శ్రీకాకుళం

అధిక ఉష్ణోగ్రతలపట్ల అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 11: జిల్లాలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల పట్ల ప్రజలు అప్రమత్తతతో ఉండాలని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఎండవేడిమిపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో భాగంగా ఆయన ముందుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల పట్ల సమీక్షించారు. ఎండ తీవ్రత ఉన్న సమయంలో ప్రజలు బయటకు వెల్లకూడదని ఆయన సూచించారు. వడదెబ్బ తగలకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. అవసరం మేరకు మంచినీటిని తాగాలని తెలిపారు. డీ హైడ్రేషన్‌కు గురికాకుండా తగు మోతాదులో ద్రవపదార్థాలు తీసుకోవాలన్నారు. వడదెబ్బకు గురై మృతిచెందుతున్న వారి వివరాలు తహశీల్దార్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నుండి నివేదిక రప్పించాలని జిల్లా రెవెన్యూ అధికారిని ఆయన ఆదేశించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ వివేక్ యాదవ్, జెసి-2 పి.రజనీకాంతారావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఆర్.కూర్మనాథ్ తదితరులు పాల్గొన్నారు.

నీతివంతమైన పాలన ప్రభుత్వ ధ్యేయం
* ఎమ్మెల్యే రమణమూర్తి
నరసన్నపేట, ఏప్రిల్ 11: రాష్ట్రం విభజన తర్వాత మొట్టమొదటి సారిగా అధికారంలోనికి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో ఒడుదుడుకులకు లోనైందని దానిని అధిగమిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేయనున్నట్టు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. నీతివంతమైన పాలన అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రతిపక్ష నాయకులు ఎన్ని విమర్శలు చేసినా వాటిని తిప్పి కొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రానున్నకాలంలో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని 2019లో జరిగే ఎన్నికల్లో కూడా తమ పార్టీ విజయం సాధిస్తామన్న ధీమాను ఆయన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిదులు, దేశం కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉపాధి కూలీలకు అదనంగా రూ. 95 వేలు చెల్లింపు
సారవకోట, ఏప్రిల్ 11: మండల కేంద్రంలోని గజపతిసాగరం చెరువులో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు వేతనదారులకు రూ.95అదనంగా చెల్లించారని సామాజిక తనిఖీలలో వెల్లడయినట్టు తనిఖీ బృందం నాయకుడు ఎస్‌ఆర్ పి.వెంకటరమణ ప్రకటించారు. స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలో సోమవారం జరిగిన గ్రామ సభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పనులు చేయకపోయినా, చేసిన పనులకు అధనంగా కొలతలు వేసి ఈ పైకాన్ని చెల్లింపులకు పాల్పడ్డారని ఆయన స్పష్టంచేశారు. ఈ విషయాన్ని జిల్లా నీటి యాజమాన్యసంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ దృష్టికి తెస్తామని మంగళవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో జరగనున్న పబ్లిక్ హీరింగ్ వేదికపై చర్చిస్తామని వివరించారు. స్థానిక సర్పంచ్ డోకి భానుమతి అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఎస్‌ఆర్ పి.వెంకటరమణ మాట్లాడుతూ 2015 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు కొలతలువేయలేదని ఆ గోతులలో నీరుచేరి ఉన్నందున తదుపరి సామాజిక తనిఖీలలో ఈవిషయాలను పరిశీలిస్తామని తెలిపారు. పలువురు వేతనదారులు తమకు పారలు, గునపాలు అందజేయాలని కోరినట్టు ఆయన స్పష్టంచేశారు.