సబ్ ఫీచర్

ప్రణతోస్మి ప్రభాకరమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సప్తాశ్వరథా మారుడం ప్రచండం కశ్యపాత్మజం!
శే్వత పద్మధరం దేవం తం సూర్యాయ ప్రజామామ్యహం
రథసప్తమి మాఘ శుద్ధ సప్తమి మకర రాశిలో ప్రయాణిస్తూ సప్తాశ్వరథా సమారుడై ఈశాన్య దిశగా వెళుతుంటాడు. ఈ రోజునుంచే పగటికాలమెక్కువై, పనిచేసే కాలమెక్కువై కర్తవ్యం, కర్మణ్యత గుర్తుకురావడం మొదలవుతుంది. ప్రకృతిలో చలి తగ్గి వెచ్చదనం పెరిగి జనం యొక్క విధి విధానం పెరగడం మొదలవుతుంది.
‘యదాదిత్య గతం తేజః’ అని సూర్యునిలో ఉన్న తేజస్సే మనకు ప్రత్యక్షమయ్యే పరంజ్యోతి. మనకు ప్రాణదాత, ప్రత్యక్ష దైవస్వరూపుడు. ‘నమస్కారం -అర్ఘ్యం’ ఈ రెండూ సూర్యుడికి సమర్పించి, ఆ భగవానుని అనుగ్రహాన్ని పొందే విధంగా మనం ఆరాధించాలి.
సూర్య నమస్కారం ఎందుకు? అన్న ప్రశ్నలు మనసులో ఉదయస్తాయ. మనకు దీనికి సమాధానాలను పురాణాలు, వేదాలు ఇస్తునే ఉన్నాయ. సూర్య నమస్కారాలు చేసేవారికి ఆరోగ్యమహాభాగ్యం లభిస్తుంది. ఐశ్వర్య ప్రాప్తి కూడా లభిస్తుంది.
ప్రాచీన భారత ఋషులు యోగాసన, ప్రాణాయామ, మంత్రముద్రల సహితంగా రూపొందించిన ఒక అద్భుత యోగ ప్రక్రియ సూర్య నమస్కారం. సూర్యోదయ వేళలలో సూర్యునికి అభిముఖంగా నుంచుని ఈ ఆసనాలు బీజాక్షర సంపుటితో కూడిన మంత్రాన్ని జపిస్తూ చేయాలి. సూర్యోదయపు వెచ్చటి కిరణాలలో ‘డి’ విటమిన్ ఉండటంవల్ల శరీరానికి చాలా మంచిది. అంతేగాక సూర్యోదయ వేళలో గాలిలో ప్రాణవాయువు అధికంగా వుండడంతో ఆరోగ్యానికి చాలా మంచిది.
పూర్వం గ్రామాలలో సామాన్యులు, రైతులు, వివిధ వృత్తులు చేసుకొనేవారు ఉదయానే్న ముఖం కడుక్కొని వెంటనే తూర్పు వేపు తిరిగి సూర్యభగవానునికి నమస్కారం చేసికొని, తర్వాత తమ తమ పనులను ప్రారంభించుకొనేవారు.
సూర్య నమస్కారాలలో పదిరకాల యోగాసనాలు ఒకదాని తరువాత ఒకటి వరుసక్రమంలో నిర్ణీత ఉచ్ఛ్వాస నిశ్వాసలతో చేయాలి. మన శారీరక శక్తి యొక్క ఉత్పత్తి, స్థితి మరియు వృద్ధి సూర్యునిపై ఆధారపడి ఉంటాయి. నియమితంగా 13 సూర్య నమస్కారాలు చేయడంవల్ల శరీరంలోని అన్ని అవయవాలకు, వ్యవస్థలకు ప్రాణశక్తి భాగం వుంది. వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా జీవించగలడు. వీటిని అభ్యాసం చేయడంవల్ల దేహంలోని నాడులు చైతన్యం అవుతాయి. రక్తప్రసరణ క్రమబద్ధంగా జరుగుతుంది. మానసిక ఏకాగ్రత పెరుగుతుంది. వీటిని చేయడంతోపాటు 13 సూర్య మంత్రాలను ఒక మారు ఉచ్ఛరించాలి.
సూర్య నమస్కారాలతో ఊపిరి తీసికొని బయటకు వదిలే విషయాలలో విశేషాన్ని తెలుసుకొని జాగ్రత్తగా చేయాలి. శ్వాసలో రెండు సెకండ్ల వరకు ప్రతి స్థితిలోనూ చేయాలి. శ్వాసను లోనికి పీల్చడం (పూరకం) బయటకు వదలడం (రేచకం) నెమ్మదిగా, లోతుగా చేయాలి. ఊపిరిని ఆపడాన్ని కుంభకం అంటారు. ఇది 5వ, 10 స్థితిలలో ఉంటుంది. సూర్య నమస్కారాల సాధన తరువాత శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.
సూర్యనమస్కారాలు సూర్యోదయంలోనే చేస్తే బాగుంటుంది. ఖాళీ కడుపుతో చేయాలి. భోజనం తర్వాత నాలుగు గంటలు, అల్పాహారం తర్వాత రెండు గంటలు, పానీయాలు సేవించాక ఒక గంట వ్యవధిని పాటించాలి. ఉదయం, సాయంత్రం సంధ్యా సమయాలలో కాలకృత్యాలు తీర్చుకొని చేయడం మంచిది. సూర్య నమస్కారాలు ఆరుబయట స్వచ్ఛమైన గాలి వచ్చే ప్రదేశంలో చేస్తే మంచిది.
అభ్యాసానికి కొన్ని సూచనలు
సూర్య నమస్కారాలు చేస్తున్నపుడు ప్రతి స్థితిలోనూ శరీరంలోని వివిధ కండరాలు, నరాలు, శ్వాస, కీళ్ళలో వస్తున్న మార్పులను గమనిస్తూ చేయాలి. పూర్తి ఫలితాలు పొందాలంటే ఓంకారం, సూర్యనామంతో కూడిన మంత్రోచ్ఛారణ అవసరం. సూర్య నమస్కారానికి ముందుగానీ, తర్వాతగానీ స్నానానికి అరగంట వ్యవధి ఉండాలి. మహిళలు ఋతు సమయంలో, 3 నెలల గర్భిణీలు చేయరాదు.
ప్రార్థన:
ఇది సూర్య నమస్కారాలు ప్రారంభించే ముందు చేయాలి
శ్లో ద్వేయం సదా పవిత్ర మండలం మధ్యవర్తీ
నారయణ సరణి జాసన సన్నివిష్ణుః
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి
హరీ హిరణ్మయి వపుర్థృత శంఖ చక్రః
భావం:సూర్యమండలం మధ్య శ్రీమన్నారాయణుడు పంకజాసనుడై విరాజిల్లుతున్నాడు. పంకజనేత్రుడు, కేయూర మకర కుండల కిరీటాదులను ధరించి దివ్యహారాలతో శోభిల్లుతూ, బంగారు కాంతితో దివ్య విగ్రహ శోభను ఇనుమడించే చక్రములను దాల్చినవాడు. నేను అతనిని నిరంతరం ధ్యానిస్తున్నాను.

-వేదుల జనార్దనరావు 9502469464