సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సచ్చిదానందమయుడు ఈ కోశము (నా శరీరము)నుండి వెలువడుచుండుట నాకు గోచరించినది. అతడిట్లు పలికెను: ‘యుగయుగము నేనవతరింతును.’ నాకు అపస్మారము కలిగినదనుకొంటిని. అందుచే నేనూరకుంటిని. అపుడాతడే (సచ్చిదానందమయుడే) యిట్లు పలుకగా వింటిని: ‘చైతన్యుడు కూడ శక్తినారాధించెను.’ (అనగా నీవు శక్తి నారాధించుచున్న కారణమున భగవదవతారము కాననుకొనకుమని భగవానుడు శ్రీగురుదేవునకు దెల్పెనని భావము.)
1017. వ్యాధిగ్రస్థుడై యున్నప్పుడు శ్రీగురుదేవుడొక నాడు శిష్యులతో నిట్లు పలికెను. ‘‘ఇచట, (అనగా తనయందు) ఇద్దఱు వ్యక్తులున్నారు. ఒక వ్యక్తి జగజ్జనని- రెండవ వ్యక్తి యామె భక్తుడు. జబ్బుపడినది ఈ రెండవ వ్యక్తియే... తన శిష్యులతో భగవానుడు అవతార రూపమున వచ్చుచుండును. ఆతడు మానవ రూపమును దాల్చును. ఆతనితో నాతని శిష్యులును మఱల లోకేశ్వరి సన్నిధికి బోవుదురు. అకస్మాత్తుగా నలుగురైదుగురు వీధి గాయకులు ఇంటిలోనికి వత్తురు. వచ్చి వారు భగవన్నామ సంకీర్తనము చేయుచు, ఆనందముతో నృత్యము చేయుదురు. అది యైనంతనే ఆ యింటిని విడిచిపోవుదురు. రాక యెంత ఆకస్మికమో పోకయునంత యాకస్మికమే! వారెవరో (వారి వృత్తాంతమేమో) లోకులకు దెలియనే తెలియదు!’’
1018. బలిపీఠము, బలియగు జంతువు, దానిని నఱకువాడు- మూడును ఒకే తత్త్వమని తెలిసికొంటిని.
1019. అంత్యదశలో వ్యాధి తీవ్రమైనపుడు శ్రీగురుదేవుడు నరేంద్రు(వివేకానందు)నిట్లు ప్రశ్నించెను: ‘‘సరియేకాని నాయనా! నా భావములెట్టివని నీ అభిప్రాయము?’’
నరేంద్రుడు: చెప్పెడిదేమి! దేవా! తామే సర్వము! వివేక ఖడ్గముచే, లోకాతీత బలముచే, సంసారారణ్యమును ఛేదించుకొని బ్రహ్మమును బొందిన వీరాధివీరులు తాము! సఖ్యభావమును సైతము- ఆలోకైకరమణుని జేరు దివ్యప్రేమ పారవశ్యమును- అనిర్వచనీయ ప్రేమ మాధుర్యమును- తాము పొందితిరి. భగవత్పరితాపమున సఖ్యభావమననేల, సమస్త్భావమును కరతలామలక మొనర్చుకొనిన భాగవత వీరులు తాము!
గురుదేవుని హృదయమున దివ్యభావములన్నియు నొక్కుమ్మడి నుబికి పారవశ్యమును గల్గించెను. తన హృదయముపై జేయువైచుకొని, నరేంద్రుని, ఇతర శిష్యులను సంబోధించుచు నాతడిట్లుపలికెను: ‘‘సర్వము-్భవింపదగిన సమస్తము- ఇందుండియే వెలువడుచున్నదని నాకు గోచరించుచున్నది- ప్రత్యక్షముగా గాన్పించుచున్నది.’’
1020. తాను భగవదవతారమూర్తినని గురుదేవుడనేక పర్యాయములు వక్కాణించియుండెను: ఇవ్విషయమై సందేహము కలుగనరేంద్రుడు తనలో దానిట్లనుకొనెను: ‘‘ఈ ఘోర శరీర యాతన నొందుచున్న రుూ సమయమున- ఈ మరణ యాతనా సమయమున-

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి

- ఇంకా ఉంది