శ్రీకాకుళం

పవన్ తీరుతో ఉద్దానానికి చెడ్డపేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్ఛాపురం, ఆగస్టు 10 : ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ప్రబలిపోయిందంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన ప్రచారంతో ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా చెడ్డపేరు వస్తోందని ఎమ్మెల్యే బి.అశోక్ అన్నారు. ఎమ్మెల్యే అశోక్ జన్మదినం సందర్భంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన ఒంటరి మహిళలు, మత్స్యకారుల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కపాసుకుద్దిలో గంగపూజ కోసం అరగంట సేపు ఎండలో ఉన్నందుకు ఆరు గంటలసేపు హోటల్‌లో విశ్రాంతి తీసుకున్న పవన్‌కల్యాణ్ జనం కోసం ఏం కష్టపడతారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు 67 ఏళ్ల వయసులోనూ రోజుకు 18 గంటలు కష్టపడుతున్నారని చెప్పారు. అంగన్‌వాడీలు, ఆర్‌పీల జీతాలను పెంచారన్నారు. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, వికలాంగులతోపాటు ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. 162 మందికి పింఛన్లు, చంద్రన్న బీమా మంజూరు పత్రాలు, పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 350 మంది నుంచి మెప్మా సిబ్బంది సేకరించిన అవయవదాన పత్రాలను స్వీకరించారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పీఎఫ్ బకాయి 9.43 లక్షల చెక్కును అందజేశారు. పలు సంఘాలు, వర్గాల ప్రతినిధులు ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు. తొలుత కౌన్సిలర్ టి.శ్రీనివాససాహు ఏర్పాటు చేసిన 36 కిలోల భారీ కేక్‌ను అశోక్ కట్ చేశారు. మున్సిపల్ కమిషనర్ పి.రవిబాబు, ఎంపీపీ ఢిల్లీరావు, కౌన్సిలర్లు, నేతలు పాల్గొన్నారు. కాగా వైసీపీ పట్టణాధ్యక్షుడు కాళ్ల దేవరాజు తనవర్గంతో వచ్చి ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు చెప్పటం కొసమెరుపుగా నిలిచింది.

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
పలాస, ఆగస్టు 10: సహకార సంఘాలు ద్వారా అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని పలాస పి ఎసి ఎస్ అధ్యక్షుడు దువ్వాడ శ్రీ్ధర్ అన్నారు. శుక్రవారం పలాస సహకార సంఘంలో కద్దాల నాగేశ్వరరావుకు 2 లక్షల రూపాయలు, కొఠారి తాళభద్రకు చెందిన యశోదకు 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణాలను అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసిసిబి బ్యాంకులు రైతుల బలోపేతానికి నిత్యం ముందు ఉంటుందని, జాతీయబ్యాంకులకు ధీటుగా కేంద్ర సహకార బ్యాంకు అన్ని రకాల రుణాలను అందజేస్తూ ప్రజల మన్ననలు పొందుతుందన్నారు. వ్యవసాయ రుణాలను తీసుకున్నరైతులంతా వ్యవసాయరంగంలో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. రైతుల అభ్యున్నతి కోసం పలాస సహకార సంఘం పార్టీలకు అతీతంగా రుణాలు అందిస్తూ రైతుల అభివృద్దికి కృషి చేస్తుందన్నారు. అర్హత ఉన్న రైతులకు రుణాలు అందించి వారి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్, సీ ఇవో శ్రీనివాసరావు, విజయ్‌కుమార్, ఎస్.గోపి, హేమచలం, శంకర్, మనుయాదవ్, తాళాసు ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిల్లరనాణేలు వినియోగించండి
పలాస, ఆగస్టు 10: క్రయవిక్రయాల సందర్భాల్లో చిల్లరనాణేలకు ప్రాధాన్యత ఇచ్చి వినియోగించాలని పలాస మున్సిపల్ కమిషనర్ రమేష్‌నాయుడు అన్నారు. శుక్రవారం స్టేట్‌బ్యాంకు అధికారులు కాశీబుగ్గ బస్టాండ్ వద్ద సుమారు 50 వేల రూపాయల 1,2,5 చిల్లరనాణేలు మార్పిడి చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో బజారులో చిల్లరకొరత ఏర్పడి, విక్రయదారులు, కొనుగోళ్లుదారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని, వాటి పరిష్కారానికి బ్యాంకు అధికారులు మార్కెట్‌లోకి చిల్లరనాణేలను విడుదల చేయడం అభినందనీయమన్నారు. ఎవరికైనా నాణేలు కావాలంటే బ్యాంకు అధికారులను సంప్రదించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో పలాస స్టేట్‌బ్యాంకు చీఫ్ మేనేజరు సాంబమూర్తి, క్యాషియర్ రామేశ్వరరావు, ఫీల్డ్ ఆఫీసర్ రమేష్, మేనేజరు మోహన్ తదితరులు పాల్గొన్నారు.