శ్రీకాకుళం

ఆదివాసీలకు సముచిత స్థానం: పీవో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతంపేట, జూలై 25: సీతంపేట కేంద్రంలో వచ్చే నెల 9వ తేదీన నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఆదివాసీలకు సముచిత స్థానం కల్పించనున్నట్టు ఐటిడిఎ పిఒ జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. స్థానిక పిఎం ఆర్‌సి కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం గిరిజన ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ గతంలో తన ఆధ్వర్యంలో గిరిజన ఉత్సవాలను అందరి సహకారంతో విజయవంతం చేశామన్నారు. అలాగే ఆగస్టు 9వ తేదీన సీతంపేటలో నిర్వహించనున్న ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలన్నారు. ప్రభుత్వపరంగా ఈ కార్యక్రమం జరుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు కొందరు కొన్ని సమస్యలను పిఒ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన స్పందిస్తూ శ్రీకాకుళం కేంద్రంలో గిరిజన భవనం నిర్మాణం కోసం స్థలం పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఆదివాసీల సాంప్రదాయాల పరిరక్షణకు బాధ్యత వహిస్తోందన్నారు. సవర భాషకు ఐటిడిఎలో పరిధిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమీక్షలో జిల్లా కో-ఆప్షన్ సభ్యులు తోటముఖలింగం డిప్యూటి డిఇఒ మల్లయ్య, తదితర అధికారులు పాల్గొన్నారు.
ఉపాధి వేతనాలు చెల్లించండి
* బిజెపి నేతలు వినతి
ఎచ్చెర్ల, జూలై 25: తీర గ్రామాలైన బడివానిపేట, మూసవానిపేట, జాలారికొయ్యాం, గిన్నివానిపేట గ్రామాల్లోని గత నెలలో రెండువారాలు ఉపాధి పనులు నిర్వహించారని ఆ వేతనాలను కూలీలకు చెల్లించాలని భారతీయ జనతాపార్టీ మండల పార్టీ అధ్యక్షుడు మారుపెల్లి రాజు, జిల్లా నాయకులు సంపతిరావు నాగేశ్వరరావులు వినతిపత్రం అందించారు. స్థానిక ఎంపిడివో కార్యాలయంలో ఈవో ఆర్డి పి.మోహన్‌కుమార్ సోమవారం గ్రీవెన్స్ నిర్వహించగా వీరు తీర గ్రామాల్లో పరిస్థితులను వివరించారు. గత ఏడాది 30 రోజులు ఈ ఏడాది 40 రోజులు మాత్రమే ఉపాధి కల్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరు చెరువులు ఉన్నప్పటికీ రెండుచెరువుల్లో మాత్రమే ఉపాధి పనులు నిర్వహించి మిగిలిన చెరువుల్లో ఎటువంటి పనులు చేపట్టలేదన్నారు. ఇప్పటికైనా పనులు ప్రారంభించి మత్స్యకారులకు ఉపాధి కల్పించాలని కోరారు.