సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్షణం- రూపం
ఒక పుష్పముంటున్నది. చక్కని సుగంధాన్ని అందిస్తున్నది. ఈ సుగంధానికి రూపమేమిటి? అని ప్రశ్నిస్తే సుగంధమునకు రూపములేదు. కాని ఆ గంధమును అందించే పువ్వుకు రూపముంటున్నది. ప్రేమకు రూపమేమిటి? ప్రేమకు రూపం లేదు కాని ప్రేమను అందించే తల్లికి రూపముంటున్నది. ఆ తల్లి లేకపోతే ప్రేమ ఎక్కడినుంచి వస్తుంది? కనుకనే దైవమెక్కడ? దైవమెక్కడ? అని వాదించేవారలకు దైవాన్ని నిరూపించడానికి తగినటువంటి చిహ్నములే ఈ ప్రేమ స్వరూపాలు.
గౌరమ్మా! నీ మొగుడెవరమ్మా!
వివాహము కానటువంటి కన్యవద్దకు వెళ్ళి అమ్మా! నీకు రాబోయే భర్త ఏ రీతిగా ఉంటారు? అంటే ఏమి జవాబు చెప్పగలదు? ఆ భర్త ఎవరో తెలియదు. తెలియనప్పుడు నా భర్త ఇలా ఉంటాడని ఏమి చెప్పగలదు? భర్త ఎవరో తెలియనప్పడు నా భర్త ఇలా ఉంటాడు,
అలా ఉంటాడు అని చెప్పటానికి సాధ్యము కాదు. వివాహము అయిన తరువాతనే తన భర్త యొక్క రూపనామములు చక్కగా బోధించగలదు. అదే విధముగనే భగవంతుని ఆరాధనలు సల్పిన తరువాతనే, అర్పితము గావించుకొన్న తరువాతనే, అనుభవము చేకూరిన తరువాతనే, దైవత్వము ఇట్టిది, అట్టిది అని చెప్పటానికి సాధ్యవౌతుంది. విశ్వసించక పూర్వము, ఆరాధించక పూర్వము, అర్పితము గావించుకొనక పూర్వము దైవము ఇట్టిది అట్టిదని ఎవ్వరు చెప్పగలరు?
విగ్రహాలెందుకు?
‘ఇది మైకు’ అని దీనిని వ్రేలుతో చూపుతున్నాను. మైకును చూసిన తరువాత వ్రేలుతో నీకు అవసరం లేదు. ‘ఇది పువ్వు’అని వ్రేలితో చూపుతున్నాడు. ఈ పూవును చూచిన తరువాత వేలుతో నీకు అవసరం లేదు. అదే విధముగనే దైవమును చూచుట నిమిత్తమై విగ్రహములు ప్రారంభమైనవి. అందని చందమామను ఆ చెట్టుపై ఉన్నట్లుగా వ్రేలుతో చూపుతున్నాము. చెట్టు ఎక్కడ? చందమామ ఎక్కడ? కాని ఈ వ్రేలు యొక్క ఆధారము చేతనే చెట్టునూ, చెట్టు ఆధారంగా చంద్రుని చూడగలుగుతున్నాము. ఆ చూపే వ్రేలు లేకపోయినప్పుడు చంద్రుని చూడటానికి వీలుకాదు. అదే విధముగనే దైవాన్ని చూసేంతవరకు కూడనూ విగ్రహములు అత్యవసరమే. దైవమును చూచిన తరువాత విగ్రహములు అక్కర్లేదు. సర్వమూ దైవమే.
ఏడుపెందుకు?
పుట్టినప్పుడు ఏడ్చినావు, చచ్చినపుడు ఏడ్చినావు. మధ్యమధ్య ఎనె్నన్నో కారణాలకు ఏడ్చినావు. ధర్మగ్లాని కలుగుచుండ ఉద్ధరింప ఏడ్చినావా? దేనికోసం ఏడ్చినావు? ఏడ్పుకోసం ఏడ్చినావా? కాదు.. మనము ఏడ్వవలసినది ఒక్క దైవం కోసమే.
అదే రామకృష్ణుడు కూడనూ చెప్పాడు. ఎవరో బ్రహ్మ సమాజంవారు వచ్చి ప్రశ్నించారు. రామకృష్ణుణ్ణి: ‘రామకృష్ణా! నీవు దైవాన్ని చూచావా?’‘ఆ! చూచాను, చూస్తున్నాను? అతనితోనే తిరుగుతున్నాను. అతని యందే ఉంటున్నాను’ అన్నాడు రామకృష్ణుడు.
‘‘ఏ విధంగా అతనితో తిరుగుతున్నావు? అతను ఎక్కడ ఉన్నాడు? మాకు ఎందుకు కనిపించటం లేదు?’ అన్నారు వారు.
‘ఓ, పిచ్చివాడా’! నీకెలా కనిపిస్తాడు? నీవు ధనముకోసం ఏడుస్తున్నావు, చదువుకోసం ఏడుస్తున్నావు. దైవంకోసం ఏడుస్తున్నావా? ఆయన కోసం ఏడ్వు, నీకు తప్పక కనిపిస్తాడు’, అన్నాడు రామకృష్ణుడు.
ఈనాటి మానవుడు చిల్లర చిల్లర విషయాలకోసం ఏడుస్తున్నాడు. జీవితానికి ప్రాణ సమానమైనటువంటి దైవత్వంకోసము ఏమాత్రం ఏడ్వటం లేదు. దైవ నిమిత్తమై ఏమాత్రము ఏనాడూ విచారించటము లేదు. అది లేనప్పుడు ఎంత ఏడ్చి ఏమి ప్రయోజనం? ఇది ఏడ్పుకోసం ఏడ్చినట్లే.
ఇంకా ఉంది