సంజీవని

మీకు మీరే డాక్టర్ ....... పిల్లలకూ, పెద్దలకూ కాడ్ లివర్ ఆయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర:కాడ్ లివర్ ఆయిల్ పిల్లలకు ఇవ్వటం మంచిదేనా? పెద్దలక్కూడా పనిచేస్తుందా? వివరంగా చెప్పగలరు?
-ప్రసాదరావు పంగులూరు, నెప్పల్లి
జ: కాడ్ అనే ఒక రకం చేప లివర్‌లోంచి తీసిన సారంతో తయారైన తైలం ఇది. గొప్ప ఔషధ ప్రయోజనాలు ఈ తైలానికున్నాయి. ఒమేగా 3 అనే కొవ్వు ఆమ్లాలతోపాటు, 100 గ్రాముల కాడ్లివర్ ఆయిల్లో ఎ విటమిన్ 100,000 ఐయు, డి విటమిన్ 10,000 ఐయు, సాట్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ 22.608 గ్రా, మోనోసాచ్యురేటెట్ ఫ్యాటీ ఆసిడ్స్ 46.711, పోలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ 22.541 గ్రా. ఉన్నాయి. ఇది పిల్లలకు, పెద్దలకూ ఇద్దరికీ వాడదగిన ఔషధమే!
విటమిన్ డి ఎక్కువగా ఉన్న ద్రవ్యం కావటంచేత దీనికి మెదడు కణాల సమస్యలమీద, మానసిక సమస్యలమీద ఔషధ ప్రయోజనాలు ఉన్నట్టు నరాల వైద్య పరిశోధకులు చెబుతున్నారు. 1824లో రికెట్స్ అనే ఎముకల వ్యాధి మీద దీని ప్రయోజనం ఉన్నదని గమనించారు. 1930లో విటమిన్ డి లోపాన్ని సరి చేయటానికీ ఈ ఆయిల్‌ని పిల్లలందరికీ తప్పనిసరిగా ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. కాడ్‌లివర్ క్యాప్యూల్స్ వాడే పిల్లలకు తెలివితేటలు పెరుగుతాయి. శరీర దారుఢ్యం పెరుగుతుంది. వృద్ధాప్యంలో సహజంగా ఏర్పడే నరాల సమస్యలు, మానసిక సమస్యలు, ఎముకల సమస్యలు, గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలమీద కాడ్ లివర్ ఆయిల్ ఒక నివారకంగా పనిచేస్తోంది కాబట్టి వృద్ధాప్యంలో దీన్ని అందరూ వాడుకోవటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
రక్తంలో కొవ్వును గడ్డకట్టకుండా చేసే కొన్ని కొవ్వు ఆమ్లాలు ఉండటమే కాడ్ లివర్ ఆయిల్‌కు ఆ ప్రశస్తి రావటానికి కారణం. కరొనరీ ఆథిరోస్క్లీరోసిస్ అనే ఈ పరిస్థితిని రోజూ కాడ్ లివర్ ఆయిల్‌ని వైద్యులు చెప్పిన మోతాదులో తీసుకుంటే బ్లాకులు క్లియర్ అవుతున్నాయని కనుగొన్నారు.
1878లో మాంచెష్టర్‌కు చెందిన డా.దర్మే అనే పరిశోధకుడు మొదటగా కాడ్ చేపల లివర్‌లోంచి తీసిన నూనెని కీళ్ళవాతంలో వాచిన భాగంమీద పూసి మంచి ఫలితాన్ని గమనించాడు. కీళ్ళవాతం వ్యాధిలో కీళ్ళు వాచి బిగుసుకుపోతాయి. ఈ ఆయిల్‌ని బాగా మర్దన చేస్తే కండరాలు మెత్తబడి, సడలి, కీళ్ళు కదలటం మొదలౌతుంది. అలాగే రక్తనాళాల్లో చెడ్డ కొవ్వు పేరుకోవటాన్ని కూడా ఇది నిరోధిస్తుందని పరిశోధకులు గమనించారు. 1 గ్రా. కాడ్‌లివర్ ఆయిల్‌ని 3 నెలలపాటు ప్రతిరోజూ కడుపులోకి తీసుకుంటే కీళ్ళవాతంలో మార్పులు వచ్చినట్టు జర్మనీలో జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి. కీళ్ళలోపల దెబ్బతిన్న మృదువైన ఎముక పదార్థాలు, ఎముకలపైన పొరలను కూడా కాడ్ లివర్ ఆయిల్ని రోజూ తీసుకుంటే అది రిపేర్ చేస్తోందని వివిధ పరిశోధకులు గమనించారు. నొప్పి, వాపులకు కారణమయ్యే కొన్ని ఎంజైముల్ని ఈ ఆయిల్ తగ్గిస్తోందని తేల్చారు.
కాడ్ లివర్ ఆయిల్‌ని వాడుతూ ఉంటే దంత సమస్యలు, జుత్తు రాలిపోవటం, చర్మం గరుకుబారటం లాంటి సమస్యలు కూడా తగ్గుతాయని కనుగొన్నారు. గాయాలమీద ఈ ఆయిల్ని పూస్తే త్వరగా మానుపడుతున్నట్టు గమనించారు. కాడ్ లివర్ ఆయిల్ కలిసిన ఆయింట్‌మెంట్లు కూడా ఉన్నాయి. 25 శాతం కాడ్ లివర్ వున్న ఆయింట్‌మెంట్లు గాయాన్ని మాన్పటానికి బాగా తోడ్పడతాయని చెబుతున్నారు. అత్యంత తాజా పరిశోధనలో ఒక గుణాత్మక అంశం వెల్లడైంది. టీబీ జబ్బులో కూడా కాడ్ లివర్ ఆయిల్ గొప్ప నిరాక ఔషధంగా పనిచేస్తోందని, ఇది వ్యాధి పెరుగుదలను అరికట్టి స్థిరీకరిస్తోందని తేలింది. పేగుల్లో వచ్చే టీబీ జబ్బులో కూడా దీని ప్రభావం ఉన్నదని కనుగొన్నారు.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642,

డా జి.వి.పూర్ణచందు