సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈతడు తాను భగవదవతారమూర్తినని తెలుపగలిగినచో నేను నమ్మెదను.’’ అతి విచిత్రము! ఈ భావము నరేంద్రునకు దోచినంతనే శ్రీ గురుదేవుడు తన యావచ్ఛక్తిని వినియోగించి విస్పష్టముగా నిట్లుపల్కెను: ‘‘నాయనా! నీకింకను సందియము తీఱలేదా? వినుము, ఎవ్వడు రాముడో, ఎవ్వడు కృష్ణుడో, ఆతడే రుూ శరీరమున రామకృష్ణుడు- కాని నీ వేదాంత ప్రకారము కాదు సుమీ.’’
సూక్తులు
నైతిక సూక్తులు
1021. చాకలియింట (ఉదుకుటకై తెచ్చిన) బట్టలనేకములుండును, కాని యవి వానివి కావు. ఉదుకగానే వానియిల్లు ఖాళీ యగును. స్వతంత్ర భావము లేనివారు ఈ చాకలి వంటివారు. నీ భావముల పట్ల చాకలి వాడవు గాకుము.
1022. ఒరులేమి చేయవలయునని కోరుదువో దానిని స్వయముగా నీవును జేయుము.
1023. యాచనచే మానవుడు అల్పుడగును. బలిచక్రవర్తిని యాచింపబోయినప్పుడు విష్ణుదేవునంతటివాడు వామనుడు కావలసివచ్చెను. ఎవ్వనిగాని నీవేదేని యాచింపబోయినంతనే హీనుడవగుచున్నావు (అని భగవానుడు తన నిదర్శనముచే మనకు బోధించుచున్నాడు.)
1024. లోకులెంత సులభముగా స్తోత్రము చేయుదురో అంత సులభముగా నిందనుజేయుదురు; కాబట్టి నిన్నుగూర్చి వారు చేయు నిందాస్తుతులను లక్షింపకుము.
1025. శాంతి సుగుణములకు ఆలవాలమైన జీవనము గడపుచు లోకుల నిందాస్తుతులను గణింపకుము.
1026. కొందఱవిషయమున మనము జాగరూకులమై వర్తింపవలయును. 1) ధనికులు: వారికి ధనబలము, మనుష్యబలము నుండుటయేకాక, విశేషమైన పలుకుబడియునుండును. తలచుకొనిన యెడల వారు నీకు అపకారము చేయగలరు. నీవు వారితో బహుజాగరూకతతో మెలగవలయును; వారు చెప్పిన దానికెల్ల బహుశః తల నూపవలసి వచ్చును. 2) కుక్క: అది నిన్నుజూచి మొఱిగినను మీద బడి కఱవబోయినను నీవాగి రుూలవేసి దానిని శాంతింపజేయవలయును. 3) ఆబోతు: అది నిన్ను పొడవ వచ్చిన యెడల కొన్ని శబ్దములతో దానిని శాంతింపజేయవలయును. 4) త్రాగినవాడు: నీవు వానిని రేపితివా, నిన్ను అడ్డమైన బూతులు తిట్టును. కాని, ‘‘మామా! ఖులాసాగా ఉన్నావా?’’ అనుచు వానిని బుజ్జగించిన యెడల, వాడు చాల ఆనందించుచు, వచ్చి నీతోగూడ చుట్టకాల్చును.
1027. ముల్లంగి గడ్డలను దినిన వానికి ముల్లంగి వాసన గల త్రేనుపులే వచ్చును: దోసకాయ మెసవిన వానికి దోసకాయ వాసనగల త్రేనుపులే వచ్చును: అటులనే అంతరంగమందలి భావముల పస మాటలే యొక్కొక్కప్పుడు వెల్లడించుచుండను. (తిండి యెట్టిదో త్రేన్పట్టిది, భోజన మెట్టిదో మానసమట్టిది.)
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి