వరంగల్

శంభో.. శివశంభో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోమేశ్వరునికి ఘనంగా మహాన్నపూజ
పాలకుర్తి, మార్చి 10: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం శంభో శివశంభో... నామస్మరణతో ఉత్సవమూర్తులను శాలివాహనులు అగ్నిగుండాలను దాటించగా, క్షీరగిరి క్షేత్రంపై స్వయంభువుగా వెలిసిన సోమేశ్వరునికి ఘనంగా మహాన్నపూజ నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలు ముగిసినట్లయ్యాయి. తెల్లవారుజామున 4గంటలకు ముత్యాల పల్లకిలో శివపార్వతులు, లక్ష్మీనర్సింహస్వామి దంపతులను వేదపండితులు మంత్రోచ్ఛారణలతో శాలివాహనులు హరహర మహాదేవ.. శంభో శంకరా... అంటూ అగ్నిగుండాలను దాటించారు. స్వామివారి వెనకాల వేలాది మంది భక్తులు అగ్నిగుండాలు దాటి భగవంతుని మంచి జరిగేలా దీవించాలని వేడుకున్నారు. సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నిర్వహించే అగ్నిగుండాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అగ్నిగుండాలు దాటిన భక్తులు పాపపుణ్యాలను శివకేశవులు స్వీకరించి మేలు కలుగచేస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో స్వామివారి పల్లకి వెనకాలే భక్తులు అగ్నిగుండాలు దాటడం ఆనవాయితీగా వస్తుంది. అనంతరం మధ్యాహ్నం 12గంటలకు స్వయంభువుగా వెలిసిన సోమేశ్వరునికి మహాన్నపూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు మహాన్నపూజలో శివుని చూసి తరించిపోయారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వేద పండితులు హోమం నిర్వహించి చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఇవో డి. సదానందం, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.