీరుబాటిల్‌తో
దాడి
పొటోగ్రాఫర్ మృతి
రాజాం, అక్టోబర్ 13: రాజాం నగర పంచాయతీ మల్లికార్జున కాలనీకి చెందిన ఆశపు రమేష్ (38) అనే ఫోటోగ్రాఫర్‌పై బీరుబాటిల్‌తో దాడి జరపడంతో బుధవారం రాత్రి మృతి చెందాడు. మద్యం మత్తులో ఈ ఘర్షణ జరిగినట్టు కొంతమంది చెబుతున్నప్పటికీ దాడికి పాల్పడిన వారు ఎవరనేది తెలియడం లేదు. గ్రామ దేవత పండుగ సందర్భంగా చీపురుపల్లి రోడ్డు ప్రాంతంలోని స్నేహితులతో మద్యం సేవిస్తుండగా పరస్పరం గొడవ పడినట్టు కొంతమంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొండకవీధికి చెందిన ఇద్దరు స్నేహితులు బీరుబాటిల్‌తో దాడి చేసి ఉండవచ్చునని బంధువులు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. పగిలిన బీరు సీసాతో మెడపక్కనున్న నరం తెగడంతో తీవ్రంగా రక్తస్రావం కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యుల సలహా మేరకు కేర్ ఆసుపత్రికి అత్యవసర చికిత్స కోసం తరలించినప్పటికీ రక్తస్రావం ఆగకపోవడంతో రమేష్ మృతి చెందాడు. రమేష్‌కు భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు ఆడపిల్లలున్నారు. మృతుని కుటుంబ సభ్యులంతా ఫోటోగ్రాఫర్లుగా రాజాం ప్రాంతంలో స్టూడియోలు నిర్వహిస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే రాజాం సిఐ శంకరరావు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు నిర్వహించారు. పాలకొండ డిఎస్‌పి ఆదినారాయణ కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించారు.

నర్సింగ్‌లో శిక్షణకు కౌనె్సలింగ్
బలగ, అక్టోబర్ 13: ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేటు జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ మూడేళ్ళ కోర్సులో శిక్షణ పొందేందుకు కౌన్సిలింగ్‌ను ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్నట్టు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ఎస్.తిరుపతిరావు తెలిపారు. గత నెల 29వ తేదీ ఆన్‌లైన్‌లో ఆప్లై చేసిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్ట్ఫికేట్లతో కౌన్సిలింగ్ తేదీ ఉదయం 9.30 గంటలకు హాజరు కావాలని కోరారు.

ముఖ్యమంత్రి హామీల అమలుకు కృషి
శ్రీకాకుళం, అక్టోబర్ 13: ముఖ్యమంత్రి జిల్లాలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు జిల్లా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం జిల్లా అధికారుల సమావేశం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యానవన కళాశాల, నగర పరిధిలో భూగర్భడ్రైనేజ్, రింగ్ రోడ్డు నిర్మాణం పనులు, నరసన్నపేటలో ఉన్న 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చడం, అదే విధంగా 55 మరబోట్లను మత్స్యకార కుటుంబాలకు పంపిణీ చేసిన వివరాలను, గృహ నిర్మాణ సంస్థ ద్వారా చేపట్టిన ఇళ్ల నిర్మాణం తదితర అంశాలను సమీక్షించారు. వీటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా రిమ్స్ ఆసుపత్రి, బిసి కార్పొరేషన్ వ్యవసాయ శాఖ, విద్యుత్, రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్ శాఖల్లో చేపట్టినపనుల గూర్చి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి జిల్లాలో ఇప్పటివరకు 50 హామీలను ప్రజలకు ఇచ్చారని వాటిలో పది పూర్తి చేసినట్టు తెలిపారు. 15 పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. 23 పనులు ఇంకనూ పెండింగ్‌లో ఉన్నాయని వాటిని కూడా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు.
వీటిని అమలు చేయుటలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో జెసి-2 పి.రజనీకాంతారావు, ముఖ్య ప్రణాళికాధికారి ఎం.శివరామ్‌నాయకర్, రోడ్లు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీరు రామచంద్రా, జిల్లా ఫారెస్ట్ అధికారి లోహితాస్యుడు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పట్ట్భద్రులను ఓటర్లుగా చేర్పించండి
ఎచ్చెర్ల, అక్టోబర్ 13: ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లోని డిగ్రీ పూర్తి చేసిన అర్హులందరినీ ఓటర్లుగా చేర్పించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం పిలుపునిచ్చారు. గురువారం మండల పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2013 ఏళ్ళలోపు డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ ఓటర్లుగా నమోదు కావచ్చునన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ఈప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఆన్‌లైన్‌లో ఓటర్ నమోదు చేసుకోవచ్చునని అలాగే తహశీల్దార్, ఎంపిడివోకార్యాలయాలకు కూడా ఫారం -18లను అందజేసేలా అవగాహన కల్పించాలన్నారు.
జిల్లాలో 4లక్షల మంది గ్రాడ్యూట్స్ ఉన్నప్పటికీ గడిచిన ఎన్నికల సమాయానికి 30వేల మంది ఓటర్లు మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. నిబంధనల ప్రకారం అర్హులందరూ గ్రాడ్యూట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేలా పార్టీ శ్రేణులు ప్రధాన భూమిక పోషించాలన్నారు.
ఈ సమావేశానికి మండల శాఖ అధ్యక్షుడు మారుపల్లి రాజు అధ్యక్షత వహించగా పార్టీ నాయకుడు సంపతిరావు నాగేశ్వరరావు, శ్రీకాకుళం నగర అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వరరావు, తమ్మినేని గోవిందరావు, కె.చంద్రరావు, సంపతిరావు వెంకటరమణ, పైడి పాపారావు తదితరులు పాల్గొన్నారు.