సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1028. ‘ఏ గూటి చిలుక కాగూటిపలు’కనునట్లు ఎట్టివారితో సహవాసము చేయుదుమో అట్టిగుణములే మనకబ్బును. మఱియు మన గుణములననుసరించియే సహవాసమును ఎన్నుకొనుచుందుము.
1029. కొందఱు త్రాచుబాము నైజముకలవారై యుందురు. వారు ఎప్పుడు కాటువేయునదియు నీకు దెలియదు. విఱుగుడు కనుగొని వారి విషయమును నీవు తొలగించుకొనుటకై చాల శ్రమపడవలసి యుందువు. లేదా, వారిపై బగపట్టుకనంతటి క్రోధావేశమున కగ్గమగుదువు.
1030. క్రోధము తమోగుణ లక్షణము. క్రోధపరవశుడగువాడు వివేకమును గోల్పోవును. హనుమంతుడు లంకకు నిప్పంటించెనుగాని సీతయున్న యశోక వనమునుగూడ అయ్యది తగులబెట్టునేమోయని యూహించునంతటి వివేకము వానికి లేకపోయెను.
1031. ‘వందలు, వేలు గురువులు దొరకుదురు కాని శిష్యులు దొరకుట దుర్లభము’అను సామెత మీరు ఎఱుగుదురుకదా? అనగా శ్రీరంగనీతులు చెప్పువారు అనేకులున్నను వానిని ఆచరించువారు అరుదని భావము.
1032. మత ధర్మములు క్షీణించుటకు కారణమేమి? వాన నీరు నిర్మలమైనదే యైనను భూమిపై బడుసరికి సంపర్కదోషముచే మలినమగును. మిద్దెలు, తూములు, కాలువలు నివన్నియు ముఱికిగానున్నప్పుడవి ప్రవహింపజేయు వాననీరు మాత్రము ముఱికిగాదా? (ఇట్లే మత ధర్మములు ఆయా ప్రచారకుల లోపములచే దోషభూయిష్ఠములగునని భావము.)
1033. పాపమును పాదరసమును హరించుకొనుట దుర్లభము.
1034. సాధువును గాని, దేవాలయమునుగాని సందర్శింప బోవునపుడు వట్టిచేతులతో బోరాదు. అర్పణచేయుటకై ఏదేని స్వల్పముగనైనను గైకొని వెడలవలయును.
1035. ఇంటిలోనివారు మెలకువతోనున్నయెడల దొంగలు చొరజాలని చందమున నీవు సదా జాగరూకుడవైయున్న పక్షమున చెడు తలంపులు నీ మనస్సున ప్రవేశించి నీ శీలమును హరింపజాలవు.
1036. తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు మొదలగువారి యందుండు రాగమే మాయ. సర్వజీవుల యెడలను సమానముగా బ్రవహించు ప్రేమయే దయ.
1037. జీవించియున్నంతవఱకు నేర్చుకొనుచునే యుందును.
1038. బ్రతికియున్నంతకాలము భక్తిప్రపత్తుల రహస్యములను అనుదినము నేర్చుకొనుచునేయుండుము. దానివలన నీకు మేలు కలుగును.
1039. (పూజ్యభావముచే) ఇతరులు శిరస్సువంచుతావున నీవును శిరస్సు వంచుము. పెద్దలను పూజించుట వ్యర్థముగ బోదు.

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి

- ఇంకాఉంది