శ్రీకాకుళం

ప్రాచీన దేవుళ్ళపై సర్వే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, మార్చి 17: వందేళ్ళకుపైన చరిత్ర గల దేవాలయాల వివరాలను తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలంటూ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలందాయి.!రాష్టవ్య్రాప్తంగా నిర్వహించే ఈ సర్వేలో భాగంగా జిల్లాలో అతి పురాతనమైన దేవాలయాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే శ్రీకాకుళం జిల్లాలో చారిత్రక దేవాలయాల చాలానే ఉన్నాయి. రాజుల కాలం తర్వాత ఆలనాపాలనా లేని ప్రాచీన దేవాలయాలు దేవాదాయశాఖ పరిధిలో కొన్ని ఉంటే, మరికొన్ని శిథిలాలుగా మారిపోయాయి. ఇందులో గుళ్ళ సీతారాంపురం దేవాలయంతోపాటు మెళియాపుట్టి వేణుగోపాలస్వామి ఆలయం, మందస వాసుదేవ ఆలయం, బారువ జనార్దస్వామి దేవాలయం, జి.సిగడం రంగనాథస్వామి దేవాలయం వంటివి ఉన్నాయి. ఇటువంటి ప్రాచీన దేవాలయాల వివరాలతో జిల్లా దేవాదాయశాఖ నివేదికలు సిద్ధం చేస్తోంది. గత మూడు రోజులుగా నాలుగు బృందాలు ఈ సర్వేలో పాల్గొంటున్నాయి. ఇటీవల కాలంలో రెండు లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న దేవాలయాల నిర్వహణ బాధ్యత అర్చకులకే అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసిన దేవాదాయశాఖ, తాజాగా పురాతన దేవాలయాల వివరాలు, వాటి చరిత్ర కూడా సేకరించే పనిలో పడింది. దీంతోప్రాచీన దేవాలయాలు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపకల్పన చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. పర్లాకిమిడి రాజులు నిర్మించిన మెళియాపుట్టి వేణుగోపాలస్వామి ఆలయం ఎంతో చరిత్ర ఉన్నప్పటికీ పూర్తిగా దేవాదాయశాఖ ఆధీనంలోకి రాకపోవడంతో ఆలయాభివృద్ధికి నోచుకోలేదన్న వాదనవున్నప్పటికీ, ఆ ఆలయం చరిత్ర, వివరాలు మాత్రం దేవాదాయశాఖ ప్రత్యేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిస్తున్నట్టు అధికారికంగా తెలిసింది.
జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో సుమారు 800 పైగా దేవాలయాలున్నాయి. వాటికి 11 వేల ఎరకాలకుపైగా భూములున్నాయి.కొన్ని దేవాలయాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోవడంతో దైవదర్శనానికి వచ్చే భక్తులే ఆలయాల పునఃనిర్మాణాల బాధ్యత తీసుకోవడం గమనార్హం. అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానంలో వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో క్యూ కాంప్లెక్స్, కాటేజీల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అప్పటి శిలాఫలకం దిష్టబొమ్మగా మిగిలిందే తప్ప ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు కాలేదు. దీంతో గార మండలంలోని ట్రైమాక్స్ కంపెనీ యాజమాన్యం ముందుకు వచ్చి సుమారు 20 లక్షల రూపాయలతో నిత్యాన్నధాన పథకం కోసం అధునాతన సౌకర్యాలతో భవన నిర్మాణం చేసారు. అదేవిధంగా విశాఖపట్నంకు చెందిన మరోక భక్తుడు ప్రత్యేక టిక్కెట్టు కౌంటర్ల నిర్మాణానికి ముందుకు వచ్చారు. ఆదిత్యునికి వందల తులాల బంగార ఆభరణాలు సైతం రాష్టమ్రంతటా పలువురు భక్తులు చేయించి సూర్యదేవునికి ఇచ్చారు.దేవాదాయశాఖ నుండి నిధులు రావాలంటే ఎన్నో అవాంతరాలు దాటాల్సిరావడంతో దాతల సహకారంతో అరసవల్లి ఆలయం అభివృద్ధిపై అధికారులు, అర్చకులు దృష్టిసారించారు. ఆ దిశగానే ఆదిత్యుని ఆలయాభివృద్ధి ఎక్కువ శాతం కొనసాగుతోంది. అచీ ప్రాచీన శ్రీకూర్మాం దేవాలయం కూడా అనుకుంతమేర అభివృద్ధికి నోచుకోలేదు. దేవాదాయశాఖ నిధులు నిండుకుండడంతో ఆ దిశగా పనులు జరగలేదు. కానీ, కృష్ణంవందే జగద్గురుం సంస్థ ఆధ్వర్యంలో ఆలయ రూపురేఖలు మారి అభివృద్ధివైపు అడుగులుపడ్డాయని చెప్పాలి. ప్రవేశద్వారాన్ని వెడల్పుచేయడం, పూర్తిస్థాయిలో లైటింగ్ ఏర్పాటు, పుష్కరిణీ చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, తాబేళ్ళ పార్కు వంటి నిర్మాణాలు జరిగాయి. అన్నింటికంటే ముఖ్యంగా దాతల నుంచి సుమారు 40 లక్షల రూపాయల శాశ్వత నిధి ఏర్పాటు చేసి దూప, దీప నైవేద్యాలకు లోటులేకుండా చర్యలు తీసుకోవడం విశేషం. మందసలో వాసుదేవుడు ఆలయాన్ని చిన్నజీయర్‌స్వామి దత్తత తీసుకోవడంతో ఇటీవల కాలంలో బ్రహ్మోత్సవాలు, ఇతర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించగలిగారు. ఇదిలా ఉండగా, శ్రీకాకుళం పట్టణంలో ఫాజుల్‌బేగ్‌పేటలో గల నారాయణ తిరుమలగిరపై వేంచేసి ఉన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయాభివృద్ధికి దాతలు, భక్తుల సహకారంతోనే అధిక శాతం పనులు పూర్తికావడం విశేషం. ఆలయంలో బేడామండపం, రాజగోపురం నిర్మాణానికి ముఖ్యమంత్రి సిపిఎఫ్ గ్రాంటు ద్వారా 25 లక్షల రూపాయలు మంజూరు చేయగా, ఇంకా ఆ మొత్తంలో నుంచి ఏడు లక్షల రూపాయలు విడుదల కాలేదు. కానీ, సుమారు ఏడు కోట్ల రూపాయలతో ఆలయాభివృద్ధి పనులు భక్తులు, దాతలే పూర్తిచేసారు. ఈ మొత్తంలో సింహభాగం ఎన్‌ఆర్‌ఐలుగా స్థిరపడిన సిక్కోల్‌వాసులదే! చిన్నబజార్‌లోగల దూదివారి వేంకటేశ్వరస్వామి ఆలయంలో సుమారు అరకోటితో అభివృద్ధి పనులు జరిగాయి. ఈ పనులకు కూడా చిల్లిగవ్వ దేవాదాయశాఖ నుంచి నిధులు మంజూరు కాలేదు. దాతలే ఈ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యులయ్యారు. అలాగే, పాలకొండరోడ్డులో పురాతన రామాలయం శ్రీ కోదండరామస్వామి దేవస్థానం రాజగోపురం రోడ్డు విస్తరణ పనుల్లో కుప్పకూలిపోతే ఒక్క రూపాయి కూడా దేవాదాయశాఖ నుంచి నిధులు విడుదల కాలేదు. దాతలే ముందుకువచ్చి రాజగోపురం, ఇతర నిర్మాణాలకు అరకోటి వరకూ ఖర్చు పెట్టారు. గుజరాతీపేటలో ఉమాలక్షేశ్వరస్వామి దేవస్థానం, జగన్నాథస్వామి ఆలయం, కొన్నావీధి భీమేశ్వర ఆలయాలు కూడా వందల ఏళ్ళ చరిత్ర నాటివే. వీటిపై కూడా ప్రభుత్వం శీతకనే్న వేసింది. దేవాదాయశాఖ నిధులు మంజూరుకాకపోవడంతో శిథిలవస్థకు చేరుకున్నాయి. ఏదిఏమైనప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ప్రాచీన ఆలయాలపై సర్వే నిర్వహించనుండడంతో ఎన్నో పురాతన ఆలయాలకు ఆలవలంగా నిలుస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని చరిత్రకెక్కిన దేవాలయాలు అభివృద్ధికి నోచుకుంటాయన్న ఆశలు అర్చకులు, భక్తుల్లో వ్యక్తం అవుతోంది!