సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1040. సదా నీ మత ధర్మములందు నీవు పట్టుదలగలిగి యుండుము, కాని దురభిమానమును పరమతములందహనమును పూర్తిగా విడనాడుము.
1041. భరతుడు, ప్రహ్లాదుడు, శుకదేవుడు, విభీషణుడు, పరశురాముడు, బలి, బృందావన గోపికలు-వీరందఱును తమ పెద్దలు భగవద్విషయమున దమ కడ్డుతగులుటచే వారియెడ నవిధేయులై వర్తించిరి.
1042. నిష్కముడవై- అసంగుడవై- నీ విధ్యుక్తకర్మముల నొనర్చుటయే సర్వోత్తమము.
పారమార్థిక సూక్తులు
1043. ఈశ్వరవాణి యొకప్పుడు పిచ్చివారి నోటను, త్రాగుబోతుల నోటను, పసిబిడ్డల నోటను గూడ వినవచ్చును.
1044. సదా హరినామ సంకీర్తనము జరుగునింట పిశాచము చొరజాలదు.
1045. గంగానదీ తీరమున నివసించువారు ధన్యులు, పవిత్రులు.
1046. గంగాజలమును సామాన్యమైన నీరని భావింపరాదు; బృందావన ధూళిని సామాన్యమైన ధూళియని తలపరాదు: శ్రీశ్రీ జగన్నాథదేవుని మహాప్రసాదమును అన్నముగా నెంచదగదు. ఇవియన్నియు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపములు.
1947. భగవంతుడు సంకల్పించినచో, సూదిబెజ్జమున ఏనుగును దూర్పగలడు. ఇచ్ఛానుసారము ఆతడేమైనను చేయగలడు.
1048. భగవంతుని శరణుజొచ్చినవాని నడవడియందు తడబాటుండదు. ఆరితేఱిన వర్తకుడు తప్పుటడుగువేయడు.
1049. ‘హరి’యనగా మన హృదయములను హరించువాడనియర్థము (హర తీతి హరిః) ‘హరి బల’మనగా హరియే మన బలమని భావము.
1050. ఆత్మప్రబోధము కలుగనిదే భగవంతుని దెలిసికొనజాలము.
1051. భగవంతుని శరణుజొచ్చి లజ్జను భయమును విడిచిపెట్టుము. ‘‘్భగవంతుని పేర నేను నృత్యము చేసినచో, జనులేమనుకొందురో?’’- ఇట్టి భావములను తృణీకరింపుము.
1052., 1953. శ్రద్ధయే అభీష్టవరప్రదాత.
1054. (మనము లక్షింపవలసిన వానిలో) మొదటిది భగవత్ సాక్షాత్కారము. తరువాతిది వాని సృష్టి. వాల్మీకికి రామమంత్రముపదేశింపబడెను. కాని దానిని ‘మరా’ ‘మరా’-యని తలక్రిందుగా జపింపవలయునని యాతడు ఆదేశముపొందెను. ‘మ’అనగా ఈశ్వరుడనియు ‘రా’యనగా జగత్తు అనియు భావము- మొదటిది భగవంతుడు, తరువాతిది జగత్తు.

- ఇంకాఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి