శ్రీకాకుళం

కాంగ్రెస్‌తోనే సాధ్యం రాహుల్‌తో హామీ ఇప్పిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, అక్టోబర్ 22: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందని ఏపి పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి స్పష్టంచేశారు. శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రజాబ్యాలెట్‌లో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేసిన ఆయన తొలుత ఇందిరా విజ్ఞాన్ భవన్ నుండి సూర్యమహాల్ కూడలి నుండి ఏడురోడ్ల జంక్షన్ వరకు ర్యాలీలో పాల్గొని అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీని తప్పక ప్రజలు ఆదరిస్తారని రాష్ట్రంలో , దేశంలోనూ అధికారంలోనికి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వడం ఖాయమన్నారు. ఇదే విషయాన్ని యువనేత రాహుల్‌గాంధీని ఈ ప్రాంతానికి రప్పించి ప్రజలకు హామీ ఇప్పిస్తామని ఆయన వెల్లడించారు. ప్రజాబ్యాలెట్ ఓ ఉద్యమంగా రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి పోరాటం సాగిస్తుందన్నారు. బుల్లెట్‌లకు ఎదురొడ్డి హోదా సాధించే వరకు పోరాడి తీరుతామని స్పష్టంచేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు పందికొక్కుల్లా ఇసుక దందా చేస్తూ ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. అవినీతి రాష్ట్రంలో మరింత పెరిగిపోయిందని ఇటువంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీలు అమలయ్యేవరకు ప్రజల్లో ఉండి ఉద్యమిస్తామన్నారు. హామీలు అమలుచేయాలని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం పోలీసుల మాటున పాలన సాగిస్తుందనడానికి సమావేశాలు, సభలు నిషేదిస్తూ యాక్టు 30 ను ప్రయోగించడం ఇందుకు తార్కాణమన్నారు. ఎంపి కెవిపి రామచంద్రారావు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పెద్దపీట వేసిందని గుర్తుచేశారు. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ మూడు అంశాలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీపై చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. నోటుకు ఓటు కేసు, ఎమ్మెల్యేలను సంతలో పశువులుగా కొనుగోలు చేయడం, పోలవరం ప్రాజెక్టులో కమీషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద తెలుగువారి ఆత్మగౌరవాన్ని బాబు తాకట్టు పెట్టడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జిల్లా అభివృద్ధి జరిగిందని నాగావళిపై వంతెనలు, 80 అడుగుల రోడ్డు, రిమ్స్, యూనివర్శిటీ, వంశదార వంటి ప్రాజెక్టులు మంజూరయ్యాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పరిశీలకులు ద్రోణంరాజు శ్రీనివాస్, మాజీ మంత్రులు కనుమూరి బాపిరాజు, కోండ్రు మురళీమోహన్, మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి, డాక్టర్ కిల్లి రామ్మోహనరావు, ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, జిల్లా పార్టీ అధ్యక్షులు డోల జగన్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి చౌదరి సతీస్, రత్నాల నర్శింహమూర్తి, సనపల అన్నాజీరావు, పుట్ట అంజనీకుమార్, డిఎస్‌కె ప్రసాద్, దేశెల్ల మల్లిబాబు, కొంక్యాన మురళీదర్ , పైడి రవి తదితరులు ఉన్నారు. గత రెండు రోజులుగా నగరంలో ప్రత్యేక హోదా అవసరమా వద్దా అన్న అంశంపై నిర్వహించిన ప్రజాబ్యాలెట్ కార్యక్రమంలో 17680మంది పాల్గొనగా 17656 మంది ప్రత్యేక హోదా అవసరమని కేవలం 24మంది వద్దని ఓటు వేసిన విషయాన్ని నాయకులు వెల్లడించారు. టిడిపి పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీలు అమలు జరుగుతున్నాయా లేదా అనే అంశంపై 16119మంది ప్రజాబ్యాలెట్‌లో పాల్గొనగా కేవలం 101మంది మాత్రమే అమలౌతున్నట్లు అంగీకరించడం విశేషం.